
మేం ఆత్మహత్య చేసుకుంటున్నాం.. మా అవయవాలు మావిడకు ఇవ్వండి అంటూ లేఖ రాసి తల్లీకూతుళ్లు బలవన్మరణం
విజయవాడ: ‘మేం ఆత్మహత్య చేసుకుంటున్నాం.. మా అవయవాలు మావిడకు ఇవ్వండి’ అంటూ లేఖ రాసి ఓ వ్యక్తి తన కూతురును హత్య చేసి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పట్టణంలో చోటుచేసుకుంది. మృతుడు రాసిన లేఖ చూస్తే అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. భార్య అనారోగ్యం చెందడంతో తమ అవయవాలతోనైనా ఆమె కోలుకుంటుందనే ఉద్దేశంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే తన కూతురును కూడా ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడలోని శ్రీనగర్ కాలనీకి చెందిన జగానీ రవి (40), భరణి భార్యాభర్తలు. వారికి ఒక కుమార్తె (10). రవి గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండేవాడు. వీరు రామకృష్ణపురంలో నివసిస్తున్నారు. రవి భార్య భరణి కొంతకాలంగా కిడ్ని సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యం పాలయ్యింది. ఆమె అనారోగ్యం చెందడంతో రవి, కుమార్తె మనస్తాపానికి గురయ్యారు. దీంతో వీరిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆత్మహత్య లేఖ రాసి కూతురుతో కలిసి రవి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే చనిపోయిన తర్వాత తమ అవయవాలను భార్యకు దానం చేయాలని లేఖలో రవి పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి సత్యనారాయణ పురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ‘నేను చాలదా.. ఇంకొకడు కావాల్న’ అంటూ సజీవదహనం
చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి