
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్‌లోని సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. వ్యూహం సినిమాపై పచ్చ నేతలు కడుపు మంట చూపించారు. వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. వ్యూహం సినిమా పోస్టర్లను తగలబెట్టారు. చివరికి పోలీసులు కల్పించుకొని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
టీడీపీ కార్యకర్తల వీరంగంపై నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ.. సినిమాను సినిమాగానే చూడాలని తెలిపారు. సినిమాను సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం భావ్యం కాదని తెలిపారు. వ్యూహం సినిమా రిలీజ్ చేయకుండా ఉండటానికి టీడీపీ పన్నాగాలు చేస్తుందన్నారు. టీడీపీ కార్యకర్తలు రౌడీయిజం చేయడం, దాడులు చేయడం సరికాదని అన్నారు. టీడీపీ కార్యకర్తల దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: చంద్రబాబు కుర్చీలాట.. పావుగా పవన్ కల్యాణ్!