
మూడేళ్ల పాలనలో ఎన్నో మంచి పనులకు శ్రీకారం
ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: ఏపీ సీఎంగా మూడేళ్ల పరిపాలన పూర్తిచేసుకున్న సందర్భంగా సోమవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘మీరు చూపి న ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవచేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.
మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2022