
సాక్షి, చిత్తూరు: సొంత జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచారు. చిత్తూరు జిల్లా సోమల మండలం నిజంపేట వద్ద కాలిబాటన వెళ్తున్న సుబ్బయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో సుబ్బయ్య రోడ్డు మీదే తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. అదే సమయంలో ఆ మార్గంలో మంత్రి పెద్దిరెడ్డి వాహన శ్రేణి వెళ్ళింది. రోడ్డు మీద వ్యక్తి పడి ఉండటాన్ని మంత్రి పెద్దిరెడ్డి గుర్తించి తన వాహనాన్ని ఆపించి వెంటనే తీవ్ర గాయాలతో పడి ఉన్న వ్యక్తికి మంచి నీళ్లు తెప్పించి తాగించారు. ప్రత్యేక వాహనంలో సోమల ప్రభుత్వాసుపత్రికి పంపారు. గాయపడ్డ సుబ్బయ్య ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి పెద్ద మనస్సును స్థానికులు గొప్పగా చెప్పుకుంటున్నారు.
చదవండి:
టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్
కడతేరిన ‘ఫేస్‌బుక్’ ప్రేమ
Comments
Please login to add a commentAdd a comment