కోవిడ్ వ్యాక్సిన్: ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు | AP Govt Set Up Urban Task Force For Distribution Of Covid Vaccine | Sakshi
Sakshi News home page

కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కసరత్తు

Published Mon, Dec 21 2020 3:44 PM | Last Updated on Mon, Dec 21 2020 4:10 PM

AP Govt Set Up Urban Task Force For Distribution Of Covid Vaccine - Sakshi

సాక్షి, అమరావతి: అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కసరత్తు కోసం అర్బన్ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మున్సిపల్‌శాఖ కమిషనర్‌ ఛైర్మన్‌గా 9 మంది సభ్యులతో కమిటీని నియమించింది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఉత్తర్వుల్లో సవరణలు చేసింది. స్టేట్ టాస్క్ ఫోర్స్ లో మరో ఆరుగురు సభ్యులకు స్థానం కల్పించింది. జిల్లా టాస్క్‌ఫోర్స్‌లో మరో 31 మంది అధికారులు సభ్యులుగా ప్రభుత్వం పేర్కొంది. కొత్త సవరణలతో స్టేట్ టాస్క్‌ఫోర్స్ సభ్యులుగా 16 మంది, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సభ్యులుగా 34 మందిని నియమిస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: ‘భారత్‌లో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్‌’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement