సాహసోపేతంగా మంత్రి సీదిరి పర్యటన
సాక్షి, మందస: ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట ఆ ప్రాంతం. స్థానికులు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున మావోల సానుభూతి పరులే. ఆ గ్రామానికి చేరుకోవడం కూడా అంత సులభం కాదు. కొండలు, గుట్టలు కాలినడకన దాటితే గానీ వెళ్లలేం. అలాంటి ప్రాంతానికి మంత్రి సీదిరి అప్పలరాజు వెళ్లి సాహసం చేశారు. ఇటీవల మందస మండలం చీపి పంచాయతీలోని దాలసరి జలపాతం వార్తల్లోకి ఎక్కడంతో ఆ ప్రాంతంలో మంత్రి మంగళవారం పర్యటించారు. సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తానని చెప్పారు. కొండలు, ముళ్ల దారులను దాటుకుంటూ గ్రామానికి చేరుకున్న మంత్రికి గిరిజనులు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. ఇది అందరినీ ఒకింత ఆశ్చర్యపరిచింది. దాలసరి ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో ఒడిశా–ఆంధ్రా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment