
ఏపీ స్పెషలిస్ట్ వైద్యులకి ప్రత్యేక అలవెన్స్ విషయంలో గుడ్‌న్యూస్.
సాక్షి, విజయవాడ: స్పెషలిస్ట్ వైద్యులకి ప్రత్యేక అలవెన్స్ విషయంలో గుడ్‌న్యూస్. ఏపీ వైద్య విధాన పరిషత్ ప్రతిపాదనలకి అంగీకారం తెలిపింది ప్రభుత్వం. ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో నియమించే స్పెషలిస్ట్ వైద్యులకి 15,000 రూపాయిల ప్రత్యేక అలవెన్స్ ఇస్తూ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.