తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (గురువారం ) 51,349 మంది స్వామివారిని దర్శించుకోగా 14,082 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.65 కోట్లు సమర్పించారు.
టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
ఫిబ్రవరి 4న రథసప్తమిని పురస్కరించుకొని పాలకమండలి భేటీ కానుండగా.. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో సమీక్ష జరపనున్నారు ఛైర్మన్ బీఆర్ నాయుడు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. రథసప్తమి నాడు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు. 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా
Comments
Please login to add a commentAdd a comment