
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి బాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఉన్న జెండాలు ప్రదర్శించారు. అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలోకి వచ్చి జూనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.
అమరావతి రైతుల పాదయాత్రలోనూ మా నాయకుడిని ఎందుకు విమర్శిస్తున్నారనే నినాదాలతో హోరెత్తించారు. ఎన్టీఆర్ అభిమానుల వ్యవహారం చూసి చంద్రబాబు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పూర్తి అసంతృప్తి, అసహనానికి లోనయ్యారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అక్కడి నుంచి పంపించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment