
సాక్షి, అమరావతి: ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వమే నమూనాలను పంపిస్తే టెస్టు ధర గతంలో రూ.2,400 ఉండేది, ఇప్పుడు దాన్ని రూ.1,600 చేశారు. అదే నేరుగా ప్రైవేటు ల్యాబ్‌లే నమూనాలు సేకరించి పరీక్షిస్తే గతంలో రూ.2,900గా నిర్ణయించారు. ఇప్పుడా ధరను రూ.1,900కి కుదించారు. ఐసీఎంఆర్ అనుమతి ఉన్న ల్యాబొరేటరీల్లో మాత్రమే ఈ టెస్టులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
(చదవండి: కోవిడ్ విధుల్లో వైద్యులు మరణిస్తే..)