3 years of ys jagan government
-
చెప్పింది చేసి చూపిన పాలన
సమాజంలో అట్టడుగున ఉన్నవారిని కూడా ఆకట్టుకోవడం అంత తేలిక కాదు. దానిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సాధించారు. అందుకు కారణం– ఆయన తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారో అది పాటిస్తున్నారు. ఇచ్చిన తొంభై ఐదు శాతం హామీలు నెరవేర్చడం ఏపీలోనే కాదు, దేశ చరిత్రలో కూడా అపురూపమైన ఘట్టమే. ప్రభుత్వ పాఠశాలలను ‘నాడు–నేడు’ కింద బాగు చేయడం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆశ్చర్యపరిచారు. మంత్రివర్గంలో స్థానాలను డెబ్బై శాతం బలహీన వర్గాలవారికి కేటాయించడం కూడా కొత్త చరిత్రే. చెప్పాలంటే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఎన్నో అపురూప విజయాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సరికొత్త మార్పు చూస్తున్నారా? గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పేదవర్గాలు, ధనిక వర్గాల మధ్య పోటీ వాతావరణం ఏర్పడుతోంది. పేదవర్గాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన వివిధ స్కీములకు సంపూర్ణ మద్దతు ఇస్తుంటే, ధనికులలో కొన్ని వర్గాలవారు వ్యతిరేకిస్తున్నారు. ఒకప్పుడు ప్రధాని ఇందిరా గాంధీ సమయంలో ఇలాంటి వాతావరణం ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో సాధించిన అతి గొప్ప విజయం ఇదే కావచ్చు. పేదలు, మధ్య తరగతి వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీ లలో, జగన్ పట్ల విపరీతమైన సానుకూలత ఏర్పడటం పెద్ద విశేషం. అగ్రవర్ణ పేదలలో కూడా జగన్ పట్ల ఆదరణ ఉంది. డబ్బున్నవారిలో మాత్రం ఈ స్కీముల పట్ల కొంత వ్యతిరేకత ఉంది. చెప్పిన నవరత్నాలు అమలు చేయడం జగన్‌కు ఒక సవాలైతే... టీడీపీ, దానికి మద్దతిచ్చే మీడియా సంస్థలను ఎదుర్కోవడం మరింత పెద్ద సవాలుగా మారింది. అయినా మొండిగా ముందుకు కదులు తున్నారు. అనేక కొత్త వ్యవస్థలను తెచ్చి, జగన్ ఇంతటి ఆలోచనా పరుడా అని పలువురు ముక్కున వేలేసుకునేలా చేయగలిగారు. ఎవరైనా నేత ప్రభుత్వంలో ఉండి కొత్త వ్యవస్థలను తీసుకు వచ్చిన ప్పుడు శాశ్వతంగా ప్రజలలో గుర్తుండిపోతారు. జగన్ అధికారంలోకి వచ్చాక సుమారు ముప్పై ఐదు కొత్త స్కీములను ప్రవేశ పెట్టారు. వాటిలో అత్యధికం వేటికవే ప్రాధాన్యం కలిగినవని చెప్పాలి. గ్రామాలలో వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టినప్పుడు ప్రతిపక్ష టీడీపీ మెటికలు విరిచేది. ‘వాలంటీర్లు ఏమి చేస్తారు? ఇళ్లలో మగవారు లేనప్పుడు వెళ్లి ఆడవారిని ఇబ్బంది పెడతా’రని స్వయంగా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు విమర్శిం చారు. పైగా అవన్నీ గోనె సంచులు మోసే ఉద్యోగాలని ఎద్దేవా చేశారు. కానీ ఆ తర్వాత రోజులలో తన పార్టీ కార్యకర్తలకు ఆ ఉద్యో గాలు ఇస్తానని ఆయనే చెప్పారు. అంటే దీనర్థం ‘ఫాలో ద లీడర్’ అన్నట్లుగా జగన్‌ను అనుసరించడానికి ఒప్పుకున్నట్లే కదా? ‘గ్రామ సచివాలయాలలో లక్షన్నర ఉద్యోగాలా?’ అన్నవారు ఉన్నారుగానీ జగన్ చేసి చూపించి తద్వారా ప్రజలకు పాలనను చేరువ చేశారు. ప్రతి నెలా మొదటి తేదీన వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం సరికొత్త రికార్డు. దాంతో వృద్ధులు తమకు ఇచ్చే పెన్షన్ కోసం రోజుల తరబడి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పింది. అంతేకాక వృద్ధాప్య పెన్షన్‌ను రెండువేల నుంచి 2,500 రూపాయలు చేశారు. ఇక రేషన్ షాపుల నుంచి బియ్యం తదితర సరుకులు ఇళ్లకే రావడం ఎవరం కలలో కూడా ఉహించి ఉండం. కానీ జగన్ ఆ పని చేసి చూపెట్టారు. పిల్లలను స్కూళ్లకు పంపితే ప్రతి తల్లికి 15 వేల రూపాయలు ఇస్తానని హామీ ఇస్తే అది ఎలా సాధ్యమని అనుకున్నవారు చాలా మందే ఉన్నారు. కానీ అది సాధ్యమేనని జగన్ రుజువు చేశారు. ప్రభుత్వ బడులను ‘నాడు–నేడు’ కింద బాగు చేయడం ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. వాటికి కార్పొరేట్ లుక్ తెచ్చిన ఘనత జగన్‌దే. చేయూత కింద స్వయం ఉపాధి నిమిత్తం మహిళలకు 18,750 రూపాయలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరచింది. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు వంటివాటిని ప్రారంభించి రాజకీయ ప్రత్యర్థులను విస్తుపరిచారు. ఆయా వర్గాలకు నేస్తం పేరుతో ఆర్థిక సాయం అందించడం జగన్ మాత్రమే చేయగలరని అనుకునేలా చేయడం మరో విశిష్టత. కొత్త జిల్లాల ఏర్పాటు, చివరికి ఎన్టీఆర్ పేరును జగన్ ఒక జిల్లాకు పెట్టడం కూడా ఆసక్తికరమైన అంశమే. జగన్ ఇప్పుడు దావోస్‌లో లక్షన్నర కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. విశాఖలో అదానీ డాట్ సెంటర్, కొప్పర్తిలో పారిశ్రామికవాడ, తీరప్రాంతంలో ఫిషింగ్ హార్బర్లు, ఓడ రేవులు మొదలైన వాటిని ఆరంభించారు. ప్రతిపక్షాలు ఈ అభివృద్ధిని ప్రస్తావించకుండా జాగ్రత్తపడతాయి. వైసీపీ నేతలు కూడా సంక్షే మంలో అమలు చేసే స్కీముల గురించే తప్ప, ఇతర నిర్మాణాత్మక ప్రాజెక్టులను ప్రొజెక్టు చేసుకోవడంలో అంతగా సఫలం అయినట్లు కనిపించదు. అందువల్లే టీడీపీ గానీ, వారి మీడియా గానీ ‘అప్పులు, అప్పులు’ అంటూ ప్రచారం చేయడం ద్వారా జగన్‌కు ఉన్న సాను కూల విషయాలను డైవర్టు చేయాలని విశ్వయత్నం చేస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఒకపక్క జగన్ అప్పులు చేశారనీ, డబ్బును పంచేస్తున్నాడనీ తెలుగుదేశంతో పాటు కొన్ని వర్గాలు ఆరోపిస్తుం టాయి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏభై శాతం పైగా పేదల సంక్షేమానికి ఖర్చుచేశానని వాదిస్తుంటారు. జగన్ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టామని అంటూనే, జగన్ అప్పులు తెస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. జగన్ పాలన మూడేళ్లలో రెండు సంవత్సరాలపాటూ దేశం అంతటితో పాటు ఏపీలో కూడా కరోనా సంక్షోభం అల్లాడించింది. అయినా దానిని తట్టుకుని రాష్ట్రం నిలబడేలా చేశారు జగన్. చంద్రబాబు ఈ విషయం ప్రస్తావించరు. తాను ఉంటే బ్రహ్మాండం బద్దలైపోతుందని చెప్పే చంద్రబాబు తాను ఏపీకి ఏమి చేసింది ఎన్నడైనా చెప్పగలిగారా? అలాగే జగన్ స్కీములు వృథా అనగలిగారా? ఇదంతా జగన్ విజయం కిందే తీసుకోవాలి. గతంలో చంద్రబాబు లక్ష కోట్ల రైతు, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని చెప్పి చేతులెత్తేశారు. కానీ జగన్ తన హామీలను చేసి చూపించారు. అందుకే మహానాడులో ఈ విషయాలపై కాకుండా, ఏదో జనరల్ ప్రసంగం చేస్తూ విమర్శలు సాగించారు. జగన్ చేసి చూపెట్టిన వాటిని కాకుండా అదనంగా తాము ఏమి చేస్తామో చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ క్యాబినెట్‌లోని బలహీనవర్గాల మంత్రులు, ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు వంటివారు సామాజిక న్యాయ భేరిలో మాట్లాడుతూ... అమృతాన్ని దేవతలూ, రాక్షసులూ పంచుకున్నారనీ, అదే చంద్రబాబుకు అవకాశం వస్తే తన బంధు వులకూ, కుటుంబానికీ ఇచ్చుకుంటారనీ విమర్శించారు. మరి అదే జగన్ అయితే బలహీనవర్గాలవారికి పంపిణీ చేస్తారని అన్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల ద్వారా ఆయా స్కీముల లబ్ధి దారులను వేధింపులకు గురి చేస్తే... పార్టీ ప్రాంతం, కులం, మతం వంటివి చూడకుండా జగన్ నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో లక్షా ముప్పైవేల కోట్ల రూపాయలు జమచేసి చరిత్ర సృష్టించారు. జగన్ చెప్పినట్లుగానే మంత్రివర్గాన్ని రెండున్నర ఏళ్ల తర్వాత మార్పు చేయడమే కాకుండా, డెబ్బై శాతం బలహీన వర్గాలవారికి కేటా యించడం కూడా చరిత్రే. మహానాడులో సైతం చంద్రబాబు వీటికి నేరుగా జవాబు ఇవ్వలేకపోయారు. ఇక ప్రభుత్వపరంగా కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు. తొలి రోజులలో ఇసుక విధానంలో మార్పు తీసుకువచ్చే క్రమంలో కొంత ఇబ్బంది అయింది. కౌన్సిల్ రద్దు కాస్త తొందరపాటు నిర్ణయం అన్న అభిప్రాయం ఏర్పడింది. మూడు రాజధానులపై ముందుకు వెళ్లడానికి పలు అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. నిజానికి ఈ మూడేళ్లలో జరిగిన అతి పెద్ద ఘటన అమలాపురంలో మంత్రి విశ్వ రూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను దగ్ధం చేయడమే అని చెప్పాలి. కానీ ఈ ఉదంతం వెనుక కూడా టీడీపీ, జనసేన ఉన్నాయని తేల డంతో ఆ పార్టీలే ఆత్మరక్షణలో పడ్డాయి. వచ్చే రెండేళ్లు జగన్ వీరిపై పోరాడుతూనే, తాను ఇచ్చిన హామీలను మరింత సమర్థంగా అమలు చేయడానికి ప్రయత్నించవలసి ఉంటుంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
సీఎం వైఎస్ జగన్.. మూడేళ్ళ సుపరిపాలనకు సాక్ష్యాలెన్నో
-
మా జెండా.. అజెండా.. ప్రజా సంక్షేమమే
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ ఏలూరు టౌన్: దుష్ట పాలనకు చరమగీతం పాడేందుకు.. జనం కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ఆనాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు. ప్రజాభీష్టంతో విజయభేరి మోగించి అధికారం చేపట్టారు. చరిత్ర సృష్టిస్తూ ఏకంగా 151 సీట్లు కైవసం చేసుకుని విజయగర్జనతో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేశారు. పాలన తొలిరోజు నుంచే ప్రజా సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ నూరుశాతం అమలుకు శ్రమిస్తున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 130కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సంక్షేమ పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో వాడవాడలా వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, శ్రేణులు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు దుస్తుల పంపిణీ, రోగులకు పండ్ల పంపిణీతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్లతో వేడుకలు జరుపుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇలా.. నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్థానిక పార్టీ కార్యాయంలో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ వేసి వేడుకలు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వీరవాసరం మండలంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పాలకొల్లు నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, నాయకులు గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ, చెల్లెం ఆనంద ప్రకాష్ పాల్గొని కేక్ కట్ చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉండి నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, నియోజకవర్గ ఇన్చార్జి గోకరాజు రామరాజు కాళ్ల మండలం పెద అమిరం గ్రామంలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఆచంట నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ సుంకర ఇందిర, పెనుగొండ సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి, నాయకులు చిన్నం రామిరెడ్డి, దంపనబోయిన బాబూరావు తదితరులు కేక్ కట్ చేశారు. తణుకు నియోజకవర్గంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. వృద్ధాశ్రమంలో భోజన వసతి కల్పించారు. పేదలకు పండ్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు ప్రాంతాల్లో స్థానిక నేతలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కార్యదర్శి నల్లమిల్లి విజయానందరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ఇలా.. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కొయ్యలగూడెం మండలంలో మూడేళ్ల పండుగ చేసుకున్నారు. అన్ని మండలాల్లో మండల కన్వీనర్లు, నేతలు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సంత మార్కెట్ వద్ద భారీ కేక్ కట్ చేశారు. దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఘనంగా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. నాలుగు మండలాల్లోనూ స్థానిక నేతలు కేక్ కటింగ్‌లు చేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ స్థానిక నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పట్టణంలో చినగాంధీ బొమ్మ సెంటరులో కేక్ కట్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, పార్టీ నేతలు హాజరయ్యారు. ద్వారకాతిరుమల మండలం నారాయణపురంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. ఎంపీపీ బొండాడ మోహిని, జెడ్పీటీసీ చిగురుపల్లి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక నేతలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. 44వ డివిజన్లో ఎస్సీ, ఎస్టీ జాతీయ నాయకుడు పొలిమేర హరికృష్ణ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. -
రాష్ట్ర దిశ, దశ మార్చేలా సీఎం పరిపాలన
సాక్షి, అమరావతి: ఇచ్చిన మాటకు కట్టుబడి.. సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్ర దిశ, దశను మార్చేలా సుపరిపాలనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు.. విజయవాడ నుంచి పార్టీ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని.. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, వంశీకృష్ణ తదితరులతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. పదేళ్లపాటు కార్యకర్తల పోరాటంవల్లే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. గత మూడేళ్లుగా 95% హామీలను సీఎం జగన్ అమలుచేశారు. 70% పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ, రైతుభరోసా కేంద్రాలు, పునర్వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటుచేసి సుపరిపాలన అందిస్తున్నారు. అలాగే, సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.1.48 లక్షల కోట్లు జమ చేసిన ప్రజా ప్రభుత్వమిది. నామినేటెడ్ పోస్టుల్లో, పనుల్లో 50% రిజర్వేషన్లు మహిళలకు కల్పించిన మహిళా పక్షపాత ప్రభుత్వమిది. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి.. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తూ.. పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నాం. ఇక.. చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది.. సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలోనే చేసి చూపించారు. మహానాడులో తన అనుచరులతో తొడలు కొట్టిస్తూ.. ముఖ్యమంత్రిని తిట్టిస్తూ చంద్రబాబు అమితానందం పొందారు. బాధ్యత గల ప్రతిపక్ష నేత ఎవరైనా ఇలా చేస్తారా? మూడేళ్లలో చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్తున్నారు. చంద్రబాబు తన 14 ఏళ్లలో చేసిన పనులు వివరించండానికి అలా వెళ్లే ధైర్యం ఉందా? 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించడానికి ఎంత చిత్తశుద్ధితో పనిచేశారో.. అంతే చిత్తశుద్ధితో 2024 ఎన్నికల్లో కూడా కార్యకర్తలు పనిచేయాలి. సభ అనంతరం పేదలకు భారీఎత్తున వస్త్రాలు పంపిణీ చేశారు. అన్నదానం చేశారు. బహుజనులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం మోపిదేవి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దళితులను, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తే.. వారికి సీఎం జగన్ అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించారని చెప్పారు. మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ సామాజిక న్యాయం అంటే టీడీపీ, జనసేనలకు ఒక బూటకపు ఎన్నికల నినాదం మాత్రమేనని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు, మాల కార్పొరేషన్ చైర్పర్సన్ అమ్మాజీ, పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న ప్రభుత్వం @3 ఏళ్లు: ఊరూవాడా ‘మూడేళ్ల’ పండుగ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఊరూవాడా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి.. వైఎస్సార్సీపీ పతాకాలను ఆవిష్కరించారు. బైక్ ర్యాలీలు నిర్వహించారు. మూడేళ్లలో సీఎం వైఎస్ జగన్ సాధించిన విజయాలను చాటిచెబుతూ సభలు నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతాన్ని మూడేళ్లలోనే సీఎం వైఎస్ జగన్ అమలుచేయడాన్ని ప్రజలకు వివరించారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.1.41 లక్షల కోట్లు జమచేసి వారికి బాసటగా నిలవడాన్ని గుర్తుచేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కొత్త జిల్లాలు ఏర్పాటుచేసి సంస్కరణల ద్వారా సుపరిపాలన అందిస్తున్నారని నేతలు వివరించారు. మంత్రివర్గం నుంచి స్థానిక సంస్థల వరకూ 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పారని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ నిర్వహించిన బైక్ ర్యాలీలు, సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. సభల అనంతరం పేదలకు భారీ ఎత్తున వస్త్రాలను పంపిణీ చేశారు. అన్నదానం చేశారు. దాంతో ఊరువాడ పండగ వాతావరణం నెలకొంది. గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో కేక్ కట్ చేస్తున్న మంత్రులు జోగి, వనిత, ఆదిమూలపు, మేరుగ విమానాశ్రయంలో మంత్రుల కేక్ కటింగ్ ఇక సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలో పాల్గొన్న మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున సోమవారం బెంగళూరు నుంచి విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు ఏర్పాటుచేసిన కేక్‌ను మంత్రులు కట్ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని వారు ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే ఆఖరు : పెద్దిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు 2024 ఎన్నికలే ఆఖరని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మూడేళ్లు పాలన పూర్తిచేసిన నేపథ్యంలో తిరుపతిలోని తన కార్యాలయం వద్ద ఆయన సంబరాలు నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళుర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో ఇప్పటికే 96 శాతం పూర్తిచేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. 2024 ఎన్నికల్లో గతంలో కంటే అధిక సీట్లు సాధిస్తామన్నారు. మహానాడులో కొందరు టీడీపీ నేతలు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా సీఎం జగన్‌ను వాడు, వీడు, ఒరేయ్ అంటూ సంబోధించారన్నారు. -
జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లవుతోంది.. మనది హామీలను నెరవేర్చే ప్రభుత్వమని ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చి తనది ప్రజా ప్రభుత్వమని చాటారు. పాదయాత్ర అనుభవాలే పునాదిగా, ప్రజల ఆశలు ఆకాంక్షల్ని నెరవేర్చడమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించిన వైఎస్ జగన్.. దాన్ని అమలు చేయాలనే దృఢ సంకల్పంతో పక్కాగా అడుగులు వేశారు. దాంతో ఆయా పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల్లో సంతోషం కనిపిస్తోంది. వారి జీవితాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వమందించే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు గతానికి ఇప్పటికి వున్న తేడాను స్పష్టంగా చెబుతున్నారు. చదవండి: మూడేళ్ల సుపరిపాలనకు సాక్ష్యాలెన్నో! పేద కుటుంబాలను పేదరికాన్నించి బైట పడేయాలనేది అసలైన లక్ష్యం.. అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక పథకాలను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చారు. దాదాపుగా ఈ పథకాలన్నీ ప్రజాసంకల్ప పాదయాత్ర అనుభవాలతో రూపొందినవే.. వాటిలో చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాలున్నాయి. నలభై ఐదునుంచి అరవై సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలకు ప్రతి ఏడాది ఆర్థిక సాయం చేస్తే వారు ఆ డబ్బుతో కుటుంబ ఆదాయాలను పెంచుకుంటారని తద్వారా వారు పేదరికాన్నించి బైటపడాలని ఈ పథకాలను తయారు చేశారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలో చెరుకు రసం విక్రయిస్తు కుటుంబాన్ని నడిపిస్తోంది అనసూరి వెంకటలక్ష్మీ. వెంకటలక్ష్మీ, అప్పారావు దంపతులకు నలుగురు పిల్లలున్నప్పటికీ వారు ఉపాధి కోసం ఇతర ఊళ్ళకు వెళ్లిపోయారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా కష్టాలు పడ్డామని అలాంటి పరిస్థితుల్లో చేయూత పథకం ఆదుకున్నదని వీరు అంటున్నారు. చేయూత ద్వారా ప్రతి సంవత్సరం అందుతున్న 18,750 రూపాయలతో వీరు ఈ చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. వెంకటలక్ష్మి దంపతులకు సొంత ఇళ్లు లేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు వీరికి ఇళ్ల స్థలం లభించేలా చూశారు. చేయూతతోపాటు పలు పథకాలు వెంకటలక్ష్మి అప్పారావులాంటివారికి అందుబాటులోకి వచ్చి వీరి కష్టాలను తీరుస్తున్నాయి. నలభై ఐదు సంవత్సరాలు దాటిన పేద కుటుంబాల మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తే వారు నిలదొక్కుకుంటారనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన. అందుకోసం తయారు చేసిన పథకాలే చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం. వీటిలో చేయూతను ఉపయోగించుకున్నవారిలో కాకినాడ జిల్లా గైగోలపాడుకు చెందిన మల్లేశ్వరి కూడా వున్నారు. ఈమె భర్త చాలా కాలం క్రితమే చనిపోయారు. నలుగురు పిల్లలుంటే వారికి వివాహాలైపోయి ఇతర ప్రాంతాల్లో సెటిలైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చేయూత పథకం ద్వారా లభిస్తున్న డబ్బుతో పచ్చళ్ల వ్యాపారం చేసి కొంతమేరకు ఆదాయం పొందుతున్నట్టు మల్లేశ్వరి అంటున్నారు. చదవండి: మూడేళ్లు.. ఎన్నో మేళ్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన పేద మహిళలకు చేయూత ఉపయోగపడుతోంది. అయితే అదే సమయంలో అగ్రవర్ణ పేద కుటుంబాల మాటేమిటి? వారిని కూడా ఆదుకోవాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలు తలెత్తాయి.. దీనికి సమాధానంగా కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను తీసుకొచ్చారు.. వీటిలో కాపునేస్తాన్ని ఉపయోగించుకొని కొంతమేరకు ఉపశమనం పొందిన వారిలో జగత జ్యోతి వున్నారు. ఈమె రెండు దశాబ్దాల క్రితమే భర్తను కోల్పోయారు. ఒక కుమార్తె వుంటే ఆమెకు వివాహమై వెళ్లిపోయిందని.. తాను మాత్రం నాలుగైదు ఇళ్లలో ఇంటి పనులు చేసుకొని బతుకుతున్నానని జ్యోతి చెబుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈమె కాపులు పేరుకే అగ్రవర్ణమని కాపుల్లో తనలాంటి పేదలు చాలా మంది వున్నారని అంటున్నారు. అగ్రవర్ణాల పేద కుటుంబాల్లో కాపులనే కాకుండా ఇతర అగ్రవర్ణాల పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఈబీసీ నేస్తం రూపొందించి అమల్లోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందినవారిలో మనం చూస్తున్న ఈ బ్రాహ్మణ కులానికి చెందిని శివరామజోగి శర్మ దంపతులున్నారు. కాకినాడ గైగోలపాడుకు చెందిన శివరామజోగిశర్మ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. కరోనా సమయంలో ఆర్థికంగా చితికిపోయామని ఈ మధ్యనే ఈబీసీ పథకం అందిందని వీరు చెబుతున్నారు. చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం...ఈ మూడు పథకాలు నలభై ఐదునుంచి అరవై సంవత్సరాల మధ్యన వయస్సున్న పేద కుటుంబాల మహిళలకు వర్తించే పథకాలు. అరవై సంవత్సరాలు దాటిన మహిళలకు పింఛను వస్తుంది కాబట్టి అంతకంటే తక్కువ వయస్సు వున్న పేద కుటుంబాల మహిళల్ని ఆదుకుంటే అది వారి కుటుంబాల కష్టాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందనేది వైఎస్ జగన్ ఆలోచన. పాదయాత్రలో ఆయనకు వచ్చిన ఈ ఆలోచన మూడు మానవీయ పథకాలుగా రూపొంది ఈ మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తోంది. ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోని శనగపప్పు బజార్లో దాసరి కిషోర్.. కుటుంబం నివసిస్తోంది. భార్య సత్య భారతి గృహిణి.. వీరికి పూజిత అనే కూతురు.. గతంలో లారీ యజమాని అయిన దాసరి కిషోర్ వ్యాపారంలో నష్టం రావడంతో దానిని అమ్మేసి ఆటో కొనుక్కున్నారు. ప్రతి రోజూ ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దాసరి కిషోర్ కుటుంబానికి మొత్తం నాలుగు పథకాలు అందుతున్నాయి. తనకు వాహనమిత్ర, కూతురుకు అమ్మ ఒడి, తండ్రికి వైఎస్సార్ పింఛన్ కానుక, భార్యకు కాపునేస్తం పథకాలు వస్తున్నాయని.. ఇలా అందించే ప్రభుత్వం లభించడం సంతోషంగా వుందని అంటున్నాడు. కరోనా మహమ్మారితో దాదాపు రెండు సంవత్సరాలపాటు భారతదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని దాసరి కిషోర్ స్పందిస్తున్నారు. అర్హత వుంటే చాలు పథకాలు అందించాలనేది ప్రభుత్వ సంకల్పం. అంతే తప్ప ఒక కుటుంబానికి ఒక పథకం అందిస్తే సరిపోతుందిలే అని చేతులు దులుపుకోవడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయం కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సామాన్య కుటుంబాలు తగిన విధంగా ఆర్ధిక అండదండలు పొందుతున్నాయి. ఇక ఇదే ఏలూరులో మరో ఆటో డ్రైవర్ కుటుంబాన్ని సాక్షి టీవీ పలకరించింది.. ఈమె చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. అన్నయ్య దివ్యాంగుడు.. తల్లికేమో వయస్సు మీద పడి తన పని చేసుకుంటే చాలు అన్నట్టుగా వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఈ కష్టాలను తలుచుకొని ఈమె కన్నీళ్లు పెట్టుకొని కుంగిపోలేదు. జీవితం.. తాను అనుకున్నట్టుగా, ఆశించినట్టుగా లేదని అదే పనిగా ఆందోళన చెందలేదు. కష్టమైన పనయినా సరే ఎలాంటి అదురు బెదురు లేకుండా ఆటో డ్రైవర్ పని చేపట్టింది. ఏలూరు నగరంలోని 43వ డివిజన్ ఏకే సెంటర్లో ఆటో డ్రైవర్ ఊట అంబిక కుటుంబం నివసిస్తోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ ఆటో డ్రైవర్ గా మారి ఇంటికి అండగా నిలిచింది.. ఈ పని కష్టమైనదైనప్పటికీ... తప్పనిసరి పరిస్థితుల్లో తన బిడ్డ ఈ పని చేస్తోందని..డిగ్రవీరకూ చదువుకుంది కాబట్టి ఏదైనా ఉద్యోగం వస్తే బాగుంటుందని ఈ పెద్దామె భావిస్తోంది. ప్రస్తుతం అంబికకు వాహనమిత్ర పథకం, అంబిక తల్లి ఊట నూకరత్నానికి వృద్ధాప్య పింఛన్, అంబిక అన్నయ్యకు దివ్యాంగుల పింఛన్ పథకాలు అందుతున్నాయి ఇలాంటి లక్షలాది మంది ఆటో డ్రైవర్లందరిదీ దాదాపుగా ఒకటే పరిస్థితి...బండి తిరిగితేనే బతుకు బండి నడుస్తుంది. ఆటో మీటరు తిరిగితేనే...ఇంటిల్లిపాదీ భోజనం చేయగలుగుతారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల గాధలగురించి పాదయాత్రలో తెలుసుకున్న వైఎస్ జగన్ అదే సమయంలోనే వాహనమిత్ర పథకాన్ని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ పాలన వచ్చిన తర్వాత ఆటో , ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు అండగా వుంటానని భరోసానిచ్చారు. అలా చెప్పిన మాటకు కట్టుబడి తన పాలన ప్రారంభమైన తర్వాత వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తూ ఈ సామాన్య కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. -
తండ్రికి తగ్గ తనయుడు సీఎం జగన్..
-
చంద్రబాబు చేయలేనిది.. సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారు: విజయసాయిరెడ్డి
-
టీడీపీ నిర్వహించింది మహానాడా.. బూతునాడా?
-
చంద్రబాబు 14ఏళ్లలో ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు?
-
పేదవాడికి ప్రతీనెలా పండగే!
-
మూడేళ్ల సుపరిపాలనకు సాక్ష్యాలెన్నో!
కరోనా కష్టకాలంలో అర్ధరాత్రి అపరాత్రి ఫోను మోగితే గుండె జల్లుమనేది! కరోనా పేషెంట్లకు బెడ్లు కావాలంటూ నా నియోజక వర్గం నుంచి బాధితులు ఫోన్లు చేస్తూ ఉండేవారు. బెడ్ల కోసం ప్రభుత్వాసుపత్రికి అర్ధ రాత్రి పరుగులు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వరదలా కరోనా పేషెంట్లు వస్తూ ఉన్నా... ప్రభుత్వాసుపత్రులు నిండిపోతున్నా... అదనంగా బెడ్లు ఏర్పాటు చేస్తూ... ప్రాణాలు చేతబట్టుకొని వస్తున్న పేషెంట్లను కాపాడటానికి సిబ్బంది రాత్రీ, పగలూ తేడా లేకుండా కష్టపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరాయంగా కరోనా పేషెంట్లకు సేవలు అందడం వెనక పాలకుడు జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి, తపన ఉన్నాయి. పాలకుడు చిత్తశుద్ధితో, నిజాయితీగా కష్టపడితే, ప్రజ లను ప్రేమిస్తే... విపత్కర పరిస్థితులను అధిగమించే శక్తి, సామర్థ్యం వ్యవస్థలకు వస్తుందని నిరూపించిన సందర్భం అది! గత ప్రభుత్వపు నిర్లక్ష్యపు జబ్బుతో చేష్టలుడిగిన ప్రభుత్వ ఆసుపత్రులకు జగన్ ముఖ్యమంత్రి కాగానే కాయకల్ప చికిత్స మొదలు పెట్టారు. ఫలితంగానే పేద ప్రజల ప్రాణాలను కరోనా విలయం నుంచి కాపాడటంలో ప్రభుత్వ ఆసుపత్రులు సఫలీకృతం అయ్యాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సరైన ప్రాధమ్యాలు గుర్తించడంలోనే సగం విజయం ఉంటుంది. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులకు కాయకల్ప చికిత్స, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ‘ఆరోగ్య శ్రీ’కి జవసత్వాలు కల్పించడం వంటివి సంక్షేమ పాలనకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా మూడేళ్లు పూర్తవుతోంది. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన ఫలాలు అందుకుంటున్న విషయం అనుభవంలోకి వచ్చింది. చేతిలో మంత్రదండం ఉన్నట్లుగానే ముఖ్యమంత్రి జగన్... సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథ కాలు అందిస్తున్నారు. అంతులేని చిత్తశుద్ధి, పరిమితులు లేని నిజాయితీ ఉంటే తప్ప ఇచ్చిన హామీలన్నింటినీ... కరోనా విపత్తు ఉరిమినా, తరిమినా అమలు చేయడం అసాధ్యం కాదని ప్రజలందరికీ స్పష్టంగా అవగత మయింది. పేదరికంలో అట్టడుగున ఉన్న ఆఖరి వ్యక్తి ఆకలి తీర్చే ఆత్మగౌరవ జెండానూ, అజెండానూ స్వయంగా నిర్దేశించుకొని, వాటి అమలుకు వేస్తున్న ప్రతి అడుగు లోనూ సాహసం ప్రస్ఫుటంగా ఈ మూడేళ్లుగా కనిపిస్తూనే ఉంది. పిల్లలను బడికి పంపే తల్లులకు ‘అమ్మ ఒడి’, కాడికట్టి మేడిపట్టి ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు అండగా ‘రైతు భరోసా’, పేద పిల్లల బంగారు భవిష్యత్‌కు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, ఇప్పటికే ఉన్నత చదువులకు వచ్చిన విద్యార్థులకు మెరుగైన ఉపాధి, నైపుణ్యా భివృద్ధికి చర్యలు, కుటుంబాన్ని పోషించుకుంటూ మరింత వేగంగా అభ్యున్నతి వైపు అక్కాచెల్లెమ్మలు అడుగులు వేయడానికి ‘వైఎస్సార్ ఆసరా’, మహిళా సాధికారతకు దారి చూపే పలు సంక్షేమ కార్యక్రమాలు... ఇవన్నీ ప్రజలను పేదరికం నుంచి బయట పడవేయడమే లక్ష్యంగా మూడేళ్ల పాలనలో అమలు చేయడం జరిగింది. ఇదే లక్ష్యంతో ‘నవరత్నాల’నూ అమలు చేశారు. కులం, మతం, పార్టీ, తన, మన... వంటి ఎలాంటి భేద భావం లేకుండా అర్హతే ప్రామా ణికంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడం ‘సుపరిపాలన’కు సజీవ సాక్షాలుగా నిలిచేవే. కత్తిరింపు ల్లేకుండా అర్హులెవరైనా మిగిలిపోతే వెతికి మరీ వారికి పథకాలు అందించాలంటే... ‘పాలకుడికి ఎంత విశాల హృదయం ఉండాలో కదా!’ అని మనకు అనిపించకమానదు. పేదలు, బడుగు బలహీన వర్గాల ఈతి బాధల పట్ల ఎంతో సహానుభూతి, ఒళ్లంతా కరుణ నిండి ఉంటే తప్ప... పాలనలో సానుభూతి, సహాను భూతి... ఇలాంటి వాటికి స్థానం ఉండదు. పైసా అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, అత్యంత పారదర్శకతతో నగదు బదిలీ ద్వారా మూడేళ్లలో దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల సొమ్ము పేదల ఖాతాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేశారు. ఊరికి కొత్త రూపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మూడేళ్లలో పాతిక వేల శాశ్వత భవనాలు కొత్తగా వెలిశాయి. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు... ఇలా పలు భవనాలు ఆస్తులుగా గ్రామాల్లో మూడేళ్ల సుపరిపాలనకు నిదర్శనంగా నిలబడ్డాయి. కుగ్రా మంలో ఉన్న వారు సైతం సొంత ఊరు దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారా సేవలు పొందుతున్నారు. వలంటీర్లు, సచివాలయాల ద్వారానే 4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది. (క్లిక్: 'పల్లె' వించిన పట్టణీకరణ!) మహిళల భద్రతకు దిక్సూచిగా ‘దిశ’ నిలిచింది. ‘దిశ’ స్ఫూర్తితో దర్యాప్తు, న్యాయస్థానం విచారణలో వేగం పెరిగింది. తప్పు చేసిన వారికి కొద్ది రోజుల్లోనే శిక్షలు పడటం ఇటీవల కొన్ని కేసుల్లో చూశాం. ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగులోనూ అక్కాచెల్లెమ్మల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన, సాధికారత తెచ్చి పెట్టాలనే లక్ష్యం ప్రస్ఫుటమవుతోంది. జనరల్ స్థానా ల్లోనూ మహిళలకు పదవులు ఇచ్చి అధికారాన్ని అప్పగించడం ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం. జనరల్ స్థానాల్లో బీసీలకూ అవకాశం ఇచ్చి బలహీన వర్గాలను అధికారానికి దగ్గర చేర్చి సాధికారత అందించే ప్రయత్నం చరిత్రలో నిలిచి ఉండే అంశం. మూడేళ్ల సుపరిపాలనకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సాక్షులే! (క్లిక్: మూడేళ్లలో సమూల మార్పు.. కొత్త చరిత్ర!) - కైలే అనిల్‌కుమార్ వ్యాసకర్త శాసన సభ్యుడు, పామర్రు, కృష్ణా జిల్లా -
3 Years Of YS Jagan Government: మూడేళ్లు.. ఎన్నో మేళ్లు
‘‘వైఎస్ జగన్ అనే నేను ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను. 3,648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు, పదేళ్లుగా మీలో ఒకడిగా నిలిచినందుకు ఆకాశమంత విజయాన్ని అందించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరుపేరును హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.’’ – 2019 ఏడాది మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలివి. సాక్షి ప్రతినిధి కడప : అన్ని స్థాయిల్లో ప్రక్షాళన, విప్లవాత్మక మార్పులతో పాలన ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి గడిచిన మూడేళ్లలో సరికొత్త సంక్షేమ, అభివృద్ధి పాలనను అందించి ప్రజల మన్ననలు అందుకున్నారు. సొంత జిల్లా వైఎస్సార్ జిల్లాలో సంక్షేమంతోపాటు వేల కోట్లు వెచ్చించి సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఆరోగ్య పథకాలు, అర్హులైన అందరికీ పెన్షన్లు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌషకాహారంతోపాటు పలు పథకాలను అందించారు. అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే కొన్ని పథకాలు పూర్తి కాగా మరికొన్ని పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం. 2019, అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు ప్రభుత్వం చారిత్రాత్మకంగా సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 649 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ స్థాయికి పాలనను తీసుకొచ్చారు. వీటి పరిధిలో 6,490 మంది ఉద్యోగులను నియమించారు. ప్రజలకు పారదర్శకంగా, మెరుగైన సేవలు అందించేందుకు మరో 15 వేల మంది వలంటీర్లను నియమించారు. అన్నదాతలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రభు త్వం రైతు భరో సా కేంద్రాలు నెలకొల్పింది. తద్వారా రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందివ్వడమే కాకుండా వారు పండించిన పంటలను కొనుగోలు చేస్తోంది. వారికి సలహాలు, సూచనలు ఇక్కడి నుంచే అందిస్తోంది. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తోంది. ఉమ్మడి జిల్లాలో రైతు భరోసా వివరాలు ∙గడిచిన మూడేళ్లలో 60 వేల క్వింటాళ్లకు పైగా సబ్సి డీ వేరుశనగ, పిల్లిపెసర, జనుము తదితర విత్తనాలను అందించిన ప్రభుత్వం 3 లక్షల టన్నులకు పైగా రసాయనిక ఎరువులను రైతులకు అందజేసింది. సంక్షేమంతోపాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనుల పూర్తికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది. తెలుగుగంగ, కేసీ కెనాల్ పరిధిలోని కొరవ పనులను పూర్తి చేసి సాగునీటిని అందించింది. జీఎన్ఎస్ఎస్ పరిధిలోని పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రూ. 1000 కోట్లకు పైగానే ఖర్చు చేసిన ప్రభుత్వం తాజాగా మరో రూ. 11 వేల కోట్లతో ఎర్రబల్లి లిఫ్ట్ స్కీమ్, గండికోట సీబీఆర్, గండికోట పైడిపాలెం లిఫ్ట్, పులివెందుల మైక్రో ఇరిగేషన్, జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్, అలవలపాడు లిఫ్ట్, జీఎన్ఎస్ఎస్ మెయిన్‌కెనాల్ విస్తరణ పనులను పూర్తి చేస్తోంది. దీంతోపాటు కుందూ, తెలుగుగంగ లిఫ్ట్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ. 30 వేల కోట్లతో కొప్పర్తి పారిశ్రామికవాడ, గోపవరం, పులివెందుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలను నెలకొల్పుతోంది. ఇప్పటికే జమ్మలమడుగు వద్ద ఉక్కు పరిశ్రమకు శ్రీకారం చుట్టింది. పరిశ్రమల ఏర్పాటుతో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు, తద్వారా 5.20 లక్షలకు ఉపాధి లభిస్తోంది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేసింది. పులివెందులలో రూ. 500 కోట్లతో మెడికల్ కళాశాల, కడప రిమ్స్‌లో రూ. 107 కోట్లతో కేన్సర్ ఆస్పత్రి, రూ. 125 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ బ్లాకు, రూ. 40.81 కోట్లతో మానసిక చికిత్సాలయం, పుష్పగిరి ఐ ఇన్సిట్యూట్లను నెలకొల్పారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి మరిన్ని మెరుగులుదిద్ది 7,41,147 కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇచ్చింది. రూ. 61.44 కోట్లతో రాష్ట్ర రహదారులను, రూ. 126.35 కోట్లతో జిల్లా ప్రధాన రహదారులను, రూ. 141 కోట్లతో పల్లె రహదారులను అభివృద్ధి చేశారు. ఇవి కాకుండా రూ. 1000 కోట్లతో బద్వేలు–మైదుకూరు జాతీయ రహదారి నిర్మాణం, రూ. 18 వేల కోట్లతో కోరుకొండ–అద్దంకి గ్రీన్ పీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే, రూ. 3 వేలకోట్లతో కడప–రేణిగుంట ఎక్స్‌ప్రెస్‌వే జాతీయ రహదారుల నిర్మాణ పనులను చేపట్టారు. గడిచిన మూడేళ్లలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చింది. విద్యా కానుక, ఇతరత్రా పథకాల ద్వారా విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చింది. -
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ సంబరాలు
సాక్షి, అమరావతి : నేటితో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో సోమవారం ప్రత్యేకంగా సంబరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాల నిర్వహణకు వైఎస్సార్సీపీ ఆదేశాలు జారీ చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయసాయిరెడ్డి కేక్ కట్ చేశారు. ఈ వేడుకలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప.గో.జిల్లా సీఎం వైఎస్ జగన్ పరిపాలన మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపముఖ్యమంత్రి తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు స్థానిక పోలీస్ ఐ ల్యాండ్ వద్ద దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం కేక్ కట్ చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు. పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైన సందర్బంగా ఉదయగిరిలో సంబరాలు దివంగత నేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాయకులకు,కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ అనంతపురం జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్న జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ పార్టీ అధికారంలోకి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రొద్దుటూరు లో సంబరాలు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు రోడ్డు లో వైఎస్సార్ విగ్రహం కు పులా మాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు..అనంతరం కేకు కట్ చేసి సంబరాలు చేసుకొన్న వైఎస్సార్ పార్టీ అభిమానులు, నాయకులు నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బనగానపల్లె పట్టణం వైఎస్సార్ విగ్రహం కు పూల మాలలు వేసి సంబరాలు జరుపుకున్న అవుకు మండల పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి పాల్గొన్న సర్పంచ్ ఎల్లమ్మ,జెడ్పీటీసీ సుబ్బ లక్ష్మమ్మ,ఎంపీటీసీ లు,వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు,కార్యకర్తలు తిరుపతి జిల్లా తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం కొలువుతీరి నేటికి మూడేళ్లు పూర్తయిన శుభ సందర్భంగా నారాయణవనం మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళి అర్పించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జెడ్పీటీసీ సుమన్ కుమార్, ఎంపీపీ దివాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైన సందర్బంగా గూడూరులో సంబరాలు దివంగత నేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన పట్టణ కన్వీనర్ బొమ్మిడి శ్రీనివాసులు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ జగన్ మూడేళ్ళ పాలన పూర్తి అయిన సందర్బంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి గాజువాకలో వైఎస్ జగన్ మూడేళ్ళ పాలన పూర్తి అయిన సందర్బంగా గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల సంబరాలు... పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ కార్యకర్తలు నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైన సందర్బంగా ఆత్మకూరులో సంబరాలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో దివంగత వైఎస్సార్‌చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు కేక్ కట్ చేసిన వైఎస్సార్సీపీ ఇంచార్జి మేకపాటి విక్రమ్ రెడ్డి నాయకులకు,కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ తిరుపతి జిల్లా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమత్రిగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా సూళ్లూరుపేట చెంగాళ్ళమ్మను దర్శించుకున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కాకాణి కృష్ణా జిల్లా ఉయ్యూరు లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలన మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అవనిగడ్డ వంతెన సెంటర్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి స్వీట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు -
మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు.. సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఏపీ సీఎంగా మూడేళ్ల పరిపాలన పూర్తిచేసుకున్న సందర్భంగా సోమవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘మీరు చూపి న ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవచేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2022 -
వెలుగుల 'వ్యవసాయం'
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం కల్పిస్తుండటంతో గ్రామసీమల్లో కలలోనూ ఊహించని మార్పులు సాకారమవుతున్నాయి. ఉచిత విద్యుత్ నుంచి ఆర్బీకేల దాకా అన్నదాతలకు సంపూర్ణ సహకారం అందుతోంది. రైతన్నలకు ఏది కావాలన్నా గ్రామాల్లోనే లభ్యమవుతున్నాయి. రెండేళ్లలో 1,38,39,396 మంది రైతులు ఆర్బీకేల సేవలను వినియోగించుకున్నారంటే ఏ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయో ఊహించవచ్చు. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో 2020 మే 30వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం చుట్టిన 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించాయి. వీటి సేవలపై పొరుగు రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. బంగారు స్కోచ్ అవార్డు దక్కించుకోవడమే కాకుండా ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి (ఐరాస) చాంపియన్ అవార్డుకు నామినేట్ కావడం రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది. బయట కంటే తక్కువ రేటుకే.. గతంలో ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తెచ్చుకునేందుకు ఒక్కో రైతుకు రూ.500 నుంచి రూ.1,000 చొప్పున ఖర్చయ్యేది. ఇప్పుడు ఏ ఒక్క రైతూ గ్రామం విడిచి వెళ్లడం లేదు. ఏది కావాలన్నా ఇలా ఆర్బీకేకి వెళ్లి అలా తెచ్చుకుంటున్నారు. మార్కెట్ రేటు కంటే 10 శాతం తక్కువకే దొరుకుతున్నాయి. పొలంబడులతో పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడులు పెరిగాయి. పండిన ధాన్యమంతా ఆర్బీకేల ద్వారా విక్రయించుకుంటున్నారు. రైతు భరోసా, పంట రుణాలు, పంటల బీమా, పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా ప్రతి గ్రామానికీ లబ్ధి చేకూరుతోంది. ఆర్బీకేలో పశు సంవర్ధక సహాయకులు (వీహెచ్ఏ) పశువులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఇంటికి వచ్చి మరీ సేవలందిస్తున్నారు. ఉచితంగా మందులిస్తున్నారు. నాణ్యమైన, ధ్రువీకరించిన మిశ్రమ దాణా, పశుగ్రాసం సరఫరా చేస్తున్నారు. టెస్టింగ్ ల్యాబ్స్ ఆర్బీకేలకు అనుబంధంగా నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 13 వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌తో పాటు నాలుగు రీజనల్ కోడింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ తనిఖీ చేసిన ఉత్పత్తులనే ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆర్బీకేలను బలోపేతం చేసే లక్ష్యంతో రూ.16 వేల కోట్ల అంచనాతో గోదాములతో పాటు పెద్ద ఎత్తున మౌలిక వసతులతో బహుళ ప్రాయోజిత కేంద్రాలు, 10,250 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 18 లక్షల సర్వీసులు.. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు ఉచిత విద్యుత్ అందుతోంది. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ఫీడర్లను రూ.1,700 కోట్లతో ఏర్పాటు చేశారు. 2022–23లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ.5 వేల కోట్లను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. గత సర్కారు దిగిపోతూ అంటగట్టిన రూ.8,559 కోట్ల వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ బకాయిలను సైతం చెల్లించింది. ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ (ఏపీఆర్‌ఏపీఎస్‌సీఎల్) పేరుతో వ్యవసాయానికి ప్రత్యేక డిస్కమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 30 ఏళ్ల పాటు వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని కొనసాగించేలా సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. బాపట్ల జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని కుగ్రామం తొట్టెంపూడి. జనాభా 1,177. ఇక్కడ 650 ఎకరాలకు పైగా పంట భూములున్నాయి. ఆర్బీకేల రాకతో గ్రామంలో స్పష్టమైన మార్పు వచ్చినట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. గతంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం 25 కి.మీ. దూరంలో ఉన్న గుంటూరు వెళ్లాల్సి వచ్చేది. సీజన్లో కనీసం నాలుగైదుసార్లు తిరగాల్సి రావడంతో ప్రయాణ చార్జీలు, రవాణా భారం తడిసిమోపెడయ్యేది. ఇప్పుడు గ్రామంలోనే అన్నీ దొరుకుతున్నాయి. ఆరెకరాల పొలంలో కూరగాయలు సాగు చేసే విజయనగరం జిల్లా రామభద్రపురానికి చెందిన రైతు తూముల తిరుపతి గత సర్కారు హయాంలో విద్యుత్ సక్రమంగా అందక నానా తిప్పలు పడ్డాడు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక 9 గంటలు నిరంతరాయంగా పగటిపూట ఉచిత విద్యుత్ అందుతోందని సంతోషంగా చెబుతున్నాడు. -
సొంతింటి కల సాకారం
బాపట్ల ప్యాడిసన్‌పేటలో 50 ఎకరాల కుపైగా విస్తీర్ణంలో 1,865 ప్లాట్లతో ఏర్పాటైన వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్ అది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అందమైన ఇంటిని కట్టుకున్న పి.సుకన్య కుటుంబం ఇటీవలే గృహ ప్రవేశం కూడా చేసింది. కత్తిపూడి – ఒంగోలు హైవే పక్కనే ఉండటంతో ఇక్కడ భూముల ధరలు చుక్కల్లో ఉన్నాయి. కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న ఆమె భర్త జీతం పిల్లల చదువులకే చాలక ఇన్నాళ్లూ అద్దె ఇంట్లో ఎంతో ఇబ్బంది పడ్డారు. ఖరీదైన ప్రాంతంలో ప్రభుత్వం ఆమెకు ఉచితంగా ఇంటిని అందచేయడంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు తమ ఇంటికి ఆడుకునేందుకు స్నేహితులు వస్తున్నారని ఆమె కుమారుడు ఆనందంగా చెప్పాడు. సాక్షి, అమరావతి: అద్దె ఇళ్లలో ఏళ్ల తరబడి అవస్థలు పడ్డ అక్కచెల్లెమ్మలకు రూ.లక్షల విలువైన స్థిరాస్తి ఉచితంగా సమకూరుతోంది. పేదలకు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలిచ్చి గృహాలను కూడా నిర్మిస్తుండటంతో అద్దె ఇళ్ల కష్టాలకు శాశ్వతంగా తెరపడుతోంది. విలువైన ప్రాంతాల్లో కలల సౌధాలను ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శరవేగంగా సాకారం చేస్తుండటంతో హర్షం వ్యక్తమవుతోంది. దేశంలోనే తొలిసారిగా 31 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలను అందచేసి గృహ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. మొదటి దశలో రూ.28,084 కోట్లతో 15,60,227 ఇళ్ల నిర్మాణం చేపట్టగా వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోపక్క సొంతిల్లు లేని పట్టణ పేదలు సగర్వంగా జీవించేలా అన్ని వసతులతో దాదాపు 2.62 లక్షల టిడ్కో ఇళ్లను ప్రభుత్వం సమకూరుస్తోంది. మూడేళ్లలో రూ.5,646.18 కోట్లతో పనులు చేపట్టడమే కాకుండా ఇటీవల మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఉచితంగా రిజిస్ట్రేషన్లను సైతం చేస్తోంది. గత మూడేళ్లలో 1,13,324 టిడ్కో ఇళ్లు పూర్తికాగా మరో 63 వేలకు పైగా యూనిట్ల పనులు 75శాతం పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతాల్లో కలల సౌధాలు జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన బాపట్లలో ప్యాడిసన్‌పేట లే అవుట్‌కు అర కి.మీ దూరంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఏర్పాటు కానుంది. ఎన్‌హెచ్ 216 విస్తరణ జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ ప్రైవేట్ లేఅవుట్లలో సెంటు స్థలం రూ.7 లక్షల వరకూ పలుకుతోంది. బాపట్ల పరిధిలోనే మూలపాలెం వద్ద 1,054 ప్లాట్లు, వెస్ట్ బాపట్లలో 658 ప్లాట్లతో మరో రెండు వైఎస్సార్ జగనన్న లేఅవుట్లు ఉన్నాయి. ఇవి జమ్ములపాలెం వద్ద నూతనంగా నిర్మిస్తున్న బాపట్ల మెడికల్ కళాశాలకు 2 కి.మీ.లోపే ఉంటాయి. ఇక్కడ సెంటు స్థలం రూ.5 లక్షల పైమాటే. విలువైన ప్రాంతాల్లో స్థలాలను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, పొదుపు సంఘాల ద్వారా పావలా వడ్డీ రుణాలు ఇప్పిస్తోంది. డిసెంబర్ నాటికి అన్నీ అందించేలా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే 300 చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తున్న 1.43 లక్షలకుపైగా టిడ్కో ఇళ్లను నిరుపేదలకు ఒక్క రూపాయికే అందించి రిజిస్ట్రేషన్ సైతం ఉచితంగానే చేసిచ్చారు. 365, 430 చ.అడుగుల ఇళ్లను 50 శాతం సబ్సిడీకే అందిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై మరో రూ.4,250 కోట్లు అదనపు భారం పడుతున్నా వెనుకాడలేదు. డిసెంబర్ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. 30 ఏళ్లు గుడిసెలోనే.. పూరిగుడిసెలో 30 ఏళ్లు గడిపాం. ఎండాకాలం అగ్ని ప్రమాదం జరగడంతో తీవ్రంగా నష్టపోయాం. మా దుస్థితి చూసి బంధువులు కూడా వచ్చేవారు కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఆ కష్టాల నుంచి విముక్తి కల్పించింది. నేడు మాకంటూ ఓ సొంత ఇల్లు ఉంది. – క్రిష్ణమ్మ, శెట్టిపల్లె, చిత్తూరు జిల్లా రూపాయికే రిజిస్ట్రేషన్ చేసిచ్చారు మాకు టిడ్కో ఇల్లు మంజూరైంది. గతంలో రూ.2.55 లక్షలు కట్టమన్నారు. జగన్ బాబు వచ్చాక ఆ డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా రూపాయికే రిజిస్ట్రేషన్ చేసిచ్చారు. ఇక్కడ అన్ని వసతులున్నాయి. – అట్ల విజయలక్ష్మి, నెల్లూరు అదే ఇల్లు ఉచితంగా.. గత ప్రభుత్వ హయాంలో 300 చ.అ టిడ్కో ఇంటికి రూ.2.65 లక్షలు కట్టమన్నారు. జగనన్న వచ్చాక అదే ఇంటిని రూపాయికే ఇవ్వడంతో పాటు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేశారు. అన్ని వసతులు కల్పించారు. – కాకుమాను వరలక్ష్మి, శ్రీకాకుళం అర్హులందరికీ ఇళ్లు స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నిలువ నీడ లేని పేదలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని సమకూర్చటాన్ని సీఎం జగన్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. – జోగి రమేశ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి -
బడి.. బాగుంది
సాక్షి,అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఎప్పుడు కూలిపోతాయో అనే దయనీయ పరిస్థితుల నుంచి బయటపడి సకల వసతులతో కళకళలాడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా చక్కటి వాతావరణాన్ని సంతరించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ ఫలితాలు ఇవన్నీ. ఇప్పటికే తొలివిడత స్కూళ్లలో నాడు–నేడు పనులు పూర్తయి సర్వాంగ సుందరంగా రూపుదిద్దు కోగా ప్రస్తుతం రెండో విడత పనులు జరుగుతున్నాయి. తొలుత ప్రభుత్వ స్కూళ్ల వరకే ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా ప్రణాళిక తయారైనా తదుపరి ముఖ్యమంత్రి జగన్ సూచనలతో ఇతర విద్యాసంస్థలను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. సమున్నత లక్ష్యంతో శ్రీకారం.. సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని స్వయంగా పరిశీలించిన సీఎం జగన్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు పడుతున్న అగచాట్లను గుర్తించారు. కనీస సదుపాయాలు కరువై విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడాన్ని చూసి చలించారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని తెచ్చారు. 45 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో పనులను చేపట్టాలని నిర్దేశించారు. 2019–20లో తొలివిడతగా 15,715 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించారు. నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్తు సదుపాయం–లైట్లు, ఫ్యాన్లు, డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు లాంటి ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్స్, కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేశారు. తొలుత 9 రకాల సదుపాయాల కల్పనకే ప్రణాళికలు రూపొందించినా తదుపరి కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ ల్యాబ్స్ కూడా జోడించారు. రూ.16,450 కోట్లతో 61,661 విద్యాసంస్థల్లో నాడు–నేడు నాడు–నేడు కింద తొలిదశలో 15,715 స్కూళ్లలో రూ.3,697.88 కోట్లతో వివిధ సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. గత ఏడాది ఆగస్టు 16న ముఖ్యమంత్రి జగన్ వీటిని విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చి జాతికి అంకితం చేశారు. అనంతరం మలివిడత నాడు–నేడు పనులను చేపట్టాలని ఆదేశించారు. ఇతర విద్యా సంబంధితసంస్థల్లోనూ నాడు–నేడును అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యాబోధనా శిక్షణ కళాశాల(డైట్స్)లతో పాటు ప్రతిష్టాత్మక శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులో చేర్చారు. తొలివిడతతో కలిపి మొత్తం 61,661 విద్యాసంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల అభివృద్ధి పనులను చేపట్టారు. పేదలకు పెనుభారం తప్పింది ప్రభుత్వ పాఠశాలల్లో రూ.వేల కోట్లతో మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికలు పెరిగాయి. భారీగా డబ్బులు వెచ్చించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివించాల్సిన అవస్థలు తల్లిదండ్రులకు తొలగిపోయాయి. ముఖ్యంగా పేద వర్గాలకు పెనుభారం తప్పింది. కార్పొరేట్ స్కూళ్లకు మించిన సదుపాయాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల చదువులు కొనసాగుతున్నాయి. పక్కా భవనాలతో పాటు వివిధ సదుపాయాలను కల్పించడంతో విద్యార్ధులు ఉత్సాహంగా బడికి వస్తున్నారు. –పారది జ్యోతి, పెదమేడపల్లి ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యురాలు, విజయనగరం జిల్లా నాడు అంతా అధ్వానం.. మా ఊరిలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆనుకొని ఖాళీ స్థలం అపరిశుభ్రంగా ఉన్నా గతంలో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రైవేట్ స్కూళ్లలో చేర్చేవారు. ఇప్పుడు అవస్థలు లేవు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అన్ని సదుపాయాలు కల్పిస్తుండటంతో ప్రవేశాలు పెరుగుతున్నాయి. –అల్లు రాము, చైర్మన్, తల్లిదండ్రుల కమిటీ, కొర్లాం ప్రాథమిక పాఠశాల, విజయనగరం జిల్లా ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లట్లేదు నాడు–నేడు మొదటి విడతలో మా పాఠశాలను ఆధునీకరించాం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ విజయవంతంగా పూర్తి చేసేలా అధికారులు, గ్రామస్తులు సహకరించారు. పాఠశాల చుట్టూ చెట్లు నాటారు. పాఠశాలతో పాటు టీచర్ల ప్రతిష్ట పెరిగింది. చిర‡స్థాయిగా ఉండేలా అభివృద్ధి చేశాం. మొత్తం 63 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎగువపల్లిలో ఏ ఒక్క విద్యార్థీ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లడం లేదు. –పీవీ శ్రీనివాసరెడ్డి, హెచ్ఎం, ఎగువపల్లి ప్రాథమిక పాఠశాల, కదిరి -
'పల్లె' వించిన పట్టణీకరణ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామాలు పట్టణాలయ్యాయి.. పట్టణాలకు ఆనుకుని ఉన్న పల్లెలు వాటిలో అంతర్భాగమయ్యాయి. గ్రామీణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనువుగా గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు చేర్పులు చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు పట్టణ స్థానిక సంస్థలుగా మారడంతోపాటు తొమ్మిది జిల్లాల్లో కొత్తగా 15 మునిసిపాలిటీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి కొత్త బాటలు పడ్డాయి. ప్రధానంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని.. అభివృద్ధికి వినియోగించుకోవడంతో ఆయా గ్రామాల స్థాయి పెరిగింది. జిల్లాలవారీగా కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థలు ఇవే.. అనంతపురం జిల్లాలోని కోనపురం, వెంకటరెడ్డిపల్లిని కలిపి పెనుగొండ పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ని 2020 జనవరిలో ఏర్పాటు చేశారు. ఇదే నెలలో పలు జిల్లాల్లోని మరికొన్ని గ్రామాలు కూడా మునిసిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ► చిత్తూరు జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న కుప్పంలో సమీపంలోని ఏడు గ్రామ పంచాయతీలను కలిపి మునిసిపాలిటీగా మార్చారు. ఇదే జిల్లాలో జనాభా పరంగా పెద్దదైన బి.కొత్తకోట కూడా యూఎల్‌బీగా మారింది. ► గుంటూరు జిల్లాలోని గురజాల, జంగమహేశ్వరపురం పంచాయతీలు కలిసి గురజాల మునిసిపాలిటీగా, దాచేపల్లి, నడికుడి గ్రామాలు కలిసి దాచేపల్లి మునిసిపాలిటీగా ఆవిర్భవించాయి. ► కృష్ణా జిల్లాలోని కొండపల్లి, ఇబ్రహీంపట్నం కలిసి కొండపల్లి మునిసిపాలిటీగా, తాడిగడప, కానూరు, యనమలకుదురు, పోరంకి గ్రామాలు కలిసి వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీగా ఏర్పాటయ్యాయి. ► కర్నూలు జిల్లాలోని బేతంచర్ల, బుగ్గనపల్లి కలిపి బేతంచర్ల యూఎల్‌బీగా ఏర్పాటు చేశారు. ► ప్రకాశం జిల్లాలోని పొదిలి, కంబాలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం గ్రామాలు కలిసి పొదిలి యూఎల్‌బీగా, దర్శి గ్రామ పంచాయతీ ఒక్కటీ మరో యూఎల్‌బీగా ఏర్పాటయ్యాయి. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అల్లూరు, సింగంపేట, నార్త్ మోపూరు గ్రామాలు కలిసి అల్లూరు మునిసిపాలిటీగా, ఇదే జిల్లాలోని అవ్వేరు, కట్టుబడిపాలెం, ఇసకపాలెం, పల్లిపాలెం కలిసి బుచ్చిరెడ్డిపాలెం మునిసిపాలిటీగా ఆవిర్భవించాయి. ► పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, చింతలపూడి గ్రామ పంచాయతీలు వేర్వేరు పట్టణ స్థానిక సంస్థలుగా మారాయి. ► వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం గ్రామ పంచాయతీ సైతం యూఎల్‌బీగా మారింది. ► రాష్ట్రంలో కమలాపురం, ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, దర్శి, బేతంచర్ల, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, కుప్పం, పెనుగొండ మునిసిపాలిటీలు 2020 జనవరిలో ప్రభుత్వ ఉత్తర్వులు ద్వారా ఏర్పాటయ్యాయి. చింతలపూడి, అల్లూరు, పొదిలి, వైఎస్సార్ తాడిగడప, బి.కొత్తకోట మునిసిపాలిటీలను 2021లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పలు గ్రామాలు విలీనం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 డిసెంబర్లో ప్రభుత్వ ఉత్తర్వులు ద్వారా, 2021లో ప్రత్యేక చట్టం ద్వారా రాష్ట్రంలో 23 మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో సమీపంలోని గ్రామాలను విలీనం చేసి ఆయా పంచాయతీల స్థాయి పెంచింది. శ్రీకాకుళం మునిసిపాలిటీలో ఏడు పంచాయతీలు, రాజమహేంద్రవరం కార్పొరేషన్లో పది పంచాయతీలు, భీమిలి మునిసిపాలిటీలో ఐదు పంచాయతీలు, ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్లో ఏడు పంచాయతీలను విలీనం చేశారు. అదేవిధంగా పాలకొల్లు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీల్లో ఐదు పంచాయతీల చొప్పున, తణుకు, భీమవరం మునిసిపాలిటీల్లో మూడు పంచాయతీల చొప్పున కలిపారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ మునిసిపాలిటీలో ఆరు పంచాయతీలు, జగ్గయ్యపేట మునిసిపాలిటీలో మూడు పంచాయతీలను విలీనం చేశారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మునిసిపాలిటీలో మూడు పంచాయతీలు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మునిసిపాలిటీలో రెండు పంచాయతీలు, నాయుడుపేట మునిసిపాలిటీలో రెండు పంచాయతీల్లోని కొంత భాగాలు, మరో పంచాయతీని కలిపారు. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్లో 21 గ్రామాలు విలీనం గుంటూరు జిల్లాలోని మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్లో అత్యధికంగా 21 గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. బాపట్ల మునిసిపాలిటీ సమీపంలో వెలసిన కొన్ని కొత్త ప్రాంతాలు, ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని కొన్ని గ్రామాలను కలిపి దాని స్థాయిని పెంచారు. అదేవిధంగా పొన్నూరు, కందుకూరు, కావలి, గూడూరు మునిసిపాలిటీల్లోనూ పదుల సంఖ్యలో గ్రామాలను, సమీప కాలనీలను విలీనం చేశారు. కర్నూలు కార్పొరేషన్లో సైతం మూడు సమీప పంచాయతీలను కలిపారు. నంద్యాల మునిసిపాలిటీలో కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని కొంత భాగాన్ని విలీనం చేశారు. ఇక పుంగనూరు మునిసిపాలిటీలో రెండు పంచాయతీల్లోని కొంత భాగాన్ని, శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో ఆరు పంచాయతీలను కలిపారు. -
మహిళామణులకు పట్టాభిషేకం
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ జకియా ఖానంను పెద్దల సభగా పేరొందిన శాసనమండలి వైస్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టడం ద్వారా మహిళా మణులకు అత్యున్నత గౌరవం కల్పించారు. రాష్ట్రంలో ముందెన్నడూ లేనివిధంగా ఒక ముస్లిం మహిళకు పెద్ద బాధ్యతలు అప్పగించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారు. బీసీ మహిళ అయిన ఉప్పాల హారికకు కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బాధ్యతలు అప్పగించి తన ఆదర్శాన్ని చాటారు. జనరల్ మహిళకు కేటాయించిన కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ పదవిని బీసీ మహిళకు కట్టబెట్టిన సీఎం జగన్ రాజకీయ రంగంలో మహిళా లోకానికి కొత్త దారులు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో మహిళామణులకు పదవుల పట్టాభిషేకం చేయడంలో సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలో రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా రాజకీయంగా, ఆర్థికంగా మహిళల సాధికారత, స్వావలంబనకు విప్లవాత్మక చర్యలు చేపట్టిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తలెత్తుకుని దేశం ముందు సగర్వంగా నిలబడేలా చేశారు. మంత్రి వర్గంలోనూ పెద్దపీట మంత్రివర్గంలో మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. 2019 మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు స్థానం కల్పించగా.. 2022 మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో నలుగురు మహిళలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. రెండు పర్యాయాలు కూడా కీలకమైన హోంశాఖను దళిత మహిళలకే అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖను తానేటి వనిత, ఆరోగ్య శాఖను విడదల రజని, మహిళా శిశు సంక్షేమ శాఖను ఉషశ్రీ చరణ్, పర్యాటక, యువజన సర్వీసుల శాఖను ఆర్కే రోజాకు అప్పగించడం విశేషం. పదవులు.. పనుల్లో 50 శాతం రిజర్వేషన్ చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని 1993 నుంచి పార్లమెంట్లో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ.. ఇప్పటివరకు కేటాయించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఏ డిమాండ్లు, ఏ ఉద్యమాలు లేకుండానే.. ఎవరు అడగకపోయినా సీఎం వైఎస్ జగన్ చొరవ తీసుకుని రాష్ట్రంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, నామినేషన్ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. గడచిన మూడేళ్లలో మహిళలకు 50 శాతానికి మించి పదవులు కట్టబెట్టడం గమనార్హం. నామినేటెడ్, కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో మహిళలకు 51 శాతం వాటా దక్కింది. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్ పదవులు 202 ఉంటే.. వాటిలో 102 చైర్పర్సన్ పదవులను మహిళలకే ఇచ్చారు. 1,154 డైరెక్టర్ పదవుల్లో 586 పదవులు కూడా మహిళలకే కట్టబెట్టారు. 202 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో 102 మహిళలకే కేటాయించారు. 1,356 రాజకీయ పదవుల నియామకాల్లో 688 పదవులు అంటే 51 శాతం అక్కచెల్లెమ్మలకే ఇచ్చారు. వార్డు పదవి నుంచి జెడ్పీ చైర్మన్ వరకు.. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ ఎన్నికలు జరగ్గా.. వాటిలో 7 జిల్లాల జెడ్పీ పీఠాలను మహిళలకు కేటాయించడం ద్వారా 54 శాతం అవకాశం కల్పించారు. 26 జెడ్పీ వైస్ చైర్మన్లలో 15 మంది మహిళలే. మొత్తంగా 12 మేయర్, 24 డిప్యూటీ మేయర్ కలిపి 36 పదవులు ఉంటే.. వాటిలో 18 పదవులు మహిళలవే. వార్డు మెంబర్లు 671 మందిలో 361 మంది మహిళలే ఉన్నారు. 75 మునిసిపాలిటీల్లో 45 మంది మహిళా చైర్పర్సన్లే. మునిసిపాలిటీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 పదవులు మహిళలకే దక్కాయి. గ్రామ సర్పంచ్ పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీ పదవుల్లో 54 శాతం, మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం మహిళలకే పట్టాభిషేకం చేయడం విశేషం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అమలులోకి తెచ్చిన వలంటీర్ ఉద్యోగాలు 2.60 లక్షల మందిలో 53 శాతం యువతులే సేవలు అందిస్తుండటం గమనార్హం. ప్రతి వార్డు, గ్రామ సచివాలయంలోనూ మహిళా పోలీస్‌లను నియమించారు. మహిళా సంక్షేమంలోను ముందడుగు మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లకు జమ చేస్తోంది ప్రభుత్వం. మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టి వారి పురోగతికి ఊతమిస్తోంది. ఈ మూడేళ్లలో (ఈ ఏడాది ఏప్రిల్ వరకు) రూ.1,22,472.23 కోట్ల లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం మహిళా సంక్షేమంలో ముందడుగు వేసింది. వాటిలో మచ్చుకు కొన్ని వివరాలు ఇవి.. ► రాష్ట్రంలో పేదింటి అక్కచెల్లెమ్మలకు సొంతింటి కలను నిజం చేస్తూ ప్రభుత్వం పారదర్శకంగా 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది. వారికి శాశ్వత గృహ వసతితోపాటు మౌలిక సదుపాయాలను సమకూర్చే యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఇందుకుగాను 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక స్కోచ్ మెరిట్ ఆఫ్ ఆర్డర్ అవార్డు కూడా లభించింది. ► 2019 ఎన్నికల రోజు వరకు మహిళలకు ఉన్న పొదుపు సంఘాల రుణాలను మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో వారి చేతికే అందించేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో 7.97 లక్షల పొదుపు సంఘాల్లోని 78.76 లక్షల మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.25,517 కోట్లను నాలుగు విడతలుగా నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించి ఇప్పటి వరకు (ఈ ఏడాది ఏప్రిల్) రూ.12,758 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో పొదుపు సంఘాల ద్వారా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ మొత్తాన్ని ఆయా సంఘాల రుణ ఖాతాల్లోనే జమ చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ తోడ్పాటుతో 99.27 శాతం సంఘాలకు చెందిన అక్కచెల్లెమ్మలు సకాలంలో రుణాల కిస్తీలను చెల్లిస్తున్నారు. ఈ విషయంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. డ్వాక్రా సంఘాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి వడ్డీ శాతం 13.5 నుంచి 9.5 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు 1.02 కోట్ల మందికి రూ.3,615 కోట్లు వడ్డీ సాయం అందించింది. ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు పోషకాహారాన్ని అందించేందుకు ఇప్పటివరకు 34.19 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,895.45 కోట్లు ఖర్చు చేసింది. ► వైఎస్సార్ చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ డబ్బులు వారి జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు 24.96 లక్షల మందికి రూ.9,180 కోట్లను ప్రభుత్వం అందజేసింది. ► స్వేచ్ఛ పథకం కింద రుతుక్రమ సమయంలో స్కూళ్లకు వెళ్లలేక బాలికలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7వ తరగతి నుంచి 12వ వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి రూ.32 కోట్లతో నాప్కిన్లు అందించారు. ► మహిళల సత్వర రక్షణే ధ్యేయంగా, దోషులకు సత్వర శిక్షే లక్ష్యంగా.. మహిళల సమస్యలకు నూరు శాతం పరిష్కారం చూపేలా దిశ బిల్లు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ► పూర్తిస్థాయిలో మహిళా కమిషన్ ఏర్పాటు చేసి మహిళలు, చిన్నారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు వారికి భరోసా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
జిల్లాల విభజనతో ప్రజలకు పాలన చేరువ
సాక్షి, అమరావతి: చెప్పిన ప్రతి మాటను నెరవేర్చే క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ జగన్ ప్రభుత్వం జిల్లాలను విభజించింది. 42 ఏళ్ల తర్వాత ఆంధ్ర ప్రాంతంలో జిల్లాల విభజన జరిగింది. చివరిసారిగా 1979 జూన్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో అప్పట్లో విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకుముందు 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రా ప్రాంతంలో ఏర్పడిన జిల్లాలు ప్రకాశం, విజయనగరం మాత్రమే. మిగిలిన 11 జిల్లాలు బ్రిటిష్ హయాంలో ఏర్పాటైనవే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత.. తెలంగాణ విడిపోయిన అనంతరం.. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం శాస్త్రీయంగా జిల్లాలను విభజించింది. ఇప్పుడు కొత్త జిల్లాల్లో పరిపాలన సజావుగా సాగుతోంది. పాలన ప్రజలకు మరింత చేరువైంది. పరిపాలన వికేంద్రీకరణ, భౌగోళిక అనుకూలత, సెంటిమెంట్లకు పెద్దపీట పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించి రాష్ట్రానికి కొత్త రూపు ఇచ్చింది. 51 రెవెన్యూ డివిజన్లను 74కి పెంచి పరిపాలనకు మరింత వెసులుబాటు కల్పించింది. పరిపాలన సౌలభ్యం, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పకడ్బందీగా విభజన ప్రక్రియ చేయడంతో అన్ని వర్గాల ఆమోదం లభించింది. విభజనకు ముందు ప్రభుత్వం విస్తృత అధ్యయనం, సుదీర్ఘ కసరత్తు చేసి పూర్తి శాస్త్రీయతతో నిర్ణయాలు తీసుకుంది. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా జిల్లాలను విభజించింది. సాధ్యమైనంతవరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చింది. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు రెవెన్యూ డివిజన్‌గా మార్చలేదు. జిల్లాల విభజన సమయంలో చంద్రబాబు కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను కోరడంతో ప్రభుత్వం అంగీకరించి ఆ డివిజన్ ఏర్పాటు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేశారు. సంవత్సరాల ఆకాంక్షల మేరకు.. తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని, అత్యంత ప్రముఖుల పేర్లను జిల్లాలకు పెట్టాలనే డిమాండ్లు పలుచోట్ల అనేక సంవత్సరాలుగా ఉన్నాయి. ఇలాంటి అనేక అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. స్థానిక ప్రాధాన్యాన్ని, కొన్ని ప్రాంతాలకు ఉన్న చారిత్రక నేపథ్యం, స్థానిక పరిస్థితులను గుర్తించి కొత్త జిల్లాల్లో ప్రతిబింబించేలా చూసింది. అదే సమయంలో పాత జిల్లాల ప్రాధాన్యం, ప్రాశస్త్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. మన్యం విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటం జరిపిన ప్రాంతాన్ని ఆయన పేరుతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. పాడేరు కేంద్రంగా ఆ జిల్లాను ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వం ఆ డిమాండ్‌ను నెరవేర్చింది. పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటుతో గిరిపుత్రులకు గౌరవం ఇచ్చింది. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం దెబ్బతినకుండా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం ప్రత్యేకతను తెలియజెప్పేలా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసి అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించింది. దానికి డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టి రాజ్యాంగ నిర్మాతను గౌరవించింది. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాగా, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాగా మార్చి వాటి ప్రాధాన్యతను కొనసాగించింది. ఎన్టీఆర్ జన్మించిన కృష్ణాజిల్లాకు ఆయన పేరు పెట్టాలని చాలాకాలం నుంచి కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వస్తే కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. ఆ మాట నెరవేరుస్తూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాన్ని కృష్ణాజిల్లాగా కొనసాగించి దాని చారిత్రక ప్రాధాన్యతను నిలబెట్టారు. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ప్రత్యేకతను నిలబెడుతూ పల్నాటి పౌరుషాన్ని ప్రతిబింబించేలా నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసింది. బాపట్లను జిల్లాగా చేయాలని సుదీర్ఘకాలంగా ఉన్న కల నెరవేరింది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా, ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య నడయాడిన రాయచోటి ప్రాంతాన్ని ఆయన పేరుతో అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసింది. -
బడుగులకు బలిమి
సాక్షి, అమరావతి: సంచార జాతికి చెందిన ఈయన పేరు పెండ్ర వీరన్న. ఉండేది పూరి గుడిసెలో. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురం సౌత్ గ్రామానికి చెందిన వీరన్న సంచార జాతుల అభ్యున్నతి కోసం అహరహం శ్రమించేవారు. వీరన్న కృషిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనను అత్యంత వెనుకబడిన సంచార జాతుల (ఎంబీసీ) కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఈమె పేరు జింకా విజయలక్ష్మి. న్యాయవాద వృత్తి చేపట్టి సివిల్, క్రిమినల్ కేసుల వాదనలో పట్టు సాధించారు. సామాజిక, రాజకీయ రంగాల్లో చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఆమెకు ఏపీ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు సీఎం వైఎస్ జగన్. వీరిద్దరే కాదు.. వెనుకబడిన తరగతులకు చెంది.. నాయకత్వ లక్షణాలు కలిగి.. తమ జాతి అభివృద్ధిని కాంక్షించే వారిని, రాజకీయ రంగం ద్వారా సమాజానికి మేలు చేయాలనే తపన గల వారిని ఏరికోరి వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో 139 బీసీ కులాలకు 56 వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లను 2020 అక్టోబర్‌లో ఏర్పాటు చేశారు. ఆయా సామాజిక వర్గాల్లోని పేదలకు అండగా నిలిచి ఇబ్బందులను దూరం చేసేలా.. వారందరికీ ఆర్థిక, సామాజిక బలిమి చేకూరేలా సంబంధిత కార్పొరేషన్లను తీర్చిదిద్దారు. కార్పొరేషన్లను సామాజిక చైతన్య వేదికలుగా మలిచి రాష్ట్రంలో కొత్త చరిత్రకు సీఎం జగన్ నాంది పలికారు. వాస్తవానికి వెనుకబడిన తరగతుల్లో బయట ప్రపంచానికి పేర్లు సైతం తెలియని కులాలను కూడా గుర్తించారు. అత్యంత వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురైన అనేక కులాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కార్పొరేషన్‌కు ఒక చైర్మన్, 12 డైరెక్టర్లను నియమించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక రికార్డు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్ల చైర్మన్లు, 672 డైరెక్టర్ల పదవుల్లో 50 శాతం పదవులను మహిళలకే కట్టబెట్టి మరో రికార్డును నెలకొల్పారు. -
గంగపుత్రులకు బాసటగా..
సాక్షి, అమరావతి: నిత్యం నడిసంద్రంలో బతుకుపోరు సాగించే గంగపుత్రుల బెంగ తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో వారి అభివృద్ధికి బాటలు వేసింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా గంగపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపడడమే కాదు.. మత్స్యరంగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బెస్ట్ మెరైన్ స్టేట్–2021 అవార్డుతో పాటు డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్‌లో స్కోచ్ అవార్డులు వరించాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సుడిగుండంలో చిక్కుకున్న నావలా మారిన మత్స్యకారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చుక్కానిలా మారి ఒడ్డుకు చేర్చారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరం వెంబడి 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా 2018–19లో 39.92 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తులు 2021–22 సీజన్లో ఏకంగా 48.13 లక్షల టన్నులకు చేరాయి. ఈ ఉత్పత్తులు మూడేళ్లలో ఎనిమిది లక్షల టన్నుల మేర పెరిగాయి. రాష్ట్రంలో ఆక్వారంగంపై ఆధారపడి 2018–19లో 16.46 లక్షల మంది జీవనోపాధి పొందారు. వారి సంఖ్య 2021–22 నాటికి 26.50 లక్షలకు పెరిగింది. మత్స్యకారులు, ఆక్వారైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) 738 మంది మత్స్యసహాయకులను నియమించింది. మత్స్యరంగ సుస్థిరాభివృద్ధి కోసం ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్టుతో పాటు ఏపీ ఫిష్, సీడ్ యాక్టులను తీసుకొచ్చింది. ఈ–ఫిష్ ద్వారా 4.49 లక్షల ఎకరాల ఆక్వాసాగును క్రమబద్ధీకరిస్తోంది. 6,854 మంది మత్స్యకారులకు కేసీసీ కార్డుల జారీ ద్వారా రూ.11.41 కోట్ల రుణసాయం అందించింది. ఆర్బీకేల ద్వారా 13,945 మత్స్యసాగు బడుల నిర్వహణతో నాణ్యమైన దిగుబడులను పెంపొందించేందుకు ఆక్వారైతులకు శిక్షణ ఇచ్చింది. సంక్షేమ పథకాలతో బాసట టీడీపీ హయాంలో కుటుంబానికి రూ.2 వేల చొప్పున రెండేళ్లు, ఆ తర్వాత రూ.4 వేల చొప్పున మూడేళ్లు మత్స్య వేట నిషేధ భృతి ఇచ్చారు. ఇలా టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.104.62 కోట్ల భృతి అందజేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచింది. ఈ మూడేళ్లలో రూ.418.08 కోట్లను మత్స్యకారులకు అందించింది. టీడీపీ హయాంలో నిషేధకాలం ముగిసిన తరువాత ఏడాదికిగానీ సొమ్ము అందేదికాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేట నిషేధకాలం ముగియకుండానే వారి ఖాతాల్లో జమచేస్తోంది. బోట్లకు డీజిల్ లీటర్‌కు రూ.6.03 వంతున సబ్సిడీగా టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 460 బోట్లకు రూ.60.12 కోట్ల లబ్ధిచేకూర్చింది. ఈ సబ్సిడీని లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో 17,770 బోట్లకు రూ.89.17 కోట్ల లబ్ధికలిగించింది. గతంలో మాదిరి కాకుండా స్మార్ట్ కార్డుల ద్వారా సబ్సిడీ పోను మిగిలిన మొత్తం చెల్లించే విధంగా ఏర్పాటు చేసింది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయే మత్స్యకారులకు ఇచ్చే నష్టపరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో 116 బాధిత కుటుంబాలకు రూ.11.60 కోట్ల సాయం అందించింది. ఆక్వా చెరువులకు అందించే విద్యుత్ ధరను యూనిట్‌కు రూ.3.86 నుంచి రూ.1.50కు తగ్గించడమేగాక 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. గడిచిన మూడేళ్లలో రూ.2,290.11 కోట్ల మేర ఆక్వారైతులు విద్యుత్ సబ్సిడీ ద్వారా లబ్ధిపొందారు. ఇక జీఎస్పీసీ పైపులైన్ నిర్మాణం వల్ల జీవనోపాధి కోల్పోయిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన 38,282 కుటుంబాలకు రూ.178.04 కోట్ల సాయం అందించింది. మౌలిక సదుపాయాలకు పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇన్పుట్స్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తీరప్రాంతాల్లో రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. వీటికి ఐఎస్వో గుర్తింపు తీసుకొచ్చింది. ► పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వద్ద రూ.332 కోట్లతో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. ఇటీవలే రూ.100 కోట్లతో తొలిదశ పనులకు టెండర్లు కూడా పిలిచింది. ► రూ.3177కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తోంది. రూ.155 కోట్లతో విశాఖపట్నం, కాకినాడ ఫిషింగ్ హార్బర్లను ఆధునికీకరిస్తోంది. వీటిద్వారా 76,230 మందికి ప్రత్యక్షంగా, 35 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ► 40 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లను రూ.90.44 కోట్లతో పునరుద్ధరించడమేగాక రూ.86.95 కోట్లతో కొత్తగా 4 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తోంది. ► విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద రూ.36.55 కోట్లతో ఆక్వాటిక్ క్వారంటైన్ కేంద్రం, గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం పరసావారిపాలెంలో రూ.14.20 కోట్లతో పసుపుపీత హేచరీ, రూ.23.78 కోట్లతో పండుగప్ప హేచరీ ఏర్పాటు చేస్తోంది. ► పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడి వద్ద రూ.5.26 కోట్లతో బ్రూడర్ బ్యాంక్, అనంతపురంలో రూ.5 కోట్లతో తలాపియా బ్రీడింగ్ సెంటర్‌తో పాటు రూ.184 కోట్లతో గుంటూరు జిల్లా పరసావారిపాలెం వద్ద 280 ఎకరాల్లో మెగా ఆక్వాపార్క్ ఏర్పాటు చేస్తోంది. ► మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచేందుకు 70 ఆక్వాహబ్స్తో పాటు 14 వేలకు పైగా రిటైల్ అవుట్ లెట్స్‌కు శ్రీకారం చుట్టింది. తొలిదశలో రూ.325.15 కోట్లతో 25 ఆక్వాహబ్‌లు ఏర్పాటు చేస్తోంది. రూ.546.97 కోట్లతో 10 ప్రాసెసింగ్, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. -
AP: పరేశాన్ లేకుండా ఇళ్లకే రేషన్
► ఈ ఫొటోలోని అవ్వ పేరు.. తెర్లి మహాలక్ష్మి. వయసు 75 ఏళ్లకు పైమాటే. ఈమెది పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలం పెద్దూరు. 15 ఏళ్ల కిందట భర్త మరణించాడు. కుమార్తె పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోవడం, కొడుకు ఉపాధి వెతుక్కుంటూ కుటుంబంతో కలిసి విశాఖపట్నానికి వలస పోవడంతో ఒంటరిగా చిన్నగదిలో కాలం వెళ్లదీస్తోంది. ఒంటిలో పని చేసే సత్తువ లేని తరుణంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యమైన, ఫోర్టిఫైడ్ చౌక బియ్యమే అవ్వ ఆకలి తీరుస్తోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చే బియ్యం దొడ్డుగా, రాళ్లు, నూకలు ఉండేవని.. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం బాగుంటున్నాయని అవ్వ చెబుతోంది. తనకు నెలకు 20 కిలోల బియ్యంతోపాటు వృద్ధాప్య పింఛన్ కూడా ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ► ప్రజలందరూ రేషన్ పంపిణీ వాహనం చుట్టూ చేరి రేషన్ తీసుకుంటున్న ఈ చిత్రం.. విశాఖ ఏజెన్సీలోని జంగంపుట్టులోనిది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని గుల్లేలు పంచాయతీ 12 గ్రామాల్లోని ఓ పల్లె.. జంగంపుట్టు. గ్రామస్తులు ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే 9 కిలోమీటర్ల దూరంలోని రాయిమామిడికి వెళ్లాల్సి వచ్చేది. రేషన్ బియ్యం కోసం రోజు కూలి పోగొట్టుకుని కాలినడకన బయలుదేరి గుర్రాలపై బియ్యం మూటలను వేసుకొచ్చేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డు వేయడంతో గుల్లేలు పంచాయతీలో రేషన్ డిపో వచ్చింది. ఇప్పుడు అన్ని గ్రామాలకు వాహనాల్లో రేషన్ సరుకులు వెళ్తున్నాయి. ప్రజలు వారి ఇంటి వద్దే నాణ్యమైన రేషన్ తీసుకుంటున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి చెరగని బాటలు వేస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో చేపట్టిన రేషన్ సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం చౌక డిపోల ద్వారా నాణ్యమైన రేషన్ బియ్యాన్ని.. అది కూడా లబ్ధిదారులకు ఇంటి వద్దే అందిస్తూ వారి ఆకలిని తీరుస్తోంది. దీనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన రేషన్ బియ్యమే పేదల పాలిట పరమాన్నమైంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రజలు ఏ రకం బియ్యం తింటున్నారో.. వాటినే రేషన్ దుకాణాల్లో అందించాలని సీఎం వైఎస్ జగన్ఆదేశించారు. దానికి అనుగుణంగా 2019 సెప్టెంబర్‌లో శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా నాణ్యమైన బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం 2021 ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం సరఫరా చేయడంతోపాటు రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పుడది దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శనీయంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల పంజాబ్‌లో కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం ‘ఘర్ ఘర్ రేషన్ యోజన’ పేరుతో లబ్ధిదారుల ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేస్తుందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్సింగ్ ప్రకటించారు. మరో 8 రాష్ట్రాలు సైతం ఈ విధానంపై అధ్యయనం చేస్తుండటం విశేషం. రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరికి పంపిణీ చేసేందుకు నెలకు 2.31 లక్షల టన్నుల బియ్యం అవసరం. అయితే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేవలం 90 లక్షల కార్డులకు 1.54 లక్షల టన్నుల బియ్యాన్ని.. అది కూడా సాధారణ బియ్యాన్ని మాత్రమే అందిస్తోంది. మిగిలిన కార్డులకు అవసరమైన 77 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో కొనుగోలు చేసి పంపిణీ చేస్తోంది. ఇందుకు ప్రభుత్వంపై నెలకు రూ.344 కోట్ల భారం పడుతోంది. ఇందులో నాణ్యమైన బియ్యాన్ని (సార్టెక్స్ చేసి) ఇచ్చేందుకు రూ.23.08 కోట్లు అదనపు భారాన్ని మోస్తోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో బియ్యం సబ్సిడీపై చేసిన ఖర్చు రూ.12,377 కోట్లయితే.. వైఎస్ జగన్ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున నాణ్యమైన బియ్యమిస్తూ ఈ మూడేళ్లలోనే రూ.12,400 కోట్లు సబ్సిడీకి వెచ్చించింది. ఈ ఏడాది మరో రూ.4300 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద బియ్యం ఇస్తున్నప్పటికీ వాటి రవాణా, డీలర్ కమీషన్ తదితర ఖర్చుల కింద ఏడాదికి రూ.500 కోట్లకు పైనే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ప్రజలకు దగ్గరై.. కష్టాలను దూరం చేసి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారుల ఇంటి వద్దే నాణ్యమైన రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. రేషన్ దుకాణాల్లో గంటల పాటు క్యూలో నిల్చుని రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో పాటు ఒక రోజు పనిని వదులుకుని, కూలి పోగొట్టుకోవాల్సి వచ్చేది. ఇటువంటి వారి కోసం రూ.530 కోట్లకు పైగా వ్యయంతో 2021 ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా 9,260 మొబైల్ వాహనాలతో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ యువతకు ఉపాధిని కల్పించారు. రేషన్ డోర్ డెలివరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహనదారుడితోపాటు హెల్పర్ల కింద సుమారు 17 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. నెలలో 18 రోజులపాటు లబ్ధిదారుల ఇళ్ల వద్దే రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వాహనం విలువ రూ.5.81 లక్షలు కాగా.. ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తోంది. ఈ వాహనాలను వాడుకున్నందుకు పౌరసరఫరాల శాఖ నెలకు ఆపరేటర్లకు సుమారు రూ.25 కోట్లు చెల్లిస్తోంది. కార్డుదారుల సమక్షంలో ఇంటి దగ్గరే సంచులు తెరచి, కచ్చితమైన తూకంతో రేషన్ సరుకులు ఇస్తున్నారు. దీంతో కొలతలపై ఫిర్యాదులు తగ్గడంతోపాటు వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. కష్టాలు తీరాయి.. గతంలో రేషన్ బియ్యం కావాలంటే మా ఊరు నుంచి 5 కిలోమీటర్ల కాలినడకన మసిమండ పంచాయతీలోని ఎండభద్రకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వచ్చేది. పైగా అక్కడ రేషన్ డిపో దగ్గర గంటల కొద్దీ లైన్లో నిల్చునేవాళ్లం. మా ఊరు గిరిశిఖరం కావడంతో బియ్యం మూటతో నడవడానికి చాలా అవస్థలు పడేవాళ్లం. జగనన్న వచ్చాక ఇంటి ముందుకే రేషన్ బండిని తెచ్చి బియ్యం ఇస్తున్నారు. ఒకప్పుడు రాళ్లు, పురుగులు ఉండే బియ్యాన్ని తినడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు చక్కటి నాణ్యమైన బియ్యం ఇస్తున్నారు. – చోడి చింతమ్మ, కొమరాడ మండలం, లంజి గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా తొలిసారిగా ఏపీలోనే రైస్ ఏజ్ టెస్టు గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన బియ్యం నాసిరకంగా ఉండటంతోపాటు ప్రజలు వాటిని వండుకోవడానికి, తినడానికి వీలుండేది కాదు. దీంతో చాలా మంది సబ్సిడీ బియ్యాన్ని మార్కెట్లో తక్కువ ధరకు విక్రయించేవారు. ఇవే బియ్యం రీసైక్లింగ్ ద్వారా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి వెళ్లి తిరిగి రేషన్ షాపులకు వచ్చే విధానం ఇన్నాళ్లూ కొనసాగింది. దీనికి అడ్డుకట్ట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా బియ్యం కాలనిర్ధారణ పరీక్ష (రైస్ ఏజ్ టెస్టింగ్)ను ప్రవేశపెట్టింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం సైతం అన్ని ఎఫ్‌సీఐ గోదాముల వద్ద తప్పనిసరిగా రైస్ ఏజ్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించింది. -
ప్రగతి రథానికి ప్రభుత్వం దన్ను
దశాబ్దాల డిమాండ్.. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక స్వప్నం.. ఎడతెగని సాగదీత... గందరగోళం.. వీటన్నింటికీ ఒక్క నిర్ణయం ముగింపు పలికింది. అదే.. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయం. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రజా రవాణా విభాగం (పీటీడీ)ని ఏర్పాటు చేశారు. ఫలితం కళ్లముందు కనిపిస్తోంది. – సాక్షి, అమరావతి ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ► పీఎఫ్ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి. ► ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సహకార సొసైటీకి 2014 నుంచి ఉన్న బకాయిలు రూ.200 కోట్లను యాజమాన్యం చెల్లించింది. దాంతో సొసైటీ ద్వారా ఉద్యోగులు రుణాలు పొందుతున్నారు. ► ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ప్రకటించారు. అందు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున, సహజ మరణానికి కూడా రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ► 2020 జనవరి తరువాత రిటైరైన ఉద్యోగుల గ్రాట్యుటీ కోసం రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం రూ.271.89 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ► 2020–21, 2021–22లో ఉద్యోగుల సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ కోసం రూ.165 కోట్లు చెల్లించింది. ► ఏపీ గవర్నమెంట్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్ ద్వారా 55 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న 44,500 మందికి ప్రయోజనం కలుగుతుంది. ఏపీ గవర్నమెంట్ స్టేట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్‌ను కూడా వర్తింపజేశారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను కూడా ఉద్యోగులు పొందుతున్నారు. ► 2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ► 2020 జనవరి 1 తరువాత అనారోగ్య సమస్యలతో ఉద్యోగ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ► 2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య మరణించిన 845 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు, 2020 జనవరి 1 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఉద్యోగుల జీతాల కోసం ఏటా రూ.3,600 కోట్లు దశాబ్దాల ఆర్టీసీ చరిత్ర మొత్తం ఉద్యోగుల జీతాల కోసం నెల నెలా అప్పులు చేయడం. నెలకు దాదాపు రూ.300 కోట్లు జీతాలకు చెల్లించాలి. ఆ అప్పుల మీద ఏడాదికి వడ్డీల భారమే దాదాపు రూ.350 కోట్లు. విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం నంబర్లు కేటాయించి సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు సక్రమంగా చెల్లిస్తోంది. ఇందుకోసం నెలకు ఏడాదికి రూ.3,600 కోట్ల భారాన్ని మోస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా బస్సు సర్వీసులు తగ్గించింది. టికెట్ల ద్వారా వచ్చే రాబడి గణనీయంగా పడిపోయింది. అటువంటి గడ్డు పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వమే నెల నెలా జీతాలు చెల్లిస్తోంది. జీతాల భారం తప్పడంతో ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి బయటపడుతోంది. 2020 జనవరి నాటికి ఆర్టీసీకి దాదాపు రూ.4 వేల కోట్ల అప్పులున్నాయి. ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుండటంతో ఈ రెండేళ్లలో ఆర్టీసీ రూ.1,500 కోట్ల అప్పులు తీర్చింది. జీవితాల్లో వెలుగులు నింపారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న గొప్ప నిర్ణయం 52 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. నెల నెలా జీతాల కోసం పడిన ఇబ్బందులు తొలగిపోయాయి. ఉద్యోగ భద్రత కల్పించారు. ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నారు.’. – బీఎస్ రాములు, డ్రైవర్, విజయనగరం రీజియన్ ఉద్యోగుల ప్రయోజనాలకు కట్టుబడ్డ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వంలో విలీనం ద్వారా ఉద్యోగ భద్రత, ఆర్థిక భరోసా కల్పించింది. ఏ ప్రభుత్వ శాఖలో లేని రీతిలో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ప్రకటించింది. త్వరలో పే స్కేళ్లను నిర్ధారించనుంది. దీంతో ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. – ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సీఎం జగన్ నిర్ణయం చరిత్రాత్మకం ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకుంటామని ఎందరో చెప్పారు గానీ ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే గొప్ప నిర్ణయం తీసుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరాయి. ఉద్యోగ భద్రత, పని వేళలు వంటి ప్రభుత్వ విధానాలు అమల్లోకి రావడంతో మాకు ప్రయోజనం కలుగుతోంది.’ – పీహెచ్ వెంకటేశ్వర్లు, మెకానిక్, నెల్లూరు రీజియన్ ఒక్క కి.మీ. తిరగకపోయినా జీతాలు చెల్లించారు ‘కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఒక్క కిలోమీటరు కూడా తిరగకపోయినా ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందాయి. ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు. మన రాష్ట్రంలో మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లించడంతోపాటు ఇతర ప్రయోజనాలూ కల్పిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం ఫలితమే ఇది. ఆర్టీసీ ఉద్యోగులు సీఎంకు కృతజ్ఞతతో ఉంటారు.’ – కొండలు, ఆర్టీసీ సూపర్వైజర్, గుడివాడ