విజయవాడ: జీపీఎస్ అంశంపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రుల కమిటీ బుధవారం సాయంత్రం భేటీ అయ్యింది. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘జీపీఎస్ పై పలు దఫాలుగా ఉద్యోగులతో చర్చించాం.ఫైనల్ డ్రాఫ్ట్ ను ఉద్యోగులకు వివరించాం. రిటైర్ అయ్యాక గ్యారంటీగా కనీసం రూ.10 వేలు పెన్షన్ ఉండేలా చూస్తాం. పెన్షనర్ చనిపోతే భార్య లేదా భర్తకు పెన్షన్ ఇస్తాం. పెన్షనర్లకు హెల్త్ కార్ఫ్ కూడా పెట్టాం. పెన్షనర్ చనిపోతే ఎక్సగ్రేషియా ఇచ్చేలా చర్యలు. ఉద్యోగులతో మరోసారి చర్చలు జరుపుతాం. జీపీఎస్ ఫైనల్ అయ్యాక. చట్ట బద్ధత కల్పిస్తాం. జీపీఎస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి’ అని తెలిపారు.
సీపీఎస్‌పై ఉద్యోగులు ఆలోచించాలి: సజ్జల
సీపీఎస్‌పై ఉద్యోగులు ఆలోచించాలన్నారుప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఉద్యోగులకు సజ్జల విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలను ఉద్యోగులు పరిశీలించాలన్నారు. తమ చిత్తశుద్ధిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలన్నారు సజ్జల
Comments
Please login to add a commentAdd a comment