సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ ఖ్యాతి గడించాయని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ ఎఫ్‌ఏఓ అవార్డుకి ఆర్‌బీకేలను నామినేట్ చేయడం గర్వకారణమని అన్నారు.
ఈమేరకు సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్‌బీకేలను సీఎం జగన్ తెచ్చారు. రెండేళ్లలోనే మంచి ఫలితాలను తీసుకొచ్చారు. 10,700 రైతు భరోసా కేంద్రాలు రైతులకు మేలు చేసేందుకు తెచ్చాం. ఆర్‌బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. ప్రతిపక్షానికి అసలు రైతుల కోసం మాట్లాడే అర్హత ఉందా..?. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు మా ప్రభుత్వం పరిహారం ఇచ్చింది.
చంద్రబాబు క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించకపోతే మేం చెల్లించాం. రైతులకు అని విధాలుగా అండగా ఉంటున్నాం. టీడీపీ ప్లాన్ ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో అత్యాచారాలకు టీడీపీ కార్యకర్తలే పాల్పడుతున్నారు. తిరుపతమ్మని హత్యచేసింది టీడీపీ కార్యకర్తలే. విశాఖలో బాలికపై అత్యాచారం చేసింది టీడీపీ కార్యకర్తే. రాష్ట్రంలో జరగుతున్న ఘటనల వెనుక టీడీపీ కుట్ర ఉందనిపిస్తోంది. ప్రతి సంఘటన వెనుక టీడీపీ కార్యకర్తలే ముద్దాయిలుగా తేలుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment