
సాక్షి, విజయవాడ : వైయస్సార్ ఆసరా పథకాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టకాలంలోనూ ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహకార సంఘాలకు వైయస్సార్ ఆసరా పథకం కింద మొదటి విడత డబ్బులు జమ చేశామని, చరిత్రలో ఈరోజు నిలిచిపోతుందన్నారు. విజయవాడలో ఇప్పటివరకు ఫైన్ సహకార సంఘాల ఖాతాలో వందకోట్లు జమయ్యాయని పేర్కొన్నారు. (‘వైఎస్సార్ ఆసరా’కు సీఎం జగన్ శ్రీకారం)
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, వీటిని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ధ్వజమెత్తారు. నోటాకి వచ్చిన ఓట్లు కూడా కొందరు నేతలకు రాలేదని, అత్యంత దారుణంగా ఓటమిపాలై దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే విష్ణు మండిపడ్డారు. కొన్ని పార్టీలు ప్రజల్ని కులం మతం పేరుతో విడదీసే ప్రయత్నం చేస్తోందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మాన్ని కాపాడుతుందని తెలిపారు. (ప్రభుత్వ నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తప్పు )
Comments
Please login to add a commentAdd a comment