
సాక్షి, కర్నూలు: నంద్యాలలో నిండు గర్భిణీ దారుణ హత్యకు గురయింది. లక్ష్మి అనే వివాహితను మరో మహిళ కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన నంద్యాల లోని వైఎస్సార్ నగర్లో చోటుచేసుకుంది. అయితే లక్ష్మీ తండ్రి వెంకట రాముడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకొని లక్ష్మీ, ఆమె తల్లి భారతి ఆ మహిళతో వాగ్వివాదం జరిగింది. గర్భిణీ లక్ష్మీపై క్షణికావేశంలో ఓ మహిళ హత్య చేసింది. కాగా ఒక్కసారిగా 8 నెలల నిండు గర్భిణీ లక్ష్మి పై కత్తితో దాడికి పాల్పడడంతో అక్కడికక్కడే లక్ష్మీ మృతి చెందింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment