
సాక్షి, అమరావతి: ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత అసలు టీడీపీకి ఉందా? అని నిలదీశారు ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం.. పది నిమిషాల వాయిదా సమయంలో ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ప్రజా సమస్యలపై టీడీపీకి అసలు చిత్తశుద్ధే లేదు. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై టీడీపీ చర్చించడం లేదు. సభలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. వాళ్లకు రాజకీయాలే ముఖ్యం.. ప్రజలు కాదనే విషయం స్పష్టమవుతోందని ఆమె అన్నారు.
బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ పెద్ద మోసం చేసిందని విమర్శించారు మంత్రి ఆర్కే రోజా. ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. సభ ప్రారంభమైన మరు నిమిషం నుంచే టీడీపీ సభ్యులు సభ కార్యకలాపాలను అడ్డుకునే యత్నం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ‘చంద్రబాబు ఇక శాశ్వతంగా అసెంబ్లీకి రాలేడు’
Comments
Please login to add a commentAdd a comment