CM YS Jagan Visakha Tour.. Vision Visakha Updates
3:44 PM, Mar 5th, 2024
ముగిసిన విశాఖ పర్యటన
- విశాఖపట్నంలో ముగిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన
- హెలికాప్టర్‌లో తిరుగుపయనం అయిన సీఎం జగన్
3:27 PM, Mar 5th, 2024
విశాఖ పట్ల సీఎం జగన్ నిబద్ధత ఇది
- వచ్చే పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు రూ. 1,05,000 కోట్ల పెట్టుబడితో #విజన్‌విశాఖను ఆవిష్కరించిన సీఎం జగన్
- అగ్ర పారిశ్రమకవేత్తలంతా వైజాగ్‌ను తమ నెక్ట్స్ ఫిన్-టెక్ క్యాపిటల్‌గా చూస్తున్నారు- సీఎం జగన్
- విశాఖ ప్రజల పట్ల ఉన్న నా నిబద్ధతకు ఇదే నిదర్శనం- సీఎం జగన్
3:11PM, Mar 5th, 2024
వర్చువల్‌గా నెల్లూరు స్కిల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం జగన్
- పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 70 లక్షల వ్యయంతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణం
- సెంటర్‌ను విశాఖపట్నం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- పాలిటెక్నిక్ కళాశాల నుంచి కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ తదితరులు
2:27PM, Mar 5th, 2024
స్కూల్ నుంచి కాలేజీ వరకు ఇవే అడుగులు: సీఎం జగన్
- విశాఖ పర్యటనలో.. భవిత పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించి.. ప్రసంగించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- చదవులన్నీ జాబ్ ఓరియెంటెడ్‌గా ఉండాలి
- అందుకోసమే.. చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నాం
- క్వాలిటీ చదవుల కోసం కరిక్యులమ్‌లో మార్పులు తెస్తున్నాం
- స్కూల్ నుంచి కాలేజీల వరకు ఇవే అడుగులు వేస్తున్నాం
- ఎన్నో మార్పులు తీసుకొచ్చాం
- స్కూల్‌లో 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తెచ్చాం
- మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ఇస్తున్నాం
- క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో మన పిల్లలకు మంచి భవిష్యత్తు
- 158 పారిశ్రామిక సంస్థలు వచ్చి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి
- ట్రైనింగ్ ఇచ్చాక.. ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి
- ప్రతీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్
- ప్రతీ జిల్లాలో ఒక స్కిల్ కాలేజ్
- చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చేలా మార్పులు తీసుకురాబోతున్నాం
1:30PM, Mar 5th, 2024
యువతకు భవిత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
- పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న సీఎం జగన్
- స్కిల్ డెవలప్‌మెంట్ ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం
1:06PM, Mar 5th, 2024
విశాఖ:
పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న సీఎం జగన్
- స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం కానున్న సీఎం జగన్
- యువత నైపుణ్యాభివృద్ధికి సంబంధించి భవిత కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
- స్కిల్ డెవలప్మెంట్‌లో శిక్షణ పొందిన యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించడం కోసం వివిధ కంపెనీలతో ఎంఓయు కుదుర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
11:30AM, Mar 5th, 2024
ఏపీ డెవలప్‌మెంట్ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్
- వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచి పాలన సాగిస్తా
- మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తా
- విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటా
- వైజాగ్ నగరం అభివృద్ధి చెందుతోంది
- వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
- హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్ అభివృద్ధి చెందుతుంది
- రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయాం
- దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి
- ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉంది
- అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళ్తోంది
- రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కీలకం
- గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
- ఏపీలో తలసరి ఆదాయం పెరిగింది
- కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్‌కే పరిమితమయ్యాయి
- ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం
- డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదును అందజేస్తున్నాం
- ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది
- సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం
- ఏపీలో నిరుద్యోగం తగ్గింది.. ఉపాధి అవకాశాలు పెరిగాయి
- చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయి
- స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి
- స్వయం సహాయక బృందాల పెండింగ్ రుణాలను మాఫీ చేశాం
- బెంగళూరు కంటే వైజాగ్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి
- కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి
- ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు ఇస్తున్నాయి
- నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే అభివృద్ధి చెందదు
- స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి
- విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది
- అమరావతి రాజధానికి మేం వ్యతిరేకం కాదు
- అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతోంది
- అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు కావాలి
- విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నాం
- విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మిస్తున్నాం
- విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్‌లా మారుస్తాం
- భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విశాఖకు కనెక్టివిటినీ మెరుగు చేశాం
10:41AM, Mar 5th, 2024
విశాఖ చేరుకున్న సీఎం జగన్
- విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌కు స్వాగతం పలికిన నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే ధర్మశ్రీ
- సీఎంతో కలిసి విశాఖ వచ్చిన మంత్రులు విడదల రజిని, మంత్రి ధర్మాన ప్రసాదరావు
9:20AM, Mar 5th, 2024
తాడేపల్లి :
- గన్నవరం నుండి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్
- తొలుత తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్
- కాసేపట్లో విజన్ విశాఖ సహా పలు కార్యక్రమాలలో పాల్గొననున్న సీఎం జగన్
- రాడిసన్ బ్లూ హోటల్ లో విజన్ విశాఖ సదస్సు
- 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం
- అనంతరం యువతతో భేటీ కానున్న సీఎం
- వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన ‘భవిత’ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం
- జీవీఎంసీ వీఎంఆర్డీఏకి చెందిన దాదాపు రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం జగన్
- స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే భవిత కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం జగన్
- మధురవాడ వీ కన్వెన్షన్ సెంటర్‌లో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ
- పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థుల తో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
- ముడసర్లోవలో జీవీఎంసీ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
- 10 కోట్ల వ్యయంతో విశాఖలో నిర్మించనున్న టర్టెల్ పార్క్ నిర్మాణ పనులకు సీఎం చేతుల మీదుగా శ్రీకారం
- వెంకోజిపాలెం నుంచి మారియట్ హోటల్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం
- కణితిబ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మధురవాడకు మంచినీటి సరఫరా పథకంకి శంకుస్థాపన చేయనున్న సీఎం
- అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేయనున్న సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment