జనాభా లెక్కల ప్రకారం ఆ మూడు గ్రామాలు ఏపీలోనివే | Ganjeibadara, Pattuchennuru and Pagluchennuru: Vizianagaram Collector Filed Affidavit | Sakshi
Sakshi News home page

జనాభా లెక్కల ప్రకారం ఆ మూడు గ్రామాలు ఏపీలోనివే

Published Fri, Feb 19 2021 7:40 PM | Last Updated on Fri, Feb 19 2021 8:07 PM

Ganjeibadara, Pattuchennuru and Pagluchennuru: Vizianagaram Collector Filed Affidavit - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జనాభా లెక్కల (2001, 2011) ప్రకారం గంజాయ్‌బద్ర, పట్టుచెన్నూరు, పాగులు చెన్నూరు గ్రామాలు ఏపీలోకే వస్తాయని విజయనగరం జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్‌ అఫిడవిట్‌ సమర్పించారు. 3 గ్రామాలకు సంబంధించి 2006లో ఒడిశా దాఖలు చేసిన సూట్‌ను కోర్టు కొట్టివేసిన విషయాన్ని అఫిడవిట్‌ ద్వారా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు ఆదేశాలను ఏపీ ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. 

ఒడిశా ప్రాంతంలో ఎలాంటి పాలనాపరమైన కార్యక్రమాలు నిర్వహించడం లేదని తెలిపారు. 1952 నుంచి ఆ 3 గ్రామాల పరిధి ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు  నిర్వహిస్తున్న విషయాన్ని వివరించారు. పంచాయతీరాజ్‌ యాక్ట్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 3 గ్రామాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2013, 2016ల్లో కూడా ఆ 3 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించామన్నారు. 3 గ్రామాల్లోనూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కార్యాలయాలు, చేస్తున్న పనుల ఫొటోలను అందజేశారు. ఈ అంశాలను పరిశీలించి ఒడిశా  పిటిషన్‌ కొట్టివేయాలని కోర్టుని కోరారు.  

చదవండి:
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి సర్వీసు రూల్స్‌

అటు కుక్కర్లు.. ఇటు ప్లాస్టిక్‌ స్టూళ్లకు డిమాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement