
పొలాల్లో మృతిచెందిన చిరుత
ముద్దనూరు: విద్యుదాఘాతంతో చిరుత మృత్యువాత పడిన ఘటన ముద్దనూరు ఫారెస్టు రేంజి పరిధిలోని శెట్టివారిపల్లె అటవీ ప్రాంత సమీపంలో చోటుచేసుకుంది. మృతి చెందిన చిరుత వయసు సుమారు రెండు సంవత్సరాలు ఉంటుందని డివిజనల్ ఫారెస్టు అధికారి నాగార్జునరెడ్డి ఆదివారం ఇక్కడి విలేకర్లకు తెలిపారు. డీఎఫ్‌ఓ తో పాటు స్థానిక రేంజి ఆఫీసర్ రమణారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాగా శెట్టివారిపల్లె సమీపంలో చిరుత కూన మృతిచెందడంతో... దీని తల్లి కూడా ఉంటుందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
చదవండి:
ప్రేమించి పెళ్లి, ఆపై ప్రియుడితో కలిసి..
టీడీపీ బరితెగింపు: మాకే ఎదురు నిలబడతారా..
Comments
Please login to add a commentAdd a comment