
నుజ్జునుజ్జయిన కారు
రాంబిల్లి: కొత్తూరు సమీపంలో శనివారం ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు కార్లు ఢీకొట్టుకున్న ప్రమాదం ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు ఎస్‌ఐ పి. రాజారావు తెలిపారు. అన్నవ రం సత్యనారాయణస్వామి దర్శనానికి వెళ్లి వస్తున్న కారు కొత్తూరు సమీపంలోకి రాగానే అచ్యుతాపురం నుంచి యలమంచిలి వైపు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తూ ఢీ కొంది.
అన్నవరం నుంచి వస్తున్న కారులో విశాఖ మల్కాపురానికి చెందిన పెళ్లి బృందం ఉంది. ఈ కారులో ప్రయాణిస్తున్న పెళ్లి కొడుకు, మరో మహిళకు గాయాలయ్యాయి. పెళ్లికొడుకు తండ్రి పిళ్లా శంకరరావు, పెళ్లి కుమార్తె క్షేమంగా ఉన్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో విశాఖపట్నంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment