సాక్షి, అమరావతి: ఏపీలో ఇమ్యునైజేషన్ (టీకాల) కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించడంలో చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ కార్యక్రమం ఏపీలో జరుగుతోందని రెండ్రోజుల కిందట విడుదలైన నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో 97 శాతం మంది చిన్నారులకు తల్లిదండ్రులు ఏదో ఒక వ్యాధి నిరోధక టీకా వేయిస్తున్నారు. మొత్తం 8 రకాల టీకాలు (బీసీజీ, ఓపీవీ, పెంటావాలెంట్ 5, మీజిల్స్) వేయించుకుంటున్న వారు 73.6 శాతం ఉన్నట్టు తేలింది. జాతీయ స్థాయిలో టీకాలు వేయించుకుంటున్న వారి సగటు కేవలం 59.2 శాతమే. ఆసక్తికర విషయమేంటంటే రాష్ట్రంలో 99 శాతం మంది తమ చిన్నారులకు టీకాలు వేయించేందుకు ప్రభుత్వాస్పత్రులకే వెళుతున్నట్టు వెల్లడైంది.
ఏపీలో బాగా జరుగుతోంది
– జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే 74.2 మంది టీకాల కోసం సబ్ సెంటర్లకు వెళుతున్నారు.
– దేశంలో పట్టణ ప్రాంతాల్లో చూస్తే 45 శాతం మందే సబ్ సెంటర్, అంగన్‌వాడీలకు వెళుతున్నారు.
– జాతీయ స్థాయిలో 9.1 శాతం మంది ప్రయివేటు ఆస్పత్రుల్లో టీకాలకు వెళుతుండగా, 2.6 శాతం మంది ఎన్జీవోలను ఆశ్రయిస్తున్నారు.
– అత్యల్పంగా నాగాలాండ్ రాష్ట్రంలో కేవలం 12.8 శాతం మందే టీకాలు వేయించుకుంటున్నారు.
– ఏపీలో టీకాలు వేయించుకుంటున్న వారిలో బాలుర కంటే బాలికలే ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment