సంఘీభావం ప్రకటిస్తున్న నేతలు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లో బడుగు, బలహీన వర్గాల ప్రజలు సాధికార ఉత్సవం నిర్వహించాయి. సీఎం వైఎస్ జగన్ అందించిన చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధించిన అభివృద్ధిని తెలియజేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వైఎస్సార్‌సీపీ సోమవారం ఇక్కడ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా పాల్గొన్నారు.
యువత కేరింతలు, బాణసంచా, వాయిద్యాలు, జానపద నృత్యాలతో యాత్ర పండుగలా సాగింది. ఆర్థికంగా చేయూతనిచ్చి, రాజకీయ, సామాజిక ప్రాధాన్యతనిచ్చి, ఉద్యోగావకాశాలు కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు అండగా ఉంటామని బడుగు, బలహీన వర్గాలు నినదించాయి. ర్యాలీకి స్థానిక ప్రజలు అడుగడుగునా హారతులు పట్టారు.
జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభకు ర్యాలీలో పాల్గొన్న వారితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభలో నాయకులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఇతర వర్గాలకు చేస్తున్న మేలును వివరించారు. ప్రజలు పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలు చేశారు. ‘జగనే రావాలి.. మళ్లీ జగనే కావాలి’ అంటూ సభ ఆద్యంతం నినాదాలు చేస్తూనే ఉన్నారు. బద్వేల్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం వైఎస్ జగన్‌తోనే నడుస్తామని నేతలు, ప్రజలు మూకుమ్మడిగా ప్రకటించారు.
పేదలకు మరింత సంక్షేమం : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయిని పెంచిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. సీఎం జగన్ చేసిన మేలుతో మన కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చాలా చులకనగా చూశారని, హేళన చేసే వారని అన్నారు. కూలివాడి కొడుకు కూలీగానే ఉండాలని ఆలోచించేవాడు చంద్రబాబు అయితే, కూలివాడి కొడుకు కలెక్టర్ కావాలని ఆలోచించి, అందుకు ఏమి చేయాలో అదంతా చేసే వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
బీసీ సీఎంలు కూడా సాహసించలేదు: కడప మేయర్ సురేష్ బాబు
దేశంలో ఎంతో మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ, ఎవరూ పాటించని సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్ జగన్ మాత్రమే చేతల్లో చూపించారని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. జగన్ సీఎం అయ్యాక బ్రహ్మంసాగర్‌కు రూ.600 కోట్లు మంజూరు చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని 17 టీఎంసీలకు పెంచారని తెలిపారు. కలసపాడు, పోరుమామిళ్ల, బి.మఠం మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారన్నారు.
ఆడపడుచులకు దేవుడిచ్చిన అన్నయ్య సీఎం జగన్ : మాజీ ఎంపీ బుట్టా రేణుక
సీఎం వైఎస్ జగన్ పేదింటి ఆడపడుచులకు దేవుడిచ్చిన అన్నయ్య అని మాజీ ఎంపీ బుట్టా రేణుక చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో వివిధ పథకాల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు నగదును జమ చేస్తున్నారని తెలిపారు.
బద్వేలులో రూ.1268.72 కోట్లు : ఎమ్మెల్సీ గోవిందరెడ్డి
బద్వేలు నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ 1,38,763 మందికి రూ.1268.73 కోట్లు నగదు బదిలీ చేశారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చెప్పారు. ఇందులో 88,214 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు రూ.782.72 కోట్లు ఇచ్చారన్నారు. ఈ సంక్షేమం కొనసాగాలంటే జగన్‌ను మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ గోపవరం వద్ద రూ.1000 కోట్లతో సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపా«ధి కలి్పస్తున్నారని ఎమ్మెల్యే సుధ చెప్పారు. ఎమ్మెల్సీలు ఇషాక్, రమేష్ యాదవ్, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, జెడ్పీ చైర్మన్ అమర్‌నాథరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment