సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సభలో అసభ్యంగా మాట్లాడారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం, మంత్రులు, శాసనసభ్యులను ఏకవచనంతో సంబోధిస్తున్నారని.. 40 ఏళ్లు నేర్చుకున్న సంస్కారం ఇదేనా చంద్రబాబూ అంటూ దుయ్యబట్టారు. బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపింది చంద్రబాబు కాదా?. రైతుల గుండెల్లో బుల్లెట్లు దింపింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏనాడూ రైతులను పట్టించుకోలేదని, ఆయన పెట్టిన బకాయిలను మేం చెల్లించామని పేర్కొన్నారు. చంద్రబాబు వయసుకు తగ్గట్టు వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు. మైనారిటీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను దూషించడం కరెక్టేనా? అంటూ పేర్ని నాని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. (చదవండి: చంద్రబాబు యాక్టర్ అయితే..: సీఎం జగన్)
మంత్రి పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..
‘‘తాడిచెట్టుకు.. పెద్దాయనకు వయసొచ్చిందన్నట్టు.. చంద్రబాబు ఇంగిత జ్ఞానం కొల్పోయారు. సంస్కారం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం ఏమిటీ..? చంద్రబాబు.. ఆయన కొడుక్కి ఖర్జూర నాయుడు రాజ్యాంగం కావాలేమో..?. అసెంబ్లీ సమావేశాలంటే టీడీపీ సమావేశాలు కావని గుర్తుంచుకోవాలి. తుపాను వచ్చిన నెలన్నర లోపు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తున్నాం. రామానాయుడు పేరిచ్చి.. చంద్రబాబు మాట్లాడతానంటే ఎలా..? తన పేరునే చంద్రబాబు ఇవ్వొచ్చుగా..?. కన్నబాబు కాపు కాబట్టి.. కాపు సామాజిక వర్గానికే చెందిన రామానాయుడు పేరు ఇచ్చారు. మైనార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఏం పీక్కుంటావో పీక్కొ అని చంద్రబాబు అనొచ్చా..? చంద్రబాబు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇంటికి పరిమితం అయితే బాగుంటుంది. చంద్రబాబు కుటుంబ సభ్యులు మా సూచనను పరిగణనలోకి తీసుకుంటే ఆయనకే మంచిదని’’ మంత్రి పేర్ని నాని హితవు పలికారు. (చదవండి: ‘అదే నిజమైతే రాజకీయ సన్యాసం చేస్తా..’)
చంద్రబాబుకు అల్జీమర్స్ జబ్బుంది: కొడాలి నాని
పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరిందని ధ్వజమెత్తారు. పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుపై ఇంతకు ముందే సవివరంగా చర్చ జరిగింది. అసెంబ్లీలో చర్చ పూర్తయ్యాకే బిల్లును మండలికి పంపించారని తెలిపారు. చర్చించిన బిల్లుపై మళ్లీ చర్చ జరపాలని చంద్రబాబు అంటున్నారని.. ఆయనకు మతిమరుపు జబ్బు పట్టుకుందని మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు.
‘‘అసెంబ్లీ అంటే టీడీపీ ఆఫీసా..? అసెంబ్లీ ఎందుకు ఆలస్యంగా ప్రారంభమైందో స్పీకరును అడగాలి. సీఎంను అడిగితే ఏం లాభం. పరిటాల రవి.. ఎన్టీఆర్ చావుకు కారణం చంద్రబాబు కాదా..?. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రామానాయుడు స్టూడియోస్ దగ్గర బాంబ్ బ్లాస్టుకు కారణం చంద్రబాబేనా..? టీడీపీ గాలి పార్టీ.. చంద్రబాబు గాలి మనిషి. మాట్లాడేందుకు సమయం ఇవ్వలేదనే సభలో భైఠాయించారు. చంద్రబాబు ఓ బ్రోకర్.. బ్రోకర్‌ను సస్పెండ్ చేసి రైతులను కాపాడుతున్నాం. రైతులు పండించే పంటలను దోచుకునే దళారీ చంద్రబాబు. పోలవరం ఎత్తును పప్పు.. పప్పు తాత లవంగం నాయుడు వెళ్లి కొలిచారా..?’’అంటూ కొడాలి నాని వ్యగ్యాస్త్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment