Tdp Chandrababu Cases Petitions..
06:37 PM, Nov7, 2023
బాబు ర్యాలీపై ఎన్‌హెచ్‌ఆర్సీలో కేసు నమోదు
►చంద్రబాబు హైదరాబాద్ ర్యాలీ పై జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission of India-ఎన్‌హెచ్‌ఆర్సీ)లో కేసు నమోదు
►స్కిల్ స్కాం కేసులో కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు
►హైదరాబాద్ బేగంపేట నుండి జూబ్లీహిల్స్ నివాసానికి ర్యాలీ చేపట్టిన బాబు
►బంజారాహిల్స్ రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని పిర్యాదు
►అంబులెన్స్ కు సైతం సైడ్ ఇవ్వకుండా ప్రాణాలతో చెలగాటం ఆడారని పిర్యాదు
►పోలీసులు చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని ఎన్‌హెచ్‌ఆర్సీకి పిర్యాదు
►ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు.. కేసు నమోదు
06:08 PM, Nov7, 2023
స్కిల్డ్ దొంగ చంద్రబాబే!: సీఐడీ
►టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు
►డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి
►2017-2018లో నకిలీ ఇన్‌వాయిస్‌లతో బయటపడ్డ అక్రమం
►అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం
►ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు
►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ
►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్ కూడా
►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు
►చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసం
►రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం
►ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం
►రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం
►ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారని సీఐడీ అభియోగం
►ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు
►ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు
►ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు
►చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు
సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
►కోర్టుల విచారణలో కీలక ఆధారాలను సమర్పించిన సీఐడీ
05:40 PM, Nov7, 2023
ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రబాబుకి 17ఏ వర్తిస్తుంది: హరీష్ సాల్వే
►చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు
►ఈ కేసులో ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది
►రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17ఏ ఉంది
►సెక్షన్ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుంది
►ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదు
►రిమాండ్ రిపోర్టు, కౌంటరు అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయి
►విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది
►మొదట్లో ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరులేదు. రిమాండ్ సమయంలో ఆయన పేరు చేర్చారు
►ఈ కేసులో చాలా మంది అధికారులను విచారించామని సీఐడీ చెప్పింది కానీ, ఒక్కరికి కూడా 17ఏ నిబంధన కింద అనుమతి తీసుకోలేదు
►నిబంధనలు పాటించలేదనడానికి ఇదే పెద్ద నిదర్శనం
►న్యాయ సమీక్ష జరిగితే కేసు మొత్తం మూసేయాల్సిన పరిస్థితి
►జీఎస్టీ చెల్లింపుల విషయాలను ప్రభుత్వానికి ముడిపెడుతున్నారు
►ప్రభుత్వం తరఫున జరిగిన అవినీతిగా చూపుతున్నారు
►దేన్ని దేనితో ముడిపెడుతున్నారో అర్థం కాని పరిస్థితి
►2021లో మళ్లీ విచారణ ప్రారంభించి ఆధారాల కోసం వెతుకుతున్నారు
►ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రబాబుకి 17ఏ వర్తిస్తుంది.
05:01 PM, Nov7, 2023
17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు: లాయర్ రోహత్గి
►చంద్రబాబు పిటిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు
►అక్టోబర్ 17న బలమైన వాదనలు వినిపించిన రోహత్గి
►స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయడం తొందరపాటు చర్యేనని రోహత్గి వాదన
►17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది
►17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు
►ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి
►పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు
►స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు
►17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది
►అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు
►అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు
►నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు
►ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం
►అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య
►విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు
►సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం
►కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు
►గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు
►ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే
►పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్‌లపై విచారించొచ్చు
►పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది
►సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు
►ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది
►ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది
►జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి
►స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం
►ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్‌లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది
►ఎఫ్‌ఐఆర్‌లో కాగ్నిజబుల్ అఫెన్సెస్‌కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం
►ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి
►ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు
►స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది
►పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు
►ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి
►ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది?
►ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్‌కు గురవుతారు
►రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు
►అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు
►మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు
►ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు
►ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు
►నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది
►సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి
►17ఏ అనేది ఈ కేసులో వర్తించదు
► 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది
►2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది
►2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు
►2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది?
►స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం
►ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది
►ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది
►గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది
►శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు
►ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది.
►ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది.
►ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు.
►అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది.
►జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి
►నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి
►అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు
►ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు?
►ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది
►రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్‌ను బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు
►కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు
►రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి
►కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు
04:45 PM, Nov7, 2023
స్కిల్ స్కాం కేసు.. రేపు జడ్జిమెంట్ డే
►స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో రేపు కీలక పరిణామం
►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపే తీర్పు
►సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలని తొలుత ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్
►సెప్టెంబర్ 22వ తేదీన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు
►స్కిల్ స్కాంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్
►తనపై నమోదు అయిన కేసు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్
►ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ చుట్టూరానే తిరిగిన వాదనలు
►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్-17ఏ పైనే వాడీవేడి వాదనలు
►చంద్రబాబు తరఫున హరీష్‌సాల్వే, సిద్ధార్థ లూథ్రా తదితరుల వాదనలు
►సీఐడీ(ఏపీ ప్రభుత్వం) తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ
►తీర్పు వెలువరించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం
4:03 PM, Nov7, 2023
దొంగ ఓట్లపై దొంగాట ఆడుతుందెవరు?
►పక్కా ప్లాన్ ప్రకారం దొంగ ఓట్లంటూ తెలుగుదేశం, పచ్చమీడియా ప్రచారం
►ఇటీవల దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు అంటూ CECకి ఫిర్యాదు చేసిన టిడిపి నేతలు
►పలు చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒక అడ్రస్ లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడితో చాలా ఓట్లు ఉన్నాయంటూ ఫిర్యాదు
►ఇదే విషయంపై దర్యాప్తులో బయటపడుతున్న అసలు నిజాలు
►టిడిపి నేతలు బలంగా ఉన్న చోట బోలెడు బోగస్ ఓట్లు
►ఇలాంటి ఓట్లను తొలగిస్తుంటే, అక్రమంగా టీడీపీ ఓట్లు తీసేస్తున్నారంటూ పచ్చమీడియా గగ్గోలు
►నిజమైన వ్యక్తుల ఓట్లు ఒక వేళ పోతే, ఆన్‌లైన్‌లో ధృవపత్రాలు పెట్టి మళ్లీ ఓటు పొందే అవకాశం
►అయినా బోగస్ ఓట్లు ఉండాలంటూ పచ్చమీడియా గగ్గోలు
►దొంగాట ఆడేది, గగ్గోలు పెట్టేది రెండూ టిడిపికి సంబంధించిన వాళ్లే
3:30 PM, Nov7, 2023
బీజేపీని పవన్ కళ్యాణ్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?
►తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండబోదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన బీజేపీ
►ఏపీలో కూడా పొత్తు విషయంలో ఆసక్తి కనబరచని బీజేపీ
►అయినా టీడీపీతో బీజేపీ పొత్తు కోసం నానా తంటాలు పడుతోన్న పవన్
►మీ కోసం ఏమైనా చేస్తా.. టిడిపితో పొత్తు పెట్టుకోవాలని బీజేపీని అడుగుతోన్న పవన్
►మీరు పొత్తు ప్రకటించకపోతే నేనేళ్లి పోతానంటున్న పవన్
►పవన్ కళ్యాణ్‌ను అంత నమ్మదగ్గ పార్ట్‌నర్‌గా అంగీకరించని బీజేపీ
►ఏపీలో ఈ సారి టిడిపితో పొత్తు పెట్టుకోకుంటే.. బీజేపీతో కలిసి పవన్ ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతారని అంచనా
►అదే విషయాన్ని పవన్‌తో ప్రధాని మోదీ చెప్పారంటున్న బీజేపీ నేతలు
►అయినా టిడిపితో పొత్తు కావలంటూ బీజేపీపై పవన్ ఒత్తిడి తెస్తున్నారంటున్న నేతలు
►అసలు పవన్‌కు సీన్ ఎంత ఉంది? ఎంత మంది ఓట్లేస్తారు?
►సినిమా ఇమేజ్ వేరు, నిజ జీవితం వేరు? పవన్‌ను అనవసరంగా నమ్ముతున్నామా?
►సొంతంగా ఎమ్మెల్యే కాలేకపోయారు? మనకు ఓట్లేమీ తెస్తారు?
(చిరకాల మిత్రులు పవన్, బాబు)
3:04 PM, Nov7, 2023
మాట్లాడితే వ్యవస్థలంటారు.. మరి మీరు చేసిందేంటీ?
►కేసులు పెట్టించుకుంటే 48 గంటలలో హైకోర్టు నుంచి బెయిల్ ఇప్పిస్తానని చెప్పింది లోకేష్ కాదా?
►ఆలయాలపై దాడులు చేసి, తిరిగి ప్రభుత్వంపైనే ఆరోపణలు చేసి అశాంతి సృష్టించడానికి యత్నించింది టీడీపీ, జనసేన కాదా?
►అంగళ్లులో రెచ్చిపోయి కార్యకర్తలతో పోలీసులపై దాడులు చేయించింది చంద్రబాబు కాదా?
►పవన్ కళ్యాణ్ కాని, చంద్రబాబు నాయుడు కాని, లోకేష్ కాని తమ సభలలో ఎలా ప్రజలను రెచ్చగొట్టలేదా?
►ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి మీటింగ్‌లు పెట్టింది చంద్రబాబు కాదా!
►కందుకూరులో జరిగిన తొక్కిసలాటకు కాని, గుంటూరు తొక్కిసలాటకు కాని, తద్వారా పదకుండు మంది మరణానికి గాని కారణం టీడీపీ కాదా?
►వాటినన్నిటిని సమర్ధించే దుస్థితికి పవన్ కళ్యాణ్ చేరుకోవడం కనిపించడం లేదా
►వలంటీర్ల మొదలు ఎవరిని పడితే వారిని పవన్ నోటికి వచ్చినట్లు దూషించడం సరైన చర్యా! పైగా ప్రభుత్వంపై ఆరోపణా?
2:40 PM, Nov7, 2023
22కు వాయిదా
►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 22కు వాయిదా
►విచారణను ఈనెల 22కు వాయిదా వేసిన హైకోర్టు
►మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల స్ఫూర్తిని పాటిస్తామన్న అడ్వకేట్ జనరల్
►తొందరపాటు చర్యలు తీసుకునే ఉద్దేశం లేదని హామీ ఇచ్చిన ఏజీ
1:50 PM, Nov7, 2023
సోనియా, రాహుల్, బాబు.. చాలా క్లోజ్
►కొన్నాళ్లుగా కాంగ్రెస్ అధిష్టానంతో అత్యంత సన్నిహితంగా చంద్రబాబు
►ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కిరణ్‌కుమార్ రెడ్డి సర్కారును కాపాడిన చంద్రబాబు
►నాడు సభలో బలం లేకపోయినా.. చంద్రబాబు సహకారంతో నిలబడ్డ కాంగ్రెస్ సర్కారు
►సోనియా ఆదేశాలతో శంకర్రావు వేసిన కేసులో తన వాళ్లను ఇంప్లీడ్ చేసిన చంద్రబాబు
►2019కి ముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కోసం కృషి చేసిన చంద్రబాబు
►పదవి పోయిన తర్వాత కూడా అదే ధోరణిని కంటిన్యూ చేసిన చంద్రబాబు
►కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో కుమ్మక్కై ఏపీకి పరిశ్రమలే రాకుండా చేసిన చంద్రబాబు
►ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు పోటీకి టిడిపిని దూరం పెట్టిన చంద్రబాబు
►చంద్రబాబుకు హైదరాబాద్‌లో అంత ప్రజాభిమానం ఉందనుకుంటే టీడీపీ ఇప్పుడు ఎందుకు పోటీచేయడం లేదు?
►సమాధానం ఒక్కటే.. కాంగ్రెస్ గెలవాలన్నదే చంద్రబాబు లక్ష్యం
1:32 PM, Nov7, 2023
తెనాలి సభతో తేటతెల్లం
►ఇన్నాళ్లు కాపు ఓటర్లు అధికమంటూ తెనాలిపై ముద్ర
►పవన్ కళ్యాణ్ అవవనిగడ్డలో జరిపిన సభకు హాజరైన జనం కంటే వైసీపీ సామాజిక సాధికార యాత్రకే జనం అధికం
►ప్రజలు కులాన్నికాదు, సంక్షేమం, అభివృద్ధిని చూస్తారని నిరూపించిన ఘటన ఇది
►కులం పేరుతో ఓటర్లను విభజించొద్దని ప్రజలు ఇచ్చిన సందేశం ఇది
1:25 PM, Nov7, 2023
కాపులను తీసుకెళ్లి TDPకి సరెండర్ చేయాలన్నది పవన్ ప్లాన్ : YSRCP
►పవన్ కళ్యాణ్ తీరుపై విమర్శలు
►ఇన్నాళ్లు కాపులు సీఎం కావాలని పిలుపునిచ్చారు
►ఇప్పుడు చంద్రబాబుకు మద్ధతంటూ పొత్తు పెట్టుకున్నారు
►ఇప్పటివరకు కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న ప్రాంతాలలోనే వారాహి యాత్రలు చేశారు
►ఇప్పుడు మీరంతా టిడిపికి మద్ధతివ్వాలని ఎలా చెబుతారు?
►జనసేనను టీడీపీకి, చంద్రబాబుకు సరెండర్ చేయడమేనా పవన్ ప్లాన్?
►కాపు వర్గానికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న స్కీములపై ఏమంటారు?
►మీ రాజకీయ ప్రయోజనాల కోసమా కాపులతో ఆటలు?
1:37PM, Nov7, 2023
స్కిల్ స్కాం అప్‌డేట్స్
►స్కిల్ స్కాం కేసులో భాస్కర్ ప్రసాద్‌కు బెయిల్!
►బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ అభయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం
►సీమెన్స్ సంస్థ డైరెక్టర్ గా ఉండి ప్రాజెక్టు వ్యయం పెంచారని గతంలో సీఐడీ కేసు
►భాస్కర్ ప్రసాద్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు
►దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన భాస్కర్ ప్రసాద్
1:35PM, Nov7, 2023
►ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
►ఇసుక పాలసీపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
►ఇసుక కుంభకోణంలో ఏ2గా ఉన్న చంద్రబాబు
1:26PM, Nov7, 2023
మరి గవర్నర్‌కు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు?
►చంద్రబాబు తప్పు చేయలేదని గవర్నర్‌కు ఎందుకు బలంగా చెప్పలేదు?
►చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చిన విషయాన్ని ఎందుకు చెప్పలేదు?
►చంద్రబాబు పీఏ శ్రీనివాస్ చౌదరీ అమెరికా పారిపోయిన విషయాన్ని ఎందుకు చెప్పలేదు?
►అమరావతి పేరిట భ్రమరావతిని గ్రాఫిక్స్‌లో సృష్టించామని ఎందుకు చెప్పలేదు?
►సింగపూర్ ప్రభుత్వం అని ప్రచారం చేసి ప్రైవేట్ వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఎందుకు చెప్పలేదు?
►ఫైబర్‌గ్రిడ్ పేరుతో వందల కోట్ల రుపాయలు పక్కదారి పట్టిన విషయాన్ని ఎందుకు చెప్పలేదు?
►స్కిల్ స్కాంలో 13 సంతకాలు పెట్టి ఆగమేఘాల మీద చంద్రబాబు నిధులు విడుదల చేయించారని ఎందుకు చెప్పలేదు?
1:25PM, Nov7, 2023
ఏపీ గవర్నర్‌ను కలిసిన నారా లోకేష్
►8 పేజీల వినతి పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించిన టీడీపీ
►మాపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని గవర్నర్‌కు వివరణ
►నా యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందన చూసి కేసులు పెట్టారు
►మా పార్టీ టీడీపీ లెక్కలు అడుగుతున్నారు
►2014 నుంచి ఎవరెవరు ఫండ్స్ ఇచ్చారో చెప్పాలంటున్నారు
1:24PM, Nov7, 2023
►ఆస్పత్రిలో చంద్రబాబుకు ముగిసిన చికిత్స
►కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేసిన ఎల్వీ ప్రసాద్ వైద్యులు
►2 గంటల పాటు చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్ సర్జరీ
►ఆస్పత్రి నుంచి ఇంటికి చంద్రబాబు నాయుడు
1:22PM, Nov7, 2023
►ఎల్లుండి(గురువారం) సుప్రీంకోర్టులో చంద్రబాబునాయుడు ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ
►జస్టిస్ అనిరుధ్ బోస్ కోర్టు లో 11 వ నెంబర్ ఐటెంగా లిస్ట్ అయిన కేసు
►ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు
►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఏపీ హైకోర్టు
►హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేసిన చంద్రబాబు
►విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
►స్కిల్ స్కాం కేసులో తాము తీర్పు ఇచ్చేవరకు ఆగాలని, గత విచారణలో సూచించిన సుప్రీంకోర్టు
►ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపులలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని సిఐడి అభియోగాలు
►చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాప్ట్ కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు
►బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడం పై అవినీతి ఆరోపణలు
1:00 PM, Nov 7, 2023
ఐఆర్‌ఆర్ కేసుపై విచారణ వాయిదా
►ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
►ఈ నెల 22కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
►ఈ నెల 22 వరకు చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పిన ఏజీ
►ఏజీ హామీని రికార్డ్ చేసి కేసును వాయిదా వేసిన న్యాయమూర్తి
12:50 PM, Nov 7, 2023
ఏపీ గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు
►ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన నారా లోకేశ్, టీడీపీ నేతలు
►చంద్రబాబుపై నమోదైన కేసుల గురించి వివరణ
12:40 PM, Nov 7, 2023
ఏపీలో నకిలీ ఓట్ల వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు
►ఏపీలో నకిలీ ఓట్ల వ్యవహారంలో కీలక పరిణామం
►విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
►ఏపీలో దొంగ ఓట్లపై సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ పిటిషన్
►గతంలో ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసినందున కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నామన్న జస్టిస్ మిశ్రా
12:30 PM, Nov 7, 2023
కంటి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి చంద్రబాబు
►ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చంద్రబాబు
►కంటి ఆపరేషన్ చేయించుకోనున్న చంద్రబాబు
8:55 AM, Nov 7, 2023
►ఎన్టీఆర్‌గారి ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి!
►ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి...పాపం!
►73 ఏళ్ల వయస్సులో ఆపెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారే.
►ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా !
ఎన్టీఆర్ గారి ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి! ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి...పాపం! 73 ఏళ్ల వయస్సులో…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 7, 2023
8:54 AM, Nov 7, 2023
పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
►పురందేశ్వరి గారు...కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయాలు.
►నదులన్నీ సముద్రంలో కలిసినట్లు..మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే
►మీ అంతిమ లక్ష్యం కుల "ఉద్దారణే"
►మీకు సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవు... స్వార్థం తప్ప.
►ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం.
పురందేశ్వరి గారు...
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 7, 2023
కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయాలు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు...మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే. మీ అంతిమ లక్ష్యం కుల "ఉద్దారణే". మీకు సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవు...స్వార్థం తప్ప.…
7:37 AM, Nov 7, 2023
నేడు ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ కేసు విచారణ
►చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ
►గత విచారణలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు
►చంద్రబాబుకు నేటి వరకూ మధ్యంతర బెయిల్
►గత విచారణలో ఏసీబీ కోర్టులో విచారణ దశలో ఉన్న పీటీ వారెంట్‌పై ఇవాల్టి వరకూ స్టే ఇచ్చిన హైకోర్టు
►ఇవాళ(నవంబర్7, మంగళవారం) ఇదే కేసులో హైకోర్టు విచారణ
7:34 AM, Nov 7, 2023
విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్
►‘ఫైబర్‌నెట్’ నిందితుల ఆస్తుల అటాచ్‌కు అనుమతివ్వండి
►ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతివ్వాలని నిన్న(సోమవారం)పిటిషన్
ఫైబర్‌నెట్ కేసులో అటాచ్‌కు నిర్ణయించిన ఆస్తుల వివరాలు ఇవి
►నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చ.అడుగుల ఇంటి స్థలం, ఆయన డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్‌కు విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్‌లో ఉన్న ఓ ఫ్లాట్.
►మరో నిందితుడు టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్
►శ్రీనగర్ కాలనీలో ఉన్న రెండు ఫ్లాట్‌లు, యూసఫ్‌గూడలో ఉన్న ఫ్లాట్, ఆయన భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి.
7:10 AM, Nov 7, 2023
నేడు చంద్రబాబుకు కంటి ఆపరేషన్
► నేడు LV ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి ఆపరేషన్
► సోమవారం AIG ఆస్పత్రిలో చికిత్సలు
► వైద్య పరీక్షలు చేయించుకుని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు
7:05 AM, Nov 7, 2023
పార్టీ సీనియర్ల తీరుపై చంద్రబాబు గుర్రు
► జైల్లో 52 రోజులుంటే పార్టీని ఎవరూ పట్టించుకోలేదని బాబు ఆవేదన
► దిక్కు, దివానం లేకుండా పార్టీని వదిలేశారని ఆవేదన
► కలవడానికి వచ్చిన సీనియర్లపై తీవ్ర ఆగ్రహం
► తాను జైల్లో ఉంటే పార్టీ పని అయిపోయిందన్న సీను ఎలా వచ్చిందని ప్రశ్నలు
► రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ నామమాత్రం ఆందోళనలతో సరిపెట్టారని ఆగ్రహం
► విడుదలైన తర్వాత అప్పటికప్పుడు జనసమీకరణ చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన.
7:00 AM, Nov 7, 2023
పురంధేశ్వరికి విజయసాయి కౌంటర్
►స్వార్థం, కపటం పురంధేశ్వరి సహజ అభరణాలు.
►టీడీపీతో పొత్తులేకున్నా సొంత పార్టీని గాలికొదిలేసి దానిని తలకెత్తుకున్నారు.
►బంధుత్వం మాటున ఆమె రహస్య ఎజెండా ఏమిటంటే బావ చంద్రబాబు గారి సహాయంతో ఎంపీగా గెలిచి బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారు.
►అందుకే ఆయనపై ఈగ కూడా వాలకుండా విసనకర్ర ఊపుతున్నారు.
స్వార్థం, కపటం పురంధేశ్వరి సహజ అభరణాలు. టీడీపీతో పొత్తులేకున్నా సొంత పార్టీని గాలికొదిలేసి దానిని తలకెత్తుకున్నారు. బంధుత్వం మాటున ఆమె రహస్య ఎజెండా ఏమిటంటే బావ చంద్రబాబు గారి సహాయంతో ఎంపీగా గెలిచి బిజెపి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారు. అందుకే ఆయనపై ఈగ కూడా వాలకుండా…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023
6:50 AM, Nov 7, 2023
బాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు?
►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు
►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే
►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే
►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే.
►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే.
►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే
►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే
►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే.
►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు
►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే
►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే
►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే
►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే
►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP
Comments
Please login to add a commentAdd a comment