జర్మనీ అమ్మాయి.. వైజాగ్‌ అబ్బాయి.. పెళ్లేమో అమెరికాలో | Andhra Boy married germany Girl in America | Sakshi
Sakshi News home page

జర్మనీ అమ్మాయి.. వైజాగ్‌ అబ్బాయి.. పెళ్లేమో అమెరికాలో

Published Sat, Aug 20 2022 4:05 PM | Last Updated on Tue, Aug 23 2022 5:31 PM

Andhra Boy married germany Girl in America - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రేమకు కులం, మతం, భాష, ప్రాంతం వంటి బేధాలేవీ ఉండవు అంటారు. ఖండాంతరాలు దాటైనా ప్రేమను గెలిపించుకుంటున్నారు ప్రేమికులు. ఇవన్నీ వినడానికి సినిమా డైలాగుల్లా అనిపించొచ్చు.. కానీ అప్పుడప్పుడు రియల్‌ లైఫ్‌లోనూ ఇలా జరుగుతుంటాయి. తాజాగా ఓ జంట ప్రేమ ఖండాంతరాలు దాటింది. విశాఖ అబ్బాయి..జర్మనీ అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. 

ఇక్కడ విశేషమేమిటంటే..మూడు దేశాల సంబంధంతో ఓ జంట ఒక్కటయ్యింది.   

వివరాల్లోకి వెళ్తే..విశాఖలోని కళాసాగర్‌ అధినేత వానపల్లి శ్రీమన్నారాయణ కుమారుడు దైవిక శశాంక్, జర్మనీకి చెందిన లిండా ముల్లర్‌ ప్రేమించుకున్నారు. ఈ విషయం పెద్దలకు చెప్పడం..వాళ్లు అంగీకరించడంతో ఇటీవల వీరి వివాహం అమెరికా (అమ్మాయి, అబ్బాయి అక్కడ పనిచేస్తున్నారు)లో అంగరంగ వైభవంగా..హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది.  అబ్బాయిది (విశాఖ),అమ్మాయిది(జర్మనీ), పెళ్లయ్యింది అమెరికాలో..  ఫలితంగా ఈ వివాహ బంధం మూడు దేశాలతో ముడిపడినట్టయ్యింది.   

చదవండి: రంగు మారిన విశాఖ సాగర తీరం.. ఎందుకిలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement