ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరు అంధులు, బధి రుల ఆశ్రమ పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాలలో 462 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు బి.రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ఆయా పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
దరఖాస్తు చేసే విద్యార్థి వయసు 5 సంవత్సరాలు పైబడి ఉండాలని, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు 3 జతచేసి దరఖాస్తులు పంపాలన్నారు. ఈ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, ఉచిత భోజనం, అన్నివేళలా వైద్య సౌకర్యం, హాస్టల్ వసతి, కంప్యూటర్ శిక్షణ కల్పి స్తారన్నారు. విద్యార్థులకు బ్రెయిలీ లిపి, సాంకేతిక బాష నేర్పబడతాయన్నారు.
ఖాళీలు ఇలా..
► విజయనగరంలోని అంధుల ఆశ్రమ పాఠశాలలో 1నుంచి 8వ తరగతి వరకు 43 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు 83175–48039, 94403–59775 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.
► విశాఖపట్నం అంధుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 54 ఖాళీలు ఉన్నాయి. బాలికలకు మాత్రమే. వివరాలకు ఫోన్ 94949–14959, 90144–56753 నంబర్లలో సంప్రదించాలి.
► హిందూపురం అంధుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 106 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు ఫోన్ 77022–27917, 77805–24716 నంబర్లలో సంప్రదించవచ్చు.
► విజయనగరం బధిరుల పాఠశాలలో 1నుం చి 8వ తరగతి వరకు 20 ఖాళీలు ఉన్నాయి. ప్రవేశాల కోసం ఫోన్ 90000–13640, 99638–09120 నంబర్లలో సంప్రదించాలి.
► బాపట్ల బధిరుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 78 ఖాళీలు ఉన్నాయి. ఫోన్ 94419–43071, 99858–37919 నంబర్లలో సంప్రదించవచ్చు.
► ఒంగోలు బధిర పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 136 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు ఫోన్ 94404–37629, 70132–68255 నంబర్లలో సంప్రదించవచ్చు.
► బాపట్ల బధిరుల ఆశ్రమ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలురు, బాలికలకు 25 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు 94419–43071, 99858–37919 నంబర్లలో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment