
సాక్షి, విజయవాడ: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోవడం దురదృష్టకరమని బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ తెలిపారు. నందిగామ సురేష్ మాట్లాడుతూ.. బాలు గారు భౌతికంగా మనకు దూరమైనా, ఆయన పాటలు మనతోనే ఉంటాయని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగానని, బాలు గారు ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు నందిగామ సురేష్ తెలిపారు.
కాగా జీవితంలో ఒక్కసారైనా బాలసుబ్రమణ్యం గారిని కలవాలనే కోరిక ఉండేదని, ఆ కోరిక తనకు తీరలేదని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి కీర్తి, గౌరవానికి, తగినట్టుగా భారతరత్న ఇస్తే ఆయన అభిమానులకు ఊరట కలుగుతుందనే నమక్కం ఉందన్నారు. దీనికి తన వంతు సహాయం చేస్తానని నందిగామ సురేష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment