అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
మదనపల్లె సిటీ: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో కామర్స్ సబ్జెక్టు బోధించేందుకు అతిథి అఽధ్యాపకులుగా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కృష్ణవేణి తెలిపారు. నెట్, ఏపీ సెట్, డాక్టరేట్ (పీహెచ్‌డీ) ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హత కలిగినవారు డిసెంబర్ 23 సోమవారం లోపు దరఖాస్తును కార్యాలయంలో అందజేయాలన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై
రైతులకు అవగాహన
పుల్లంపేట: మండల పరిధిలోని రాజుగారిపల్లిలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా రాగి, జొన్నలు, కొర్రలు పండించాలన్నారు. కౌలు గుర్తింపు కార్డు తీసుకున్న రైతులందరికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. అనంతరం ఉద్యానవన శాస్త్రవేత్త సందీప్ నాయక్ ఆకుతోటల్లో, మామిడి పూలు, అరటితోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవాకేంద్ర సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పి.మస్తాన్, లోకేశ్వర్ రెడ్డి, దిలీప్ కుమార్, రెడ్డి ప్రవీణ్, గాయత్రి, ఉదయభాను, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు పోటీలు
రాయచోటి టౌన్: ఈ నెల 22వ తేది ఆదివారం రాయచోటి డైట్ కళాశాలలో వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఈ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాసరచనతో పాటు వక్తృత్వ పోటీలు కూడా నిర్వహిహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. మరిన్ని వివరాల కోసం డైట్ అధ్యాపకులు శివభాస్కర్ 94413 28448, కె. శ్రీదేవి 7989189220, అసదుల్లా 94400 84715లకు ఫోన్ చేయాలన్నారు.
రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల ఎంపికకు దరఖాస్తు చేసుకోండి
రాజంపేట టౌన్: ఈనెల 21వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గూగుల్ షీట్‌లో ఆన్‌లైన్ ద్వారా ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లా క్రీడాకారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు కోసం రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి సాంకేతిక సహాయం కోసం టెక్నికల్ అఫిషియల్ ఏ.రామాంజనేయులును సంప్రదించవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునేవారు 18 సంవత్సరాలలోపు వారు అయితే ఎఫ్‌ఏఐ గుర్తింపు కార్డు, 18 సంవత్సరాలు పైబడిన వారైతే ఎఫ్‌ఏఐ గుర్తింపు కార్డుతో పాటు గతంలో పాల్గొన్న ఫె న్సింగ్ క్రీడ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తీసుకురావా లన్నారు. వివరాలకు 6301979079, 94908 6391 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
పరీక్షలను సక్రమంగా నిర్వహించాలి
గుర్రంకొండ: పాఠశాలల్లో నిర్వహిస్తున్న సమ్మెటివ్ అసెస్‌మెంట్ వన్ పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ అన్నారు. బుధవారం మండలంలోని ఖండ్రిగ ఉర్దూ హైస్కూల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాస్తున్న బయోలాజికల్ పరీక్షలపై ఆరా తీశారు. తరగతి గదుల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి ఉపాధ్యాయులకు తగు సూచనలిచ్చా రు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా పత్రాలను ఒక గంటముందు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఉపాధ్యాయులు తెచ్చుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ని ర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓ సురేంద్రబాబు, హెడ్మాస్టర్ జావీద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment