
సాక్షి, చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొంగణపల్లిలో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో గురువారం కూడా కుప్పంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల నినాదాలు చేస్తున్నాయి. బుధవారం శ్రీనివాసులుపై జరిగిన దాడికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆందోళనల నేపథ్యంలో కుప్పంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పార్టీ నేతల ఆందోళనల మధ్య కుప్పుంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ అలుపెరగని పోరాటం.. కదిలిన కేంద్రం