![Atul Kumar Jain Said Indigenous Knowledge Must Be Acquired - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/3/Atul-Kumar-Jain_0.jpg.webp?itok=PMQEMd6b)
సాక్షి, విశాఖపట్నం: స్వదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పురోగమించడానికి ఇదే సరైన తరుణమని తూర్పు నావికాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ కింద ప్రధానంగా మేలు చేకూరేది త్రివిధ దళాలకేనని తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్, ఎం.ఎస్.ఎం ఈ రక్షణ రంగ అవసరాలకు పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 5 ట్రిలియన్ ఎకానమీ సాధనలో సముద్ర రవాణా కీలకమని, అందుకు తగ్గట్టుగా రక్షణ పర్యవేక్షక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు. (చదవండి: విశాఖ పోర్టుకు అతి భారీ రవాణా నౌక)
ఎదురయ్యే సవాళ్లకు ధీటుగా ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్లు, లాంగ్ రేంజ్ షిప్‌లు, న్యూ క్లియర్ సబ్ మెరైన్లను సమకూర్చుకోవాలని తెలిపారు. మేరీటైమ్ డొమైన్ ఎవేర్‌నెస్‌పై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. నిర్మాణంలో వున్న విక్రాంత్ ఎయర్ క్రాఫ్ట్ కెరియర్ కోవిడ్ కారణంగా ఆలస్యమవుతోందని వెల్లడించారు. 2021లో విక్రాంత్‌కు ట్రైల్ రన్ పూర్తయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 2022 కల్లా తూర్పు నావికదళంలోకి చేరవచ్చని తెలిపారు. హానీట్రాప్‌లో ఎంతటి వారున్న ఉపేక్షించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి ఫేక్ ఫేస్‌బుక్ ఎకౌంట్లతో హనీట్రాప్‌కు పాల్పడుతున్నారని చెప్పారు. ఆన్‌బోర్డ్ షిప్‌ల్లో మొబైల్ ఫోన్లు నిషేధించామని తెలిపారు. హానీట్రాప్‌కు గురైన వారిలో యువసైలర్లే వున్నారని, నేవీ అధికారులు ఉన్నారనేది నిరాధారమని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఘర్షణ: సముద్రంలో ఛేజింగ్!)
Comments
Please login to add a commentAdd a comment