
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న తరుణంలో దానిని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వ్యాక్సిన్ స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ వైద్యారోగ్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. తొలుత ఆరోగ్య కార్యకర్తలు, ఆ తర్వాత కోవిడ్–19 అరికట్టడంలో ముందున్నవారు, వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
10 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీకి చైర్‌పర్సన్‌గా ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, సభ్య కన్వీనర్‌గా రాష్ట్ర ఇమ్యునైజేషన్ ఆఫీసర్ వ్యవహరించనున్నారు. వైద్యారోగ్యశాఖ కమిషనర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ శాఖ కార్యదర్శి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ, డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ సీఈవో, ఆయుష్ కమిషనర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్, ఏపీవీవీపీ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన జిల్లాస్థాయి కమిటీకి జిల్లా ఇమ్యూజనైజేషన్ ఆఫీసర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment