పిటిషనరే వాయిదా ఎందుకు అడిగారు: బొత్స | Botsa Satyanarayana Comments On Tidco Houses Slams Nara Lokesh | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: లోకేష్‌వి అవగాహన లేని మాటలు: బొత్స

Published Mon, Aug 23 2021 4:16 PM | Last Updated on Mon, Aug 23 2021 5:30 PM

Botsa Satyanarayana Comments On Tidco Houses Slams Nara Lokesh - Sakshi

సాక్షి, తాడేపల్లి: అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజధాని కేసుపై రోజువారీ విచారణ అన్నారు.. అయితే పిటిషనరే వాయిదా అడగాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పిటిషనరే వాయిదా కోరడం వెనుక ఏం దురుద్దేశాలున్నాయన్న బొత్స... న్యాయస్థానాన్ని ఒప్పించి.. కోర్టు ఆదేశాల మేరకే తాము పనిచేస్తామని పేర్కొన్నారు. ఏది ఏమైనా అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు.

మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘దేశంలోని అన్ని నగరాల్లో స్వచ్ఛ్‌ భారత్ కింద వ్యర్థాల మేనేజ్‌మెంట్‌లో సర్వే చేశారు . 9 నగరాలను కేంద్రం గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్‌ నుంచి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వాటర్ ప్లస్ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యాయి’’ అని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో అన్ని పట్టణాలను ఇలాగే తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. 

ఇక టిడ్కో ఇళ్ల గురించి చెబుతూ.. ‘‘6 నెలల్లో 80 వేలు.. మరో 6 నెలల్లో మరో 80 వేలు... మిగిలినవి తర్వాత 6 నెలల్లో ఇస్తాం. మొత్తం 2.60 లక్షలు ఇళ్లు ఉన్నాయి. అన్ని త్వరగా ఇచ్చేస్తాం. ఈ అంశాల గురించి టీడీపీ నేత లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వ పాలనతో ఏం చేశారు, ఎలా చేశారన్న పొలికతో చెప్తే బాగుండేది. చేయూత, నేతన్న నేస్తం వంటి ఎన్నో పథకాల వల్ల బీసీలకు న్యాయం జరుగుతోంది. వారి జీవన విధానం మారడానికి ప్రణాళిక బద్దంగా పని చేస్తున్నాం. వారి ఆర్థిక, జీవన స్థితి మారేలా కృషి చేస్తున్నాం’’అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

చదవండి: గ్రామస్థాయి నుంచే క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం: బైరెడ్డి సిద్దార్థరెడ్డి
 Telangana: పాస్‌ మార్కులు చాలు.. ఆ నిబంధన ఎత్తివేస్తూ ఉత్తర్వులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement