శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపించే సరికి టీడీపీ కొత్త డ్రామాలకు తెరతీస్తోంది. కావలి టికెట్ ఆశవహుడు మాలెపాటి సుబ్బానాయుడు ఏకంగా జనంతో పాటు లోకేశ్ దృష్టిలో పడేందుకు ఛీప్ ట్రిక్స్ ప్రయోగిస్తున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో మాలెపాటి తన అనుచరగణంతో రభస సృష్టిస్తున్నాడు. టీడీపీ అధినేత కొడుకు లోకేశ్ యువగళం యాత్ర జిల్లాలోకి ప్రవేశించిన నేపథ్యంలో కావలిలో తన ఉనికిని చాటుకునేందుకు మాలెపాటి వ్యవహర తీరు హద్దులు దాతుతోంది. ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడి అధికారులను నిర్బంధించి ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా ప్రచారంలో రావాలనే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ అభిజ్ఞ వర్గాల బోగట్టా.
కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా క్షేత్రస్థాయిలో నామ మాత్రపు ఉనికికే పరిమితమైంది. టీడీపీ అసెంబ్లీ అభ్యరి్థత్వం కోసం ఆ పార్టీ నేతలు ఎవరికి వారు తమదైన శైలిలో పైరవీలు చేసుకుంటూ పోతున్నట్లు కనిపిస్తోంది. దశాబ్దన్నర కాలంగా బీద రవిచంద్ర టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, ఆ పార్టీ నామినేటెడ్ ఎమ్మెల్సీగా కావలి నియోజకవర్గంలో పెత్తనం చేస్తూ తన గుపెట్లో పెట్టుకున్నాడు. పార్టీ అధికారంలో ఉండగా గ్రావెల్, మట్టి పేరుతో వందల రూ.కోట్లు దోచేసిన బీద ఇప్పటికీ తన పెత్తనంలో ఉంచుకున్నాడు. టీడీపీ అధికారం కోల్పోవడంతో పార్టీని నడిపించేందుకు ఆర్థికంగా బలవంతుడైన పంచాయతీ స్థాయి లీడర్‌ను తీసుకువచ్చి నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించి నడిపించారు.
ఎన్నికలు సమీపించే సరికి..
సార్వత్రిక ఎన్నికలు సమీపించే సరికి కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల కావలికి చెందిన ఓ బడాబాబుకే టికెట్ ఖరారు అయినట్లు ప్రచారం సాగింది. చివరికి ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియదు కానీ.. అటు బీద, ఇటు ఆ బడాబాబు మౌనంగా ఉంటే ఈ నాలుగేళ్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న మాలెపాటి మాత్రం టికెట్ రేసులో ముండుండాలని అడ్డదారుల్లో పరుగులు పెడుతున్నారు. ఏకంగా టీడీపీ అధినేత కొడుకు లోకేశ్ దృష్టిలో పడాలనే తాపత్రయంతో చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సదరు మాలెపాటి అండ్ కో, బీద కావలి నియోజకవర్గంలో గ్రావెల్, మట్టిని ఊడ్చిపారేశారు. ఇప్పుడొచ్చి అధికార పార్టీ ఎమ్మెల్యే గ్రావెల్ దోపిడీ చేస్తున్నాడంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. సాదాసీదా ఆందోళన అయితే ప్రచారం రాదని, ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడి ప్రజాస్వామ్యబద్ధానికి వ్యతిరేకంగా నిరంకుశ పోకడలతో ఆందోళనకు తెర తీశాడు. ప్రభుత్వ కార్యాలయంలో వంటావార్పు అంటూ చేసిన నిరసన ప్రజల్లోనూ అసహ్యం అనిపించింది.
పోలీస్ కేసులు ఉన్న వారికే ప్రాధాన్యత
పోలీసు కేసులు ఎక్కువ ఉన్న వారికి పారీ్టలో ప్రాధాన్యత ఉంటుందని ఇటీవల తరచూ లోకేశ్ చేస్తున్న ప్రచారాన్ని అందిపుచ్చుకున్న మాలెపాటి సుబ్బానాయుడు ప్రభుత్వ కార్యాలయాల్లో అలజడులు సృష్టిస్తున్నాడు. ఆ విధంగా తనపై పోలీసు కేసులు నమోదయ్యేలా ఛీప్ ట్రిక్స్ అనుసరిస్తున్నాడు. మాలేపాటి తనకే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కావలి టికెట్ అని బాహాటంగా ప్రకటించుకుంటున్నారు.
తెరపైకి కావ్య, పసుపులేటి
బీద రవిచంద్రతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా అసలు ఏ పారీ్టలో ఉన్నడో కూడా తెలియని దగుమాటి వెంకట కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) తనకే కావలి టీడీపీ టికెట్ అని చాపకింద నీరులా ప్రచారం సాగిస్తున్నాడు. ఏరోజు ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియని పసుపులేటి సుధాకర్ కూడా కావలి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానిక టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఏనాడు కావలి టీడీపీ బాగోగులు పట్టించుకోని బీద కనుసన్నల్లోనే స్థానిక టీడీపీ నాయకులు ఉండాలని సాక్షాత్తూ పార్టీ అగ్రజుడు చంద్రబాబు, లోకేశ్ స్పష్టత ఇవ్వడంతో స్థానిక పార్టీ క్యాడర్ రుసరుసలాడుతోంది. అయితే ఎన్నికల నాటికి బీద రవిచంద్ర ఈ టికెట్ తన్నుకుపోతాడనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బీద మాత్రం సైలెంట్‌గా తనకు లైన్ క్లియర్ చేసుకుంటుంటే.. మధ్యలో మాలెపాటి, కావ్య, పసుపులేటి టికెట్ కోసం కుయుక్తులు పన్నుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment