
తమిళనాడు సీఎం స్టాలిన్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసించారు. గురువారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు వచ్చిన స్టాలిన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, రెడ్డప్ప, శ్రీకృష్ణదేవరాయలు, వంగా గీత, తలారి రంగయ్యలను డీఎంకే ఎంపీ కనిమొళి పరిచయం చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్.. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మెచ్చుకున్నారు. లబ్ధిదారులకు నగదు బదిలీ చేస్తున్న సీఎం జగన్ అభినందనీయులని స్టాలిన్ పేర్కొన్నారు.
చదవండి: (AP: ఎక్కడికక్కడే పరిష్కారం)