మండపేట: తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో రూ.10,500 కోట్లు జమచేసి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలకరి ధాన్యం కొనుగోళ్లకు శుక్రవారం ఆయన శ్రీకారం చుట్టారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తోట త్రిమూర్తులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని సొసైటీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కన్నబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.130 కోట్ల విలువైన పొగాకు కొనుగోళ్లు చేసిందని తెలిపారు. రైతులు సాగు వివరాలను ఆర్‌బీకేలో నమోదు చేసుకుంటే వాటి కొనుగోలు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గతేడాది మార్కెటింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.17 వేల కోట్లు విలువైన ధాన్యం, రూ.3,200 కోట్లతో ఇతర పంటలను కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది జిల్లాలో 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా నిర్ణయించామని మంత్రి తెలిపారు.
రైతు పక్షపాత ప్రభుత్వమిది
Published Sat, Nov 14 2020 4:05 AM | Last Updated on Sat, Nov 14 2020 4:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment