YSRCP Legislative Assembly Meeting on 15th March Updates - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి: సీఎం జగన్‌

Published Tue, Mar 15 2022 7:44 AM | Last Updated on Tue, Mar 15 2022 7:49 PM

YSRCP Legislative Assembly Meeting on 15th March Updates - Sakshi

సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం సమావేశం ముగిసింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్‌ కమిటీల ఏర్పాటుపై సీఎం జగన్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

సీఎం జగన్‌ సూచించిన పలు మార్గనిర్దేశకాలు..

► ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు వెళ్లాలన్న సీఎం జగన్‌
ప్రతిరోజు నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తామన్న సీఎం జగన్‌
క్యాడర్‌ ప్రజలకు దగ్గర చేయాలన్న సీఎం
► బూత్‌ కమిటీలను బలోపేతం చేయాలి
► బూత్‌ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి
► ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి
► ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి
► మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలను సందర్శించాలి
► ఒక్కో గ్రామ సచివాలయానికి వారంలో రెండు రోజులు వెళ్లాలన్న సీఎం జగన్‌

► ఏప్రిల్‌కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలన్న సీఎం
► కొత్త జిల్లాల వారీగా రీజినల్‌ కోఆర్డినేటర్లను నియమిస్తామన్న సీఎం 
► జూలై 8న ప్లీనరీ నిర్వహిస్తామన్న సీఎం జగన్‌ 
► మంత్రివర్గాన్ని కూడా పునర్‌ వ్యవస్థీకరిస్తాం: సీఎం జగన్
► 26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తాం: సీఎం

► కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించాం: సీఎం జగన్‌
దీని వల్ల మనం గర్వంగా ప్రజలకు దగ్గర వెళ్లగలం: సీఎం 
► టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న సీఎం జగన్‌ 
► మనం చేస్తున్న యుద్ధం చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, tv-5తో కూడా: సీఎం జగన్‌
► వీరంతా ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు: సీఎం 
► ఎప్పటికప్పుడు మనం వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం జగన్‌

చదవండి: ‘కల్తీ’ మాటలేల! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement