
కంటైనర్‌లో లోడ్‌చేస్తున్న వ్యాక్సిన్ బాక్స్‌లు
విమానాశ్రయం (గన్నవరం): కోవిడ్ వ్యాక్సినేషన్ నిమిత్తం సోమవారం 4.40 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నాయి. ఎయిరిండియాకు చెందిన ఏఐ 467 విమానంలో 37 బాక్స్‌లలో ప్రత్యేకంగా భద్రపరిచిన వ్యాక్సిన్‌ను ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తరలించారు.
అనంతరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక ఏసీ కంటైనర్‌లో గన్నవరం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తరలించారు. అక్కడి నుంచి రాత్రికి 13 జిల్లాల్లోని టీకా స్టోరేజ్ సెంటర్లకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు.