Mountaineer Umesh Achanta Climbed Australia's 'Mount Kosciuszko' - Sakshi
Sakshi News home page

‘మౌంట్‌ కోజిస్కో’ని అధిరోహించిన ఉమేష్‌ ఆచంట

Published Tue, Nov 15 2022 9:26 AM | Last Updated on Tue, Nov 15 2022 10:56 AM

Umesh Achanta Climbed Mount Kosciuszko  - Sakshi

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, పర్వతారోహకుడు ఉమేష్‌ ఆచంట మరో ఘనకీర్తిని సాధించారు. ఆస్ట్రేలియా ఖండంలోనే అతి పెద్ద పర్వతం మౌంట్‌ కోజిస్కో పర్వతాన్ని అధిరోహించారు. ఈ నెల 5వ తేదీన మనదేశం నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిన ఉమేష్‌ 12వ తేదీన మౌంట్‌ కోజిస్కో పర్వతాన్ని అధిరోహించాడు.

ఈ పర్వతం ఎత్తు 2,228 మీటర్లు. ప్రస్తుతం ఈ పర్వతం పూర్తిగా మంచుతో నిండి ఉండటంతో పర్వతారోహణను పూర్తిగా ఆపేశారు. అయితే గతంలో రెండు పర్వతాలు ఎక్కిన అనుభవం ఉందని, ప్రత్యేక అనుమతి తీసుకుని ఉమేష్‌ పర్వతారోహణ పూర్తి చేశారు. ఉమేష్‌ ఆచంట మార్చి 2021లో మౌంట్‌ కిలిమాంజరో (ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద పర్వతం), ఆగస్టు 2021లో మౌంట్‌ ఎలబస్‌(యూరప్‌ ఖండంలో అతి పెద్ద పర్వతం) అధిరోహించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement