బాలికలకు ఏదీ భరోసా!? | Today is National Girls Day | Sakshi
Sakshi News home page

బాలికలకు ఏదీ భరోసా!?

Published Fri, Jan 24 2025 6:05 AM | Last Updated on Fri, Jan 24 2025 6:05 AM

Today is National Girls Day

ఎన్నికల హామీ ‘తల్లికి వందనం’ కూడా అమలుచేయని కూటమి ప్రభుత్వం

అటకెక్కిన బాలికలకు న్యాప్‌కిన్స్‌ పంపిణీ 

బాలికా విద్య, ఆరోగ్యం, రక్షణ గాలికి.. 

ఆడపిల్లల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టని చంద్రబాబు 

గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలకూ మంగళం

నేడు జాతీయ బాలికల దినోత్సవం

‘నవరత్నాల’తోపాటు అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బాలికలకు ఎంతో భరోసా కల్పించింది. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలతోపాటు అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలుచేసి తద్వారా బాలికా వికాసానికి వైఎస్‌ జగన్‌ సర్కారు ఎంతో తోడ్పాటునందించింది. 

విద్య, వైద్యం, రక్షణ, సంక్షేమం తదితర విషయాల్లో వారి కోసం ఆయన అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టారు. కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా కనీసం ఎన్నికల్లో హామీ ఇచి్చన తల్లికి వందనం పథకాన్ని సైతం అమలుచేయకపోగా ఉన్న పథకాలను కూడా నీరుగారుస్తోంది. నేడు జాతీయ బాలికల దినోత్సవం  సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బాలికలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనమామగా కొండంత అండగా నిలిచారు. తన హయాంలో వారికి అనేక పథ­కాలను అందించి పెద్ద మనస్సు చాటుకునే వారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌), సమగ్ర బాలల సంరక్షణ పథకం (ఐసీపీఎస్‌)ను సమర్థవంత­ంగా అమలుచేశారు. 

మైదాన ప్రాంతంలో 47,287 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, గిరిజన ప్రాంతంలోని 8,320 అంగన్‌వాడీల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ను పటిష్టంగా అమలుచేశారు. 

రాష్ట్రంలో మొత్తం 55,605 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అప్పుడే  పుట్టిన బిడ్డ నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని, వైద్య సేవలను, నర్సరీ విద్యను అందించడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒక్క బాలికలకే కాకుండా బాలురు, గర్భిణులు, బాలింతలు కలిపి 35 లక్షల మందికి క్రమం తప్పకుండా పౌష్టికాహార కిట్‌లను అందించి వారిలో రక్తహీనత లేకుండా చర్యలు చేపట్టారు.  

‘దిశ’తో ఆడబిడ్డలకు రక్షణ.. 
దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో దిశ బిల్లును తీసుకొచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంతోపాటు దోషులకు త్వరితగతిన శిక్షపడేలా చేసింది. ఈ యాప్‌ ద్వారా ఆపదలో ఉన్న ఆడపిల్లలు సమాచారం అందించిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వచ్చి ఆదుకున్న ఘటనలు కోకొల్లలు. 

దిశ పోలీస్‌స్టేషన్‌లు, ప్రత్యేక న్యాయస్థానాలు, వన్‌స్టాప్‌ కేంద్రాలు సైతం ఏర్పాటుచేసింది. సైబర్‌ నేరాల కట్టడికి 9121211100 వాట్సాప్‌ నెంబర్‌ను అందుబాటులోకి తెచి్చంది. ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో 9071666667 వాట్సాప్‌ నెంబర్‌నూ ప్రారంభించారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా 5,651 మంది బాలికలను రక్షించారు. 

బాల్య వివాహాలకు చెక్‌..  
పేద తల్లిదండ్రులకు తమ బిడ్డ పెళ్లి భారం కాకూడదనే పెద్ద మనçస్సుతో అందించిన వైఎస్సార్‌ కళ్యాణమస్తు పథకంలో ఆడపిల్లకు కనీసం 18 ఏళ్లు, ఉండాలనే నిబంధన పెట్టింది బాల్య వివాహాలను నిరోధించేందుకే. దీంతోపాటు.. కనీసం పదవ తరగతి చదివి ఉండాలనే నిబంధనవల్ల బాలికలను ఉన్నత విద్య చదువుకునేందుకు ప్రోత్సహించినట్లైంది. దీంతోపాటు బాల్య వివాహాల నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ కూడా అమలుచేశారు.  

సమర్థంగా జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ అమలు.. 
కేంద్ర ప్రభుత్వం అందించిన మిషన్‌ వాత్సల్య పథకంలో పిల్లల సమగ్రాభివృద్ధికి, వారి రక్షణ, మౌలిక సదుపాయాల కోసం జువెనైల్‌జస్టిస్‌ (కేర్‌–ప్రొటెక్షన్‌) యాక్ట్‌ను సమర్థవంతంగా అమలుచేసింది. వారి సహాయానికి 1981, 1098 టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ సెంటర్లు సేవలు అందించాయి. భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం ద్వారా ఆడ శిశువుల హత్యలను నివారించేందుకు  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. 

ఆడపిల్లల పట్ల కూటమి నిర్లక్ష్యం.. 
రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, గత ప్రభు­త్వం అమలుచేసిన కొన్ని పథకాలు అమలుచేయడం మినహా కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకం కూడా అమలుచేయలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి రూ.15వేలు చొప్పున ఇస్తా­మ­ని చెప్పి ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు. నాప్‌కిన్స్‌ పంపిణీని అటకెక్కించింది. ఒక్క అంగన్‌వాడీ కేంద్రా­ల్లో గత ప్రభుత్వం అందించిన పథకాలను అరకొరగానే కొనసాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం బాలి­కా విద్యను, ఆరోగ్యాన్ని, రక్షణను గాలికొదిలేసింది.

విద్యలో బాలికలకు ప్రాధాన్యం..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల విద్యను ప్రోత్సహించి వారి డ్రాపౌట్స్‌ను నిరోధించడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా..  
» అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థలోనే నూతనోధ్యయాన్ని సృష్టించింది. పేద పిల్లల చదువు కోసం ఏటా రూ.15 వేలు అందించి బాలికల విద్యను ప్రోత్సహించింది. 
»    నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి వారి  ఇబ్బందులను తొలగించింది.  
»    ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే 7వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్‌) చదివే యుక్తవయస్సు బాలికలు దాదాపు 10 లక్షల మందికి ‘స్వేచ్చ’ పథకంలో ఏడాదికి 120 శానిటరీ నాప్‌కిన్స్‌ను ఉచితంగా అందించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement