
అమరావతి: ఏపీ హైకోర్టులో అమరావతి పాదయాత్రకు చుక్కెదురైంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. షరుతులకు లోబడే పాదయాత్ర జరగాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు అమరావతి పాదయాత్రకు సంబంధించి వేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. డీజీపీ ఇచ్చిన గుర్తింపు కార్డులు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డునైనా పోలీసులకు చూపించాలని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. పాదయాత్రలో పాల్గొనకుండా మరే రకంగా అయినా సంఘీభావం తెలప వచ్చని తెలిపిన కోర్టు.. తమ ఆదేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించవద్దని పేర్కొంది. ఒకవేళ పాదయాత్రలో షరతులను ఉల్లంఘిస్తే యాత్ర రద్దు కోసం రాష్ట్ర డీజీపీ తమను ఆశ్రయించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి: సుప్రీంకోర్టులో అమరావతి కేసు.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
Comments
Please login to add a commentAdd a comment