సాక్షి, విజయనగరం : బొబ్బిలిలో 4వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, మాన్సస్, సింహాచలం ఆస్తుల విషయంలో అవకతవకలు బయటపడ్డాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అవకతవకలకు పాల్పడ్డ ఇద్దరు అధికారులను సస్సెండ్ చేశామని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సింహాచలం భూములు అన్యాక్రాంతమైతే ఛైర్మన్ కాపాడలేకపోయారు. కొన్ని వందల ఎకరాలు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిని బయటపెడతాం. ఛైర్మన్ కూడా తప్పు చేశారని తేలితే చర్యలు తీసుకుంటాం. పెద్ద పెద్ద స్కామ్‌లు జరిగాయి.. త్వరలోనే బయటపెడతాం. బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆభరణాలు కోటలో ఉండాల్సిన అవసరమేంటి?. ఆస్తులు, నగలను కాపాడతాం.. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.
మాన్సస్‌లో వారసత్వ పోరు ప్రభుత్వ దృష్టికి వచ్చింది: బొత్స సత్యనారాయణ
టీడీపీ అధికారంలో ఉండగా బొబ్బిలి విషయంలో కోర్టుకు వెళ్లాల్సిన పనేముంది?. ఆరోపణ వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధికి ఉండాలి. మాన్సస్‌లో వారసత్వ పోరు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. అందుకనుగుణంగానే ఛైర్మన్‌గా ఆ కుటుంబంలో ఉన్న అర్హులైనవారిని ఛైర్మన్‌గా చేశాం. ప్రభుత్వం, మంత్రులపై కావాలనే బురదజల్లుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment