పేదల ఉన్నతికే సంక్షేమ పథకాల అమలు
విద్య, వైద్య రంగాలకు ఊపిరి పోసిన నాయకుడు ఆయన
మెడికల్ కాలేజీల నిర్మాణంతో ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ ఆవిష్కరణ
పోర్టులు... ఫిషింగ్ హార్బర్లతో అభివృద్ధి దిశగా పయనం
సచివాలయాలు, ఆర్బీకేలతో గ్రామ స్వరాజ్య స్థాపన
ఆయన సంస్కరణలే మళ్లీ విజయపథంలో నడిపిస్తాయి
సాక్షి ఇంటర్వ్యూలో సినీ హీరో కృష్ణుడు
‘రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే ఆ పథకాలు ఉచితాలు కావు. వారి ఉన్నతికి దోహదపడే మార్గాలు. ఇప్పుడవి సత్ఫలితాలిస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపును తప్పనిసరిగా కొనియాడాల్సిందే. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరెంతగానో పురోగమించాల్సి ఉంది. ఈ దఫా కూడా ఆయనే ముఖ్యమంత్రి కావడం తథ్యం. అంతేనా... మరికొన్ని దశాబ్దాలు ఆయన పాలన మన రాష్ట్రానికి ఎంతో అవసరం.’ అన్నారు సినీ హీరో కృష్ణుడు. జగన్ పాలనా సామర్థ్యం వల్లే ఆయన అభిమానిగా మారానని సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
అవి అనవసర ఆరోపణలు
రాష్ట్రంలో రోడ్ల సమస్య గురించి కొందరు చేస్తున్నవన్నీ అనవసర ఆరోపణలు మాత్రమే. రాజోలు ప్రాంతానికి చెందిన నేను తరచుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు మారుమూల ప్రాంతాల్లో కూడా వ్యక్తిగత వాహనం మీద తిరుగుతుంటా. ఎక్కడా రోడ్లు వాహనాలు నడవలేనంతగా బాగోకపోవడం అనేది లేనేలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ల పాటు ప్రకృతి కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల అక్కడక్కడ రోడ్లు కొంత దెబ్బతిని ఉంటే వాటిని అడ్డం పెట్టుకుని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఎందరు ఎన్ని పొత్తులు పెట్టుకుని వచ్చినా జగన్‌ను ఓడించడం సాధ్యం కాదనేది నిరుపేదల గుండెచప్పుడు విన్నవారికి అర్థమవుతుంది.
అక్షరమే ఐశ్వర్యం.. ఆరోగ్యమే మహా భాగ్యం..
చదువును మించిన సంపద లేదని... ఆరోగ్యాన్ని మించిన భాగ్యం లేదని గుర్తించిన ఏకైక నేత వైఎస్ జగన్. ఆయన అధికారంలోకి వచి్చన దగ్గర నుంచి పరిశీలిస్తే ఈ రెండు రంగాలకు ఇచి్చన ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. నాడు–నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను ఆధునికీకరించడం ద్వారా విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పుల్ని ఆయన తీసుకొచ్చారు. అభివృద్ధికి తొలిమెట్టు లాంటి ఆంగ్ల విద్యను, అధునాతన డిజిటల్ విద్యను నిరుపేద చిన్నారులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేద, ధనిక మధ్య అంతరాలను తగ్గించేందుకు బాటలు వేస్తున్నారు.
అభివృద్ధి దిశగా అడుగులు
రాష్ట్రంలో ఎన్నడూ లేనన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం ఇప్పుడు జరుగుతోంది. శరవేగంతో పూర్తవుతున్న ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు వంటివన్నీ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడం తథ్యం. సినిమా నటుడిగా వృత్తిరీత్యా ఎక్కడ ఉంటున్నా... జన్మతః నేనూ పల్లెవాసినే. పల్లెల్లో ఏర్పాటైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ వంటివి వైఎస్ జగన్ మార్క్ అభివృద్ధికి నిదర్శనాలు. ఆయన సమర్థ నాయకత్వంలో అవన్నీ కొనసాగితే గాం«దీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సుసాధ్యం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment