సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం నాటికి 46,61,355 టెస్టులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 61,529 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 7,956 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,75,079కు చేరింది. కొత్తగా 60 మంది మరణించగా మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,972 చేరింది. (ప్రతిపక్షానికి సభా సమయం ఇంకెక్కడి?!)
ఆదివారం 9,764 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఏపీలో 4,76,903 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 93,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా నిన్న చిత్తూరులో 9, అనంతపూరంలో 7, కర్నూలులో 5, ప్రకాశంలో 5, విశాఖలో 5, తూర్పు గోదావరిలో 4, కడపలో 4, కృష్ణాలో 4, శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 4, పశ్చిమగోదావరిలో 4, నెల్లూరు3, గంటూరులో 2 చొప్పున మరణించారు. (17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment