సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాధారణ విస్తీర్ణం 55.27 లక్షల ఎకరాలు. ఇప్పటి వరకు 18.84 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. రబీ సీజన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ చివరి వరకూ వరినాట్లు వేస్తారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే జనవరి 15 వరకు వేసుకోవచ్చన్నది ఆచార్య ఏన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తల సూచన. సాధారణంగా ఖరీఫ్ వరికోతలు పూర్తయిన తర్వాత అదే పొలంలో జొన్న, నువ్వులు, కొర్ర పంటలను జనవరి నెలవరకు వేసుకోవచ్చు.
ప్రాంతాల వారీగా చూస్తే కోస్తా జిల్లాల్లో ఖరీఫ్ వరి కోతలు పూర్తయిన తర్వాత అదే పొలంలో అపరాలు, మొక్కజొన్న, జొన్న, రాగి పంటలను డిసెంబర్ చివరి వరకూ వేయడం ఆనవాయితీ. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా మినుములు, మేత మొక్కజొన్న, మేత జొన్న, మేత అలసంద డిసెంబర్ చివరి వరకూ విత్తుతారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వరికి ప్రత్యామ్నాయంగా శనగ, అపరాలు, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న డిసెంబర్ చివరి వరకూ సాగు చేస్తారు.
తిరుపతి జిల్లాలో మొక్క జొన్నకు ప్రత్యామ్నాయంగా సజ్జ, రాగి, కొర్ర పంటలను జనవరి 2వ వారం వరకు వేస్తారు. నెల్లూరు జిల్లాలో నువ్వులకు ప్రత్యామ్నాయంగా పెసర పంటను జనవరి 3వ వారం వరకు వేస్తారు. ఈ లెక్కన వచ్చే మూడు వారాల్లో వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, అపరాలు, సజ్జ పంటల విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇంతలోనే రబీ విస్తీర్ణం 12 లక్షల ఎకరాలు తగ్గిందంటూ ఓ కథనాన్ని ఈనాడు వండి వార్చింది.
అడ్డగోలు రాతలు... అబద్ధాలు
వండివార్చడం... ప్రభుత్వంపై దుష్ప్రచారానికి పూనుకోవడం... ఇవి ఈనాడుకు అలవాటుగా మారింది. ఎంత చేస్తున్నా... ఏమీ చేయలేదన్నట్టు తప్పుడు కథనాలు అల్లడం రామోజీకి నిత్యకృత్య మైపోయింది. ఇప్పుడు తాజాగా రబీపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందంటూ మరో కట్టుకథ అచ్చేశారు. రబీ సీజన్ గడువు ఇంకా ముగిసి పోలేదు... ఇప్పటివరకూ పండిన పంటలపై ఇంకా లెక్క తేలలేదు. అయినా సాగు విస్తీర్ణం తగ్గిపోయిందంటూ అడ్డగోలు రాతలు.
రబీ సాగుపై ఒక్కసారి కూడా సమీక్ష జరపలేదంటూ దొంగ ఏడుపులు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రత్యామ్నాయ పంటల రాయితీ విత్తనంపై సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోందంటూ విషపు రాతలు. ‘రబీలోనూ సర్కార్ మొద్దు నిద్రే’ అంటూ వండివార్చిన ఈ అడ్డగోలు కథనంపై వాస్తవాలు ఒక్కసారి పరిశీలిద్దాం.
నష్టపరిహారం పంపిణీకి చర్యలు
♦ ఖరీఫ్ పంట కాలంలో కరువు పరిస్థితులు, మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న çపంటలకు నష్టపరిహారం అందించేందు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
♦నష్టపోయిన రైతులకు మెరుగైన సాయం అందించాలన్న సంకల్పంతో నష్టపరిహారాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేంద్రం ఇచ్చే పెట్టుబడి రాయితీ కంటే మెరుగైన రీతిలో ఇచ్చేలా మార్పులు చేసింది.
♦ పంట నష్టం ప్రాధమిక అంచనా వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ల
డంతో కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి కేంద్రానికి నివేదిక కూడా సమర్పించాయి.
♦ ఖరీఫ్ సీజన్‌లో ప్రకటించిన కరువు మండలాల పరిధిలో పంట దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చేందుకు, కరువు, తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
♦ తుఫాన్ ప్రభావం వల్ల ధాన్యం రంగు మారినా, పాడైనా, తేమ శాతంలో నిబంధనలను సడలించి మరీ కొనుగోలుచేసింది. ఇలా డిసెంబర్ 1 నుంచి 14 వరకు తుఫాన్ తర్వాత నిబంధనలు సడలించి 12.70లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు.
♦ వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా రైతులను గందరగోళ పర్చేలా బురద రాతలు రాయడం ఈనాడుకే చెల్లింది.
ఎప్పటికప్పుడు సాగుపై సమీక్షలు
♦ఈ సీజన్‌లో సాగు పరిస్థితులపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి నవంబర్ 3న, 23న వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులతో ఉన్నత స్థాయిలో సమీక్షించారు.
♦ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన కార్యదర్శి నవంబర్ 8న, ముఖ్యకార్యదర్శి నవంబర్ 9, 25, డిసెంబర్ 15న, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నవంబర్ 3, 17, 20, 29, డిసెంబర్ 18న సమీక్షించారు.
♦ శాస్త్రజ్ఞులు సిఫార్సు చేసిన ప్రత్యామ్నాయాలను రైతులు పాటించేందుకు వీలుగా నవంబర్ 10 నుంచి 28 వరకు జాయింట్ ఇరిగేషన్ – వ్యవసాయ అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహించారు.
♦ దెబ్బతిన్న నారు మళ్ళు, లేత దశలో వున్న రబీ పంటలకు తిరిగి విత్తుకునేందుకు 80 శాతం రాయితీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాల (86వేల క్వింటాళ్లు) సరఫరాకు ఏర్పాటు చేశారు.
♦ ఇప్పటి వరకు 24 జిల్లాల్లోని అర్హులైన రైతులకు 31వేల క్వింటాళ్ల వరి, వేరుశనగ, శనగ, మినుములు, పెసర, నువ్వులు, ఉలవలు విత్తనాలను పంపిణీ చేశారు. ఇందుకోసం రూ.16.63 కోట్ల రాయితీ రూపంలో ప్రభుత్వం అందించింది.
♦ కానీ ఇవేవీ పట్టించుకోకుండా అసలు ప్రభుత్వం సమీక్షలే నిర్వక్షించలేదంటూ తప్పుడు ఆరోపణలు ఈనాడు చేసింది.
ఖరీఫ్‌కు అనుకూలించని వర్షాలు
♦ ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌కు తీవ్ర జాప్యం ఏర్పడింది. సెప్టెంబర్ చివరి వరకు పంటలు వేసుకోవడం వల్ల, పంట కోతలు ఇç³్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల రబీ పంటల సాగులోనూ ఆలస్యం అయింది. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 84.94 లక్షల ఎకరాలకు 61.70 లక్షల ఎకరాల్లోనే వేశారు. అంటే 23. 24లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. కానీ ఖరీఫ్‌లో 31 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదంటూ ఈనాడు ఆరోపించింది.
♦ ఖరీఫ్ సాగు చేయ లేని చోట ప్రత్యామ్నాయంగా వరి, మొక్క జొన్నతో పాటు చిరుధాన్యాలు, అపరాలు సాగు చేసేందుకు ముందుకొచ్చిన 1.16 లక్షల మంది రైతులకు 80 శాతం సబ్సిడీపై 30,977 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ఇందుకోసం రూ.26.46 కోట్లు వెచ్చించారు. మరో వైపు రబీ ముందస్తు ప్రణాళికలో భాగంగా 2.70 లక్షల క్వింటాళ్ల శనగ, వేరుశనగ,వరి, మినుములు, పెసర పంటల విత్తనాలను సరఫరా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment