
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ నాయకుల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. 50 రూపాయలకే లిక్కర్ అందిస్తామని పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు నవ్వులపాలైతే.. పార్టీ నేతలు మరో అడుగు ముందుకేసి.. పార్టీ ఆఫీస్‌లో డ్యాన్సులతో హంగామా చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఆరేసుకోబోయి పారేసుకున్నామంటూ మహిళలతో కలిసి చిందులేశారు. వారంతా అసభ్యకరంగా కూడా నృత్యాలు చేసినట్లు తెలిసింది. విజయవాడ సిటీ బీజేపీ ఆఫీస్‌లో ఈ డ్యాన్సుల హంగామా సాగింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ హంగామాపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
చదవండి: సారా మాటలు డైవర్షన్ కోసమే.. బీజేపీ చీప్ పాలిట్రిక్స్
Comments
Please login to add a commentAdd a comment