
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దురుద్దేశపూర్వకంగా జనాన్ని రెచ్చగొట్టేందుకే పవన్ కళ్యాణ్ వలంటీర్లను దూషిస్తున్నాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి టీవీలో నిర్వహించిన డిబేట్‌లో పలువురు పవన్ కళ్యాణ్ తీరును తప్పుబట్టారు. వలంటీర్లు సామాజిక సేవ చేస్తుంటే వారిని సంఘ విద్రోహశక్తులుగా చిత్రీకరించడం చూస్తుంటే.. పవన్‌కు పిచ్చి ముదిరిందనుకోవాలని అభిప్రాయపడ్డారు.
నేషనల్ క్రైం డాటా రిపోర్టు ప్రకారం 2014 నుంచి 2019 పీరియడ్‌తో పోలిస్తే.. శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని, ఏ విధంగా చూసినా మహిళలకు భరోసా ఉందని తెలిపారు. ఆ అయిదేళ్ల కాలం చంద్రబాబుతో అంటకాగిన పవన్ కళ్యాణ్ నిద్రపోయాడా? లేక నిద్ర నటించాడా? అంటూ ప్రశ్నించారు. ఇంట్లో వ్యక్తులు బయటికి వెళ్లి ఏం చేస్తున్నారో వలంటర్లు తెలుసుకునే వ్యవస్థ ఉంటే.. పాపం రేణు దేశాయ్ అలా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకునేవారు కాదని చురకలంటించారు.
సాక్షి టీవీలో సీనియర్ యాంకర్ హరి నిర్వహించిన డిబేట్ పూర్తి వీడియో ఇక్కడ చూడవచ్చు
Comments
Please login to add a commentAdd a comment