FactCheck: Eenadu Ramojirao Fake News On CM Jagan Govt Over Teacher Posts, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: వాస్తవాలకే ఉరి

Published Fri, Jul 28 2023 4:23 AM | Last Updated on Fri, Aug 11 2023 1:37 PM

Eenadu Ramojirao Fake News On CM Jagan Govt posts of teachers - Sakshi

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యకు ఉరి బిగిసింది చంద్రబాబు హయాంలోనే. ఆయన అధికారంలో ఉండగా ఏనాడు విశ్వవిద్యాలయాలను పట్టించుకోలేదు. 14 ఏళ్లు అధికారంలో ఉన్నా ఒక్క ప్రొఫెసర్‌ పోస్టును కూడా భర్తీ చేయలేదు. 2017–18లో తప్పుల తడకగా ఇచ్చిన నోటిఫికేషన్‌తో కోర్టు కేసులు దాఖలయ్యాయి. ఫలితంగా ఆచార్యుల పోస్టుల భర్తీకి బ్రేక్‌ పడింది. ఇదీ వాస్తవం. రామోజీరావు మాత్రం ఈనాడు ముసుగులో విష ప్రచారం చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం చొరవ చూపుతుంటే పదేపదే నిస్సిగ్గుగా అసత్యాలు వల్లె వేస్తున్నారు. 

కనీసం ఇంగితం లేకుండా..
ఇది టెక్నాలజీ యుగం.. అత్యధికంగా కంప్యూటర్, కృత్రిమ మేథ రంగాల వైపు అంతా ఆసక్తి చూపుతున్నారు. అందులో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ మార్పు దేశవ్యాప్తంగా ఉంది. సహజంగానే అన్ని చోట్లా ఈ ప్రభావం తప్పదు! ఈనాడు మాత్రం ఇతర రాష్ట్రాల్లో పీజీ విద్యార్థులు, అడ్మిషన్లు తగ్గిపోవడాన్ని ప్రస్తావించకుండా ఇదంతా ఒక్క ఏపీలోనే జరిగిపోతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తోంది. సెంట్రల్‌ వర్సిటీల్లో సీట్ల భర్తీ గురించి ఈనాడు ఎందుకు ప్రస్తావించలేకపోయింది? పీజీ కౌన్సెలింగ్‌ జాప్యానికి, అడ్మిషన్లు తగ్గి­పోవడానికి అసలు సంబంధమే లేదు.

అన్ని విశ్వవిద్యాలయా­ల డిగ్రీ పరీక్షలు ఆగస్టుకి పూర్తవుతాయి. అందుకే సెప్టెంబర్‌­లో ప్రవేశాల నిర్వహణకు షెడ్యూల్‌ ఇచ్చారు. డిగ్రీ ఫలి­తాలు రాకుండానే వర్సిటీలో అడ్మిషన్లు ఎలా ఇస్తారనే జ్ఞానం లేకుండా ఇష్టమొ­చ్చినట్టు రాయడం ఈనాడుకే చెల్లింది. 2021­–­22లో తొలిసారిగా పీజీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు నిర్వహిస్తున్న సందర్భంలో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఉన్నత విద్యా మండలి వీడియోలు, పోస్టర్లను రూ­పొ­ంది­ంచింది. దీన్ని అపహాస్యం చేస్తూ సీట్లు ఇస్తామని విద్యా­­ర్థుల­ను బతి­మి­లాడుతు­న్నట్టు ఈనాడు కథనాలు ప్రచురించడం హే­యం.

నకిలీ అడ్మిషన్లకు అడ్డుకట్ట
టీడీపీ హయాంలో ప్రైవేటు కాలేజీలతో కుమ్మక్కై కాగితాలపై పీజీ అడ్మిషన్లు చూపించి ఫీజురీయింబర్స్‌మెంట్‌ దోచిపెట్టారు. యూజీలో సున్నా అడ్మిషన్లు ఉన్న కాలేజీల్లో సైతం పీజీకి వచ్చే సరికి నూటికి నూరు శాతం అడ్మిషన్లు ఉండేవి. యూజీలోనే పాఠాలు చెప్పడానికి అధ్యాపకులు లేని చోట పీజీ విద్యను నడిపించేశారు. వీటికి ఇప్పుడు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వర్సిటీల్లో పీజీ విద్యకు ఫీజురీయింబర్స్‌ ఇస్తోంది. ప్రతిభ ఆధారంగా అన్ని వర్గాల విద్యార్థులకు విద్యను అందిస్తోంది.

అప్పుడు ఆర్ట్స్‌ గుర్తు రాలేదా?
రామోజీ దృష్టిలో దార్శనికుడైన చంద్రబాబు ఆర్ట్స్, హిస్టరీ సబ్జెక్టులే అవసరం లేదని తేల్చి చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తున్నట్లు?లేడీ శ్రీరామ్, లయోలా చెన్నై, శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ లాంటి విద్యా సంస్థలు రాష్ట్రంలో ఒక్కటైనా లేవని శోకాలు పెడుతున్న రామోజీకి గతంలో ఈ విషయం గుర్తు రాలేదా? అధికారం దూరమైందనే అక్కసుతో అజ్ఞానపు విమర్శలు చేయడం సిగ్గు అనిపించట్లేదా? ద్రవిడ వర్సిటీలో ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్రవేశాలు ఇప్పుడేదో కొత్తగా తగ్గి­పోయినట్టు ఈనాడు చిత్రీకరించింది. నిజానికి 2014 నుంచే తగ్గిపోయాయా? చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆ వర్సిటీ ఉంది కాబట్టే నాడు గుర్తు లేదేమో?

పెరిగిన ప్లేస్‌మెంట్లు.. ప్రవేశాలు
గత ప్రభుత్వ హయాంలో సాధారణ డిగ్రీలో 37 వేలుగా ఉన్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు ఇప్పుడు లక్షకు పైగా పెరిగాయి. సాధారణంగా డిగ్రీ తర్వాత ఉద్యోగాల్లో చేరే విద్యార్థులు పీజీపై ఆసక్తి చూపరు. ఇప్పుడు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు దాదాపు 3 రెట్లు పెరగడంతో సహజంగానే పీజీ అడ్మిషన్లు తగ్గుతాయి. ఉద్యోగం చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో పీజీ చదువుతారు. ఇంటర్‌ తర్వాత డిగ్రీ కంటే ఇంజనీరింగ్‌ వైపు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. కారణం.. ప్రభుత్వం విద్యా దీవెన కింద పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద మెస్‌ చార్జీలను కూడా అందించడమే.

అందుకే 2018–19లో ఇంజనీరింగ్‌లో చేరికలు 87 వేలు ఉంటే ఇప్పుడు 1.20 లక్షలకు చేరుకున్నాయి. అంటే 30 వేల మందికిపైగా డిగ్రీలో చేరాల్సిన విద్యార్థులు సాంకేతిక విద్య వైపు వెళ్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇంటర్‌ తర్వాత డ్రాపవుట్లు 21 శాతం ఉండగా ఇపుడు 6 శాతానికి తగ్గాయి. ఇదంతా విద్యావ్యవస్థ బలోపేతం కాదా రామోజీ?

ఇవి మార్పులు కాదా?
గత నాలుగేళ్లలో సీఎం జగన్‌ దేశంలోనే తొలిసారిగా ఏపీలోని పలు యూనివర్సిటీల్లో సంస్కరణలు తెచ్చారు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ బోర్డు, రీజనల్‌ క్లస్టర్‌ గ్రూపులను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఏ కోర్సు అభ్యసించినా విద్యార్థికి కచ్చితంగా ఉపాధి లభించేలా ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.

ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టును ప్రవేశపెట్టింది. వీటికి తోడు 100కిపైగా మైనర్‌ సబ్జెక్టుల్లో విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో నైపుణ్య కోర్సులు, ఇంటర్న్‌షిప్, కమ్యూనిటీ డెలప్‌­మెంట్‌ ప్రోగ్రామ్‌లను తీసుకొచ్చింది. ప్రపంచ స్థాయి మేటి వర్సిటీల్లో ఉన్న నాలుగేళ్ల కోర్సును నూతన జాతీయ విద్యా విధానంతో అనుసంధానం చేసి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రణాళికలు ఈనాడుకు కనపడవా?

యూజీసీ చర్యలూ తప్పేనా?
యూజీసీ సైతం సెంట్రల్‌ వర్సిటీలకు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు నిర్వహిస్తోంది. తెలంగాణ కూడా స్టేట్‌ వర్సిటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. చాలా రాష్ట్రాల్లో వర్సిటీలు ఇదే పద్ధతి అవలంబిస్తున్నాయి. మరి రామోజీకి తాను నివాసం ఉంటున్న తెలంగాణలోని వర్సిటీలు కనిపించట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలపై మాత్రం వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్నారు.

ఇది కడుపు మంటతో వచ్చిన కపట ప్రేమే కదా! గతంలో ఒక విద్యార్థి వివిధ విశ్వవిద్యాలయాలకు విడివిడిగా ఎంట్రన్స్‌ టెస్టులు రాయాల్సి వచ్చేది. ప్రతి వర్సిటీకి ఫీజు చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఒకే టెస్టుతో అర్హత సాధించి ఇష్టమైన వర్సిటీలో చేరే వెసులుబాటు కలిగింది. దీని ద్వారా టాలెంట్‌ కలిగిన విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు ఉన్న వర్సిటీలో తొలి ప్రాధాన్య సీటు పొందుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement