సాక్షి, తాడేపల్లి: ఇచ్చిన ప్రతి మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకుంటున్నారని మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మంత్రి బొత్స సత్యానారాయణ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.65వేల కోట్లకు పైగా విలువైన సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు.. సెప్టెంబర్ 11 చరిత్రలో నిలిచిపోయే రోజని. వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారని వెల్లడించారు. ఈ పథకం వల్ల 90 లక్షల మంది మహిళలకు శుక్రవారం మరుపురాని రోజుగా నిలిచిపోతుందన్నారు. (వైఎస్ జగన్ విజన్‌ను అభినందించిన కేంద్ర మంత్రి)
‘90 లక్షల మంది మహిళకు బటన్ నొక్కి వారి ఖాతాల్లో రేపు మొదటి విడత నగదు వేయనున్నారు. పొదుపు సంఘాల మహిళలకు నాలుగేళ్లలో రూ.27128 కోట్లు ఇస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి హామీ అమలు చేసిన దాఖలు లేవు. నూరుకు నూరు శాతం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ నెరవేర్చుతున్నారు. డ్వాక్రా మహిళలు కోసం మేనిఫెస్టోలో వైఎస్సార్ ఆసరా పెట్టారు. నాలుగు దఫాలుగా రూ.25 వేల కోట్లకుపైగా సాయం అందిస్తున్నారు. రేపు ఒక్కరోజే రూ.6,792 కోట్లు విడుదల చేస్తున్నారు. ఒక్క బటన్ నొక్కడంతో ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరుతుంది. ఆసరా వారోత్సవాల్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. (అంతర్వేది ఘటన.. సీబీఐ దర్యాప్తుకు ఆదేశం)
చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారు. డ్వాక్రా మహిళలు రుణాలు మాఫీ చేస్తామని మాట తప్పారు. చంద్రబాబు చేసిన మోసం వలన మహిళలు ఎంతో ఇబ్బంది పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్ధం సంఘటనను రాజకీయం చేస్తున్నారు. ఇంట్లో పడుకుని చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ సీబీఐ విచారణ కోరుతున్నారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించారా? కోవిడ్‌కు భయపడి హైదరాబాద్ పారిపోయారు. జరిగిన సంఘటనపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కొత్త రథాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది.’ అని అన్నారు. (రైతుల ఆదాయం రెట్టింపు కావాలి: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment