అదే ఛీత్కారం! | Volunteers protested for the third day over Pawans comments | Sakshi
Sakshi News home page

అదే ఛీత్కారం!

Published Thu, Jul 13 2023 4:17 AM | Last Updated on Thu, Jul 13 2023 7:40 AM

Volunteers protested for the third day over Pawans comments - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌:  వలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. మూడోరోజు బుధవారం నాడు కూడా నిరసనలు పెల్లుబికా­యి. అన్ని జిల్లాల్లో వలంటీర్లు, సచివాలయా­ల ఉద్యోగులు, ప్రజలు, పలు సంఘాల ప్రతినిధులు పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నిరసన ర్యాలీలు, మానవ హారాలు నిర్వహించారు. పవన్‌ దిష్టి బొమ్మలు దహనం చేశారు. పలుచోట్ల పవన్‌పై పోలీసులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. పవన్‌ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాము తలచుకొంటే వారాహి యాత్ర ముందుకు సాగదని హెచ్చరించారు.

విజయనగరం జిల్లాలో నిరసన ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి,  పవన్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయన చిత్రపటా­లకు చెప్పుల దండలు వేసి ఊరేగించారు. పవన్‌పై చర్యలు కోరుతూ గరివిడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా  కేదారిలంకలో వల­ం­టీర్లు నిరసన వ్యక్తం చేశారు. ఉప్పలగుప్తం మండల కేంద్రం వద్ద పవన్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు. తమ మనో­భావాలు దెబ్బతినేలా మాట్లాడినందుకు పవన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో వినతి పత్రం అందించారు.

రాజోలు, ఇరుసుమండ, లక్కవరం, గూడపల్లి, పల్లిపాలెంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. మామిడికుదురు మండలం పెదపట్నం, తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకలో మానవహారాలు నిర్వహించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, కుక్కునూరు, కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామాల్లో పవన్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా మూడో రోజూ నిరసనలు కొనసాగాయి. బుధవారం చీమకుర్తిలో పవన్‌  దిష్టిబొమ్మను వలంటీర్లు దహనం చేసి, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం పవన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ చీమకుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో పవన్‌ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దహనం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు, కలిగిరిలో వలంటీర్లు భారీ ప్రదర్శనలు చేసి ప్యాకేజీ స్టార్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పవన్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు.

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల వలంటీర్లు  మానవహారాలు నిర్వహించారు. పవన్‌ దిష్టిబొమ్మలను చెప్పులు, చీపుర్లతో కొడుతూ దహనం చేశారు. పవన్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని గంగాధర నెల్లూరు, పెనుమూరు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో వలంటీర్లు నిరసన ర్యాలీ నిర్వహించి పోలీసు స్టేషన్‌లో పవన్‌పై ఫిర్యాదు చేశారు. జూపాడుబంగ్లా మండలం మండ్లెం సచివాలయం–1 పరిధిలో పవన్‌ ఫొటోకు చెప్పుల దండ వేసి నిరసన ర్యాలీ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర, అమరాపురం, పుట్టపర్తి, కుందుర్పి, బెస్తరపల్లి తదితర ప్రాంతాల్లో వలంటీర్లు నిరసన ప్రదర్శనలు చేశారు.

విజయవాడలో న్యాయవాదులు, వలంటీర్ల ఫిర్యాదు
వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ విజయవాడ లీగల్‌ సెల్‌ ప్రతినిధులు, పలువురు వలంటీర్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌లో డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ (డీసీపీ–అడ్మిన్‌ ) మోకా సత్తిబాబుకు బుధవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

కోవిడ్‌ బాధితులకు కుటుంబ సభ్యులే దూరంగా ఉన్న తరుణంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు సేవలందించారని గుర్తుచేశారు. ప్రకృతి వైపరీత్యాల్లో సైతం సేవ చేస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రతి పథకం ప్రజల ముంగిటకే చేరుతోందన్నారు.

వలంటీర్లు తలచుకుంటే వారాహి యాత్ర ఒక్క అడుగు ముందుకు సాగదని హెచ్చరించారు. వలంటీర్లకు పవన్‌ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. డీసీపీని కలిసిన వారిలో న్యాయవాదులు సాయిరామ్, ఒగ్గు గవాస్కర్, నిర్మల రాజేష్, గంజి కిరణ్, విఠల్, బసవరెడ్డి, రజాక్, ఉషాజ్యోతి, లావణ్య, కె.వెంకటేష్‌శర్మ, పలువురు వలంటీర్లు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement