పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్‌ సమీక్ష; కీలక ఆదేశాలు | CM YS Jagan Review Meeting Panchayati Raj and Rural Development | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్‌ సమీక్ష; కీలక ఆదేశాలు

Published Mon, Jan 31 2022 3:02 PM | Last Updated on Mon, Jan 31 2022 5:45 PM

CM YS Jagan Review Meeting Panchayati Raj and Rural Development - Sakshi

సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ శాఖల పరిధిలో వివిధ కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించిన సీఎం పలు ఆదేశాలు ఇచ్చారు. జాతీయ ఉపాధిహామీ పథకం పనులు, జగనన్న పచ్చతోరణం, వైఎస్సార్‌ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో క్లాప్‌ కింద కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, గ్రామీణ మంచినీటి సరఫరా తదితర కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..



ఉపాధిహామీ పనులు
ప్రాధాన్యతా క్రమంలో ఉపాధిహామీ పనులు చేపట్టాలి అధికారులకు సీఎం ఆదేశం
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్, వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం
అమూల్‌ పాలసేకరణ చేస్తున్న జిల్లాలను, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని బీఎంసీయూలను పూర్తిచేయాలన్న సీఎం
జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తిచేయడానికి తగిన కార్యాచరణతో ముందుకు సాగాలన్న ముఖ్యమంత్రి

జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లాప్‌ కార్యక్రమాలు
జగనన్న స్వచ్ఛ సంకల్పం, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ప్రాసెస్‌లపై సీఎం సమీక్ష
నవంబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 22 శాతం ఇళ్లనుంచి చెత్తసేకరణ ప్రారంభమై ప్రస్తుతం 61.5శాతానికి చేరుకున్నామన్న అధికారులు
అక్టోబరు కల్లా పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటున్నామన్న అధికారులు
గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపరచాలని సీఎం ఆదేశాలు
మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న సీఎం
వివిధ గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను ప్రత్యేక సర్వేద్వారా గుర్తించిన అధికారులు
దాదాపు 582 ప్రాంతాలను గుర్తించిన అధికారులు
ఇక్కడ సాయిల్‌ బయోట్రీట్‌మెంట్, వెట్‌ ల్యాండ్‌ట్రీట్‌మెంట్, వేస్ట్‌ స్టెబిలైజేషన్‌ పాండ్స్‌ తదితర పద్ధతుల్లో శుద్ధికి ప్రణాళికను వివరించిన అధికారులు
వెంటనే ఈపనులు చేపట్టాలని సీఎం ఆదేశం
ఏడాదిలోగా పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
కట్టిన తర్వాత వాటి నిర్వహణపైనా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ నిర్వహణపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్లాలన్న సీఎం
పాదయాత్రలో గ్రామాల్లో పరిస్థితులు చూపినప్పుడు ఆవేదన కలిగిందన్న సీఎం
అలాంటి పరిస్థితులను మార్చాలన్న సీఎం
నివాసప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండే పరిస్థితులు ఉండకూడదన్న సీఎం
ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందాలన్న సీఎం
ఎఫ్‌ఎస్‌టీపీ ప్లాంట్ల ఏర్పాటుపైనా ప్రణాళిక వివరించిన అధికారులు
వీటి నిర్వహణపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం

వైఎస్సార్‌ జలకళ
వైయస్సార్‌ జలకళపైనా సీఎం సమీక్ష
ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గును అప్పగించాలన్న సీఎం
ఆ రిగ్గు ద్వారా రైతులకుబోర్లు వేయించాలన్న సీఎం
దీనివల్ల బోర్లు వేసే పని క్రమంగా ముందుకు సాగుతుందన్న సీఎం
బోరు వేసిన వెంటనే మోటారును బిగించాలన్న సీఎం

రోడ్ల నిర్మాణం, నిర్వహణ
రోడ్ల నిర్మాణం, నిర్వహణపైనా సీఎం సమీక్ష
గత ప్రభుత్వం హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులను పూర్తిగా గాలికొదిలేశారు
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండేళ్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి
క్రమం తప్పకుండా చేయాల్సిన నిర్వహణను వదిలేయడంతో అన్ని రోడ్లనూ ఒకేసారి నిర్మించి, మరమ్మతు చేయాల్సిన అవసరం ఏర్పడింది
ఈసారి రోడ్ల నిర్మాణం, మర్మతులను పూర్తిచేయాలి
భవిష్యత్తులో రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిర్మాణంపై అత్యుత్తమ కార్యాచరణ ఉండాలి
ఏ దశలోకూడా నిర్లక్ష్యానికి గురికాకుండా క్రమం తప్పకుండా మెయింటైనెన్స్‌ పనులు నిర్వహించాలి
దీనికోసం నిధుల కొరత లేకుండా ఒక ప్రణాళికను ఆలోచించాలని అధికారులకు సీఎం ఆదేశం

జగనన్న కాలనీల్లో రక్షిత తాగునీరు
జగనన్న కాలనీల్లో రక్షిత మంచినీరు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
ఇళ్ల నిర్మాణం పూర్తయ్కేనాటికి అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటుపైనా ధ్యాస పెట్టాలన్న సీఎం
గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక  శ్రద్ధ పెట్టాలన్న సీఎం.
నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెరుగైన విధానం తీసుకురావాలన్న సీఎం

ఈ సమీక్షా సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌ ఎండీ పి సంపత్‌ కుమార్, సెర్ఫ్‌ సీఈఓ ఎండి ఇంతియాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్‌ కమిషనర్‌ శాంతి ప్రియా పాండే ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement